ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో సివిలియన్ ఉద్యోగాలు.. 10వ తరగతి, ఇంటర్ అర్హతతో పోస్టులు…వెంటనే అప్లై చేసుకోండి.
ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో సివిలియన్ ఉద్యోగాలు.. 10వ తరగతి, ఇంటర్ అర్హతతో పోస్టులు…వెంటనే అప్లై చేసుకోండి.
Indian Coast Guard Civilian Recruitment 2026:
ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో సివిలియన్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ముంబైలోని కోస్ట్ గార్డ్ రీజియన్ (వెస్ట్) ప్రధాన కార్యాలయం పరిధిలో వివిధ విభాగాల్లో మొత్తం 6 పోస్టులను ప్రత్యక్ష నియామకం ద్వారా భర్తీ చేయనున్నారు. ఇందులో స్టోర్ కీపర్ గ్రేడ్-II, ఇంజన్ డ్రైవర్, లస్కార్, సివిలియన్ మోటార్ ట్రాన్స్‌పోర్ట్ డ్రైవర్, MTS (ప్యూయాన్), MTS (చౌకీదార్) పోస్టులు ఉన్నాయి.
10వ తరగతి, ఇంటర్ అర్హతతో పాటు సంబంధిత పోస్టుకు అనుభవం ఉన్న భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి కేంద్ర ప్రభుత్వ పే లెవల్స్ ప్రకారం జీతాలు అందుతాయి. అభ్యర్థులు పోస్టు ద్వారా దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులు చేరేందుకు చివరి తేదీ 03 నవంబర్ 2026.
పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :
సంస్థ పేరు : ఇండియన్ కోస్ట్ గార్డ్ సివిలియన్ ఉద్యోగాలు
పోస్టుల వివరాలు : స్టోర్ కీపర్ గ్రేడ్-II, ఇంజన్ డ్రైవర్, లస్కార్, సివిలియన్ మోటార్ ట్రాన్స్‌పోర్ట్ డ్రైవర్, MTS (ప్యూయాన్), MTS (చౌకీదార్) పోస్టులు ఉన్నాయి.
మొత్తం పోస్టులు : 06
విద్య అర్హతలు & వయస్సు & జీతం వివరాలు :
స్టోర్ కీపర్ గ్రేడ్-II – 1 పోస్టు :
12వ తరగతి ఉత్తీర్ణతతో పాటు స్టోర్ల నిర్వహణలో కనీసం ఏడాది అనుభవం ఉండాలి. ఈ పోస్టుకు పే లెవల్-2 ప్రకారం రూ.19,900–రూ.63,200 వరకు వేతనం ఉంటుంది. వయసు 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఇంజన్ డ్రైవర్ – 1 పోస్టు :
10వ తరగతి లేదా తత్సమాన అర్హతతో పాటు గుర్తింపు పొందిన ప్రభుత్వ సంస్థ నుంచి ఇంజన్ డ్రైవర్ సామర్థ్య ధ్రువపత్రం అవసరం. 400 బోట్ హార్స్ పవర్‌కు పైగా ఉన్న నౌకలో సారంగ్‌గా రెండేళ్ల అనుభవం ఉండాలి. పే లెవల్-4లో రూ.25,500–రూ.81,100 వరకు వేతనం లభిస్తుంది. వయసు 18–30 సంవత్సరాలు.
లస్కార్ – 1 పోస్టు :
10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు పడవ సేవలో మూడేళ్ల అనుభవం అవసరం. ఈ పోస్టుకు పే లెవల్-1లో రూ.18,000–రూ.56,900 వరకు జీతం ఉంటుంది. వయసు 18–30 సంవత్సరాలు.
సివిలియన్ మోటార్ ట్రాన్స్‌పోర్ట్ డ్రైవర్ – 1 పోస్టు :
10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు లైట్, హెవీ మోటార్ వాహనాలకు చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. వాహనాల్లో సాధారణ లోపాలను గుర్తించి సరిచేయగల మోటార్ మెకానిజం పరిజ్ఞానం అవసరం. కనీసం రెండేళ్ల డ్రైవింగ్ అనుభవం ఉండాలి. వయసు 18–27 సంవత్సరాలు. పే లెవల్-2లో రూ.19,900–రూ.63,200 వరకు వేతనం ఉంటుంది.
MTS (ప్యూయాన్) – 1 పోస్టు :
10వ తరగతి లేదా తత్సమాన అర్హతతో పాటు ఆఫీస్ అటెండెంట్‌గా రెండేళ్ల అనుభవం ఉండాలి. వయసు 18–27 సంవత్సరాలు. పే లెవల్-1 ప్రకారం రూ.18,000–రూ.56,900 వరకు జీతం లభిస్తుంది.
MTS (చౌకీదార్) – 1 పోస్టు :
10వ తరగతి లేదా తత్సమాన అర్హతతో పాటు గుర్తింపు పొందిన సంస్థలో చౌకీదార్‌గా రెండేళ్ల అనుభవం అవసరం. వయసు 18–27 సంవత్సరాలు. ఈ పోస్టుకు రూ.18,000–రూ.56,900 వరకు వేతనం ఉంటుంది.
వయోపరిమితిలో సడలింపు:
రిజర్వేషన్ కేటగిరీలకు చెందిన అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది. అర్హత ఉన్న పోస్టులకు OBC (Non-Creamy Layer) అభ్యర్థులకు 3 సంవత్సరాలు, SC అభ్యర్థులకు 5 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులకు కూడా నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తించవచ్చు.
ఎంపిక విధానం :
అందిన దరఖాస్తులను మొదట విద్యార్హతలు, అనుభవం, అవసరమైన పత్రాల ఆధారంగా పరిశీలిస్తారు. అర్హులైన అభ్యర్థులను తదుపరి ఎంపిక ప్రక్రియకు షార్ట్‌లిస్ట్ చేస్తారు.
షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులకు ముందుగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు. ఈ సమయంలో ఒరిజినల్ సర్టిఫికెట్లు, అవసరమైన పత్రాలను సమర్పించాలి. బయోమెట్రిక్ ధృవీకరణలో భాగంగా వేలిముద్రలు, ఫొటో కూడా తీసుకుంటారు.
ఆ తర్వాత రాత పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష పెన్-పేపర్ విధానంలో ఒక గంట పాటు ఉంటుంది. మొత్తం 80 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 80 మార్కులు ఉంటాయి. ముఖ్యంగా ఈ పరీక్షలో నెగెటివ్ మార్కింగ్ లేదు.
రాత పరీక్ష సిలబస్ :
రాత పరీక్షలో సాధారణంగా కింది అంశాల నుంచి ప్రశ్నలు ఉంటాయి:
సాధారణ జ్ఞానం
గణితం
జనరల్ ఇంగ్లిష్
సంబంధిత పోస్టుకు సంబంధించిన ట్రేడ్/వృత్తి అంశాలు
దరఖాస్తు విధానం :
అభ్యర్థులు నోటిఫికేషన్‌లో ఇచ్చిన నిర్దేశిత దరఖాస్తు ఫార్మాట్‌ను ఉపయోగించి ఇంగ్లిష్ లేదా హిందీలో దరఖాస్తు పూర్తి చేయాలి. దరఖాస్తుతో పాటు స్వీయ ధృవీకరణ చేసిన ఫొటో, విద్యార్హత సర్టిఫికెట్లు, మార్కుల మెమోలు, కేటగిరీ సర్టిఫికెట్, అనుభవ ధ్రువపత్రం తదితర పత్రాల ప్రతులను జత చేయాలి.
ప్రభుత్వ సంస్థలో పనిచేస్తున్న అభ్యర్థులు అవసరమైనప్పుడు సంబంధిత యజమాని నుంచి NOC సమర్పించాలి. అభ్యర్థి పేరు, చిరునామాతో రూ.50 పోస్టల్ స్టాంప్ అతికించిన ఖాళీ కవర్‌ను కూడా దరఖాస్తుతో పంపాలి.
దరఖాస్తుకు జత చేసే పత్రాలు 03 నవంబర్ 2026 నాటికి లేదా అంతకంటే ముందు జారీ చేసినవిగా ఉండాలి. అసలు సర్టిఫికెట్లను దరఖాస్తుతో పంపాల్సిన అవసరం లేదు.
దరఖాస్తు పంపాల్సిన చిరునామా :
పూర్తిగా నింపిన దరఖాస్తును అవసరమైన పత్రాలతో కలిసి సాధారణ పోస్టు ద్వారా ఈ చిరునామాకు పంపాలి:
Headquarters, Coast Guard Region (West),
Alexander Graham Bell Road,
PO Malabar Hill,
Mumbai – 400006.
ఎంప్లాయ్‌మెంట్ న్యూస్‌లో నోటిఫికేషన్ ప్రచురించిన తేదీ నుంచి 45 రోజుల్లోపు దరఖాస్తు సంబంధిత కార్యాలయానికి చేరాలి. ఈ నోటిఫికేషన్ ప్రకారం చివరి తేదీ 03 నవంబర్ 2026.
ముఖ్యమైన తేదీ :
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: 03 నవంబర్ 2026
Notification & Application Pdf Click Here