మహిళలకు ఉచితంగా కుట్టుమిషన్.. దరఖాస్తు గడువు సెప్టెంబర్ 30 వరకు పొడిగింపు…!
మహిళలకు ఉచితంగా కుట్టుమిషన్.. దరఖాస్తు గడువు సెప్టెంబర్ 30 వరకు పొడిగింపు…!
Free Intintiki Indiramma Kuttu Machine 2026 Last Date Extended:
తెలంగాణ రాష్ట్రంలోని బీసీ మహిళలకు శుభవార్త. స్వయం ఉపాధి పొందేందుకు తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ఇంటింటికి ఇందిరమ్మ కుట్టు మిషన్ పథకం దరఖాస్తు గడువును పొడిగించింది. అర్హులైన మహిళలు సెప్టెంబర్ 30, 2026 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
బీసీ నిరుద్యోగ మహిళలకు 100 శాతం సబ్సిడీతో ఆటోమేటిక్ కుట్టుమిషన్లు అందించేందుకు ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో సుమారు 1,000 మంది చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 1.19 లక్షల మంది మహిళలకు కుట్టుమిషన్లు అందించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
ఇంటింటికి ఇందిరమ్మ కుట్టు మిషన్ అర్హతలు:
1. తెలంగాణ రాష్ట్రానికి చెందిన మహిళ అయి ఉండాలి.
2. బీసీ వర్గానికి చెందిన నిరుద్యోగ మహిళలు అర్హులు.
3. వయస్సు 18 నుంచి 55 సంవత్సరాల మధ్య ఉండాలి.
4. కనీసం 5వ తరగతి లేదా ఆపై చదివిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
5. గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబ వార్షిక ఆదాయం రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలకు మించకూడదు.
6. ఒక కుటుంబానికి ఒక యూనిట్ మాత్రమే మంజూరు చేస్తారు.
7. ఒంటరి మహిళలు, వితంతువులు, వికలాంగులు, అనాథలు, అలాగే టైలరింగ్ వృత్తిలో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వనున్నారు.
కావాల్సిన ధ్రువపత్రాలు :
దరఖాస్తు సమయంలో కింది డాక్యుమెంట్లను సిద్ధంగా ఉంచుకోవాలి:
ఆధార్ కార్డు
రేషన్ కార్డు
కుల ధ్రువీకరణ పత్రం
ఆదాయ ధ్రువీకరణ పత్రం
బ్యాంకు పాస్‌బుక్
టైలరింగ్ శిక్షణ సర్టిఫికేట్
దరఖాస్తుదారు ఫోటో
కుట్టు మిషన్ కోసం ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలి?
1. ముందుగా తెలంగాణ OBMMS అధికారిక వెబ్సైట్ ( https://tgobmms.cgg.gov.in/ ) ను ఓపెన్ చేయాలి.
2. హోమ్‌పేజీలో “Apply Online for availing the Intintiki Indiramma Kuttu Machine scheme (BC Corporation – 2026-27)” అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
3. దరఖాస్తులో అడిగిన వివరాలను నమోదు చేయాలి. ఇందులో పేరు, ఆధార్ నంబర్, రేషన్ కార్డు నంబర్, తండ్రి/భర్త పేరు, ఆదాయ ధ్రువీకరణ పత్రం నంబర్, పుట్టిన తేదీ, వయస్సు, వార్షిక ఆదాయం, మొబైల్ నంబర్, కుల ధ్రువీకరణ పత్రం నంబర్ తదితర వివరాలు నమోదు చేయాలి.
4. చిరునామా వివరాల్లో జిల్లా, నియోజకవర్గం, మండలం/పురపాలక సంఘం, గ్రామం/పంచాయతీ, పిన్‌కోడ్, డోర్ నంబర్ తదితర వివరాలను నమోదు చేయాలి.
5. దరఖాస్తుదారు ఫోటో మరియు టైలరింగ్ శిక్షణ సర్టిఫికేట్‌ను సూచించిన JPG/PNG ఫార్మాట్లో అప్లోడ్ చేయాలి.
6. చివరగా Self Declaration బాక్స్‌ను టిక్ చేసి, Preview ద్వారా దరఖాస్తులోని వివరాలను పరిశీలించాలి. అన్ని వివరాలు సరిగ్గా ఉంటే అప్లికేషన్‌ను Submit చేయాలి.
Apply Link : Click Here