Library Jobs 2026: 12వ తరగతి అర్హతతో గ్రంథాలయ శాస్త్ర శిక్షణ – వెంటనే అప్లై చేయండి.
Library Jobs 2026: 12వ తరగతి అర్హతతో గ్రంథాలయ శాస్త్ర శిక్షణ – వెంటనే అప్లై చేయండి.
Library Jobs 2026:
నిరుద్యోగ యువతకు మంచి అవకాశం అందుబాటులోకి వచ్చింది. గ్రంథాలయ రంగంలో కెరీర్‌ను ప్రారంభించాలనుకునే వారికి సర్టిఫికెట్ కోర్స్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ (CLISC) 2026 కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఈ కోర్సును విజయవాడలోని పాతూరి నాగభూషణం గ్రంథాలయ శిక్షణ కేంద్రం నిర్వహిస్తోంది.
ఈ శిక్షణ కార్యక్రమం 2026 జూన్ నెల నుంచి ప్రారంభమవుతుంది. మొత్తం ఐదు నెలల పాటు ఈ కోర్సు కొనసాగుతుంది. తరగతులు తెలుగు మరియు ఆంగ్ల భాషల్లో నిర్వహించబడతాయి. మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం.
కోర్సు ముఖ్యాంశాలు – విద్య అర్హతలు , ఎంపిక విధానం పూర్తి వివరాలు :
కోర్సు పేరు: సర్టిఫికెట్ కోర్స్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ (CLISC)
శిక్షణ కాలం: 5 నెలలు
శిక్షణ ప్రారంభం: జూన్ 2026
బోధనా భాషలు: తెలుగు & ఆంగ్లం
విద్యార్హత:
అభ్యర్థులు తప్పనిసరిగా ఇంటర్మీడియట్ (12వ తరగతి) ఉత్తీర్ణులు అయి ఉండాలి.
వయోపరిమితి:
కనీసం 18 సంవత్సరాలు నిండిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక విధానం:
అభ్యర్థులను ఇంటర్‌లో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.
శిక్షణ స్థలం:
విజయవాడలోని పాతూరి నాగభూషణం గ్రంథాలయ శిక్షణ కేంద్రం
ముఖ్యమైన తేదీ:
దరఖాస్తు చివరి తేదీ: 29 ఏప్రిల్ 2026
సంప్రదించాల్సిన వివరాలు:
మరిన్ని వివరాల కోసం: 7995313148, 9290670671
గ్రంథాలయ రంగంలో మంచి అవకాశాలను అందిపుచ్చుకోవాలనుకునే వారికి ఇది సరైన అవకాశం. ఆసక్తి ఉన్న అభ్యర్థులు చివరి తేదీకి ముందు దరఖాస్తు చేసి ఈ కోర్సులో చేరండి.
For More Jobs Information:
Follow Our What’s App Channel : Join Now
Follow Our Telegram Channel : Join Now
Follow Our Instagram Channel : Join Now
Follow Our Youtube Channel : Join Now