నిరుద్యోగులకు శుభవార్త.. కాకినాడ లో ఆగస్టు 7న KITS ఇంజినీరింగ్ కాలేజీలో మెగా జాబ్ మేళా | 900కు పైగా ఉద్యోగాలు :
నిరుద్యోగులకు శుభవార్త.. కాకినాడ లో ఆగస్టు 7న KITS ఇంజినీరింగ్ కాలేజీలో మెగా జాబ్ మేళా | 900కు పైగా ఉద్యోగాలు :
కాకినాడ మెగా జాబ్ మేళా 2026 :
నిరుద్యోగ యువతకు మరో అద్భుతమైన అవకాశం లభించింది. కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలోని దివిలి గ్రామంలో ఉన్న KITS Engineering College వేదికగా 2026 ఆగస్టు 7న భారీ మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఈ ఉద్యోగ మేళాలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖ సంస్థలు పాల్గొని అర్హులైన అభ్యర్థులను నేరుగా ఎంపిక చేయనున్నాయి.
ఈ జాబ్ మేళాలో ఐటీ, ఫార్మా, ఆటోమొబైల్, బ్యాంకింగ్, నిర్మాణ రంగాలకు చెందిన 15 ప్రముఖ కంపెనీలు పాల్గొంటున్నాయి. మొత్తం 900కు పైగా ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయనున్నారు. విద్యార్హతలకు అనుగుణంగా ఉద్యోగ అవకాశాలు ఉండటంతో నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు సూచిస్తున్నారు.
జాబ్ మేళా లోపాల్గొనే సంస్థలు – ఖాళీల వివరాలు :
| క్రమ సంఖ్య | సంస్థ పేరు | ఖాళీలు |
|---|---|---|
| 1 | టెక్ మహీంద్రా (Tech Mahindra) | 50 |
| 2 | విప్రో లిమిటెడ్ (Wipro Limited) | 100 |
| 3 | ఫోన్‌పే (PhonePe) | 45 |
| 4 | ఎస్బీఐ (SBI) | 100 |
| 5 | ప్రీమియర్ సోలార్ (Premier Solar) | 40 |
| 6 | ఎస్డీవీవీఎల్ సర్వే అండ్ కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ | 3 |
| 7 | ఎస్డీవీవీఎల్ స్కిల్ హబ్ | 8 |
| 8 | హానర్ ల్యాబ్ లిమిటెడ్ (Honour Lab Limited) | 50 |
| 9 | ఆరోబిందో ఫార్మా (Aurobindo Pharma) | 40 |
| 10 | క్వెస్ కార్ప్ లిమిటెడ్ (Quess Corp Ltd) | 50 |
| 11 | కియా (Kia) | 200 |
| 12 | ష్నైడర్ ఎలక్ట్రిక్ (Schneider Electric) | 30 |
| 13 | రాయల్ ఎన్ఫీల్డ్ (Royal Enfield) | 60 |
| 14 | మెడ్‌ప్లస్ (MedPlus) | 13 |
| 15 | అపోలో (Apollo) | 120 |
జాబ్ మేళాకు హాజరయ్యే అభ్యర్థులు తీసుకురావాల్సినవి :
1. తాజా రెజ్యూమ్ (Resume)
2. విద్యార్హతల ఒరిజినల్ మరియు జిరాక్స్ సర్టిఫికెట్లు
3. ఆధార్ కార్డు లేదా ఇతర గుర్తింపు కార్డు
4. పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు
5. అవసరమైతే అనుభవ ధ్రువపత్రాలు
జాబ్ మేళా వివరాలు :
తేదీ: 07 ఆగస్టు 2026 (శుక్రవారం)
వేదిక: KITS Engineering College, దివిలి గ్రామం, పెద్దాపురం నియోజకవర్గం, కాకినాడ జిల్లా
మొత్తం ఖాళీలు: 900+
పాల్గొనే కంపెనీలు: 15
సంప్రదించాల్సిన మొబైల్ నంబర్: 9949156583
ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు ఈ మెగా జాబ్ మేళాకు తప్పకుండా హాజరై తమ అర్హతలకు అనుగుణంగా ఉద్యోగ అవకాశాలను పొందే ప్రయత్నం చేయాలని నిర్వాహకులు సూచిస్తున్నారు.