Mahindra EmpowerHer Scholarship Program 2026-27: విద్యార్థినులకు రూ.5,500 వరకు స్కాలర్‌షిప్.. అర్హతలు, దరఖాస్తు విధానం:
Mahindra EmpowerHer Scholarship Program 2026-27: విద్యార్థినులకు రూ.5,500 వరకు స్కాలర్‌షిప్.. అర్హతలు, దరఖాస్తు విధానం:
Mahindra EmpowerHer Scholarship Program 2026-27:
విద్యార్థినులకు శుభవార్త. మహీంద్రా సంస్థ అందిస్తున్న Mahindra EmpowerHer Scholarship Program 2026-27 ద్వారా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన బాలిక విద్యార్థులకు చదువును కొనసాగించేందుకు ఆర్థిక సహాయం అందిస్తోంది. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు చెందిన విద్యార్థినులకు ఈ స్కాలర్‌షిప్‌లో అవకాశం కల్పిస్తున్నారు.
మహీంద్రా ఎంపవరెహర్ స్కాలర్‌షిప్ 2026-27 :
ఆర్థిక ఇబ్బందుల కారణంగా విద్యార్థినుల చదువుకు అంతరాయం కలగకుండా ప్రోత్సహించడమే ఈ స్కాలర్‌షిప్ ప్రధాన ఉద్దేశం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన అర్హత ఉన్న బాలిక విద్యార్థులు ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ స్కాలర్‌షిప్‌కు 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న బాలికలు, అలాగే అండర్‌గ్రాడ్యుయేట్, పోస్ట్‌గ్రాడ్యుయేట్ కోర్సులు చదువుతున్న విద్యార్థినులు కూడా అర్హులు.
ఏ కోర్సులు చదువుతున్నవారు అర్హులు?
అండర్‌గ్రాడ్యుయేట్ స్థాయిలో BA, BA Hons, B.Sc, B.Com వంటి కోర్సులు చదువుతున్న విద్యార్థినులు దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్ట్‌గ్రాడ్యుయేట్ స్థాయిలో MA, MA Hons, M.Sc, M.Com వంటి కోర్సులు చదువుతున్న విద్యార్థినులకు కూడా అవకాశం ఉంది.
అర్హతలు :
1. దరఖాస్తుదారు బాలిక విద్యార్థి అయి ఉండాలి.
2. ఎస్సీ, ఎస్టీ లేదా ఓబీసీ వర్గానికి చెందినవారు అయి ఉండాలి.
3. గత విద్యా సంవత్సరంలో కనీసం 50 శాతం మార్కులు సాధించి ఉండాలి.
4. కుటుంబ వార్షిక ఆదాయం రూ.4 లక్షలకు మించకూడదు.
5. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన విద్యార్థినులు దరఖాస్తు చేసుకోవచ్చు.
6. దివ్యాంగ విద్యార్థినులకు ఎంపికలో ప్రాధాన్యత ఇవ్వవచ్చు.
స్కాలర్‌షిప్ ఎంత?
ఈ స్కాలర్‌షిప్‌కు ఎంపికైన అర్హులైన విద్యార్థినులకు రూ.5,500 వరకు స్కాలర్‌షిప్ అవార్డు అందించబడుతుంది. ఈ ఆర్థిక సహాయం విద్యా ఖర్చులకు ఉపయోగపడుతుంది.
మార్కుల విషయంలో ముఖ్యమైన సమాచారం :
ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫలితాలు ఇంకా విడుదల కాకపోతే, అందుబాటులో ఉన్న చివరి సంవత్సరం లేదా చివరి సెమిస్టర్ మార్కుల ఆధారంగా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది.
అవసరమైన పత్రాలు :
దరఖాస్తు సమయంలో విద్యార్థినులు కింది పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలి:
1. పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో
2. ప్రభుత్వ గుర్తింపు పొందిన మార్కుల మెమో/మార్క్‌షీట్
3. ఆధార్ కార్డు
4. ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ కుల ధ్రువీకరణ పత్రం
5. పాఠశాల లేదా కళాశాల ఫీజు రసీదు
6. బ్యాంక్ పాస్‌బుక్ లేదా బ్యాంక్ ఖాతా వివరాలు
7. అవసరమైన ఇతర విద్యా పత్రాలు
ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
అర్హత ఉన్న విద్యార్థినులు Buddy4Study వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకునే ముందు అర్హతలు, అవసరమైన పత్రాలు మరియు ఇతర నిబంధనలను అధికారిక స్కాలర్‌షిప్ పేజీలో తప్పనిసరిగా పరిశీలించాలి.
Mahindra EmpowerHer Scholarship Program 2026 27 Apply Link