Govt. Schemes

మైనర్లకు వాహనాలు ఇస్తున్నారా? కొత్త ట్రాఫిక్ నిబంధనలు అమల్లోకి.. తల్లిదండ్రులకు భారీ జరిమానా, జైలు శిక్ష కూడా!

calendar_month July 10, 2026 person chitra

మైనర్లకు వాహనాలు ఇస్తున్నారా? కొత్త ట్రాఫిక్ నిబంధనలు అమల్లోకి.. తల్లిదండ్రులకు భారీ జరిమానా, జైలు శిక్ష కూడా!

Minor Driving New Traffic Rules 2026:

మైనర్ పిల్లలు వాహనాలు నడపడం వల్ల జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు రవాణా శాఖ, ట్రాఫిక్ పోలీసులు కఠిన చర్యలు చేపడుతున్నారు. 18 సంవత్సరాల లోపు ఉన్న వారికి టూ వీలర్ లేదా ఫోర్ వీలర్ నడిపేందుకు అనుమతిస్తే, వాహనం యజమాని లేదా తల్లిదండ్రులే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది. కొత్త ట్రాఫిక్ నిబంధనల ప్రకారం మైనర్ డ్రైవింగ్‌పై కఠిన శిక్షలు అమలు చేస్తున్నారు.

మైనర్ డ్రైవింగ్ చేస్తే ఏం జరుగుతుంది?

18 ఏళ్లలోపు వ్యక్తి వాహనం నడుపుతూ ట్రాఫిక్ పోలీసులకు పట్టుబడితే, ఆ వాహనానికి సంబంధించిన రిజిస్ట్రేషన్‌ను 12 నెలల పాటు రద్దు చేసే అవకాశం ఉంది. అంతేకాకుండా మైనర్‌పై కూడా ప్రత్యేక చర్యలు తీసుకుంటారు. గత ఆర్థిక సంవత్సరంలో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనల కారణంగా వేలాది వాహనాల రిజిస్ట్రేషన్లు రద్దు చేసినట్లు అధికారులు వెల్లడించారు.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

తల్లిదండ్రులకు రూ.25 వేల జరిమానా.. జైలు శిక్ష కూడా …

మైనర్ పిల్లలకు వాహనం ఇచ్చి నడిపించినట్లు నిర్ధారణ అయితే, వాహన యజమాని లేదా తల్లిదండ్రులకు రూ.25,000 వరకు జరిమానా విధించవచ్చు. అదనంగా మూడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం కూడా ఉంటుంది. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ మైనర్ పిల్లలకు వాహనాల తాళాలు ఇవ్వవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.

25 ఏళ్ల వరకు డ్రైవింగ్ లైసెన్స్ రాదు ?

మైనర్ డ్రైవింగ్ చేస్తూ పట్టుబడిన బాలుడు లేదా బాలికకు 25 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేయరాదని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో భవిష్యత్తులో కూడా వారు చట్టపరమైన ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది.

మోటార్ వాహన చట్టం ప్రకారం కఠిన చర్యలు: 

మోటార్ వాహన చట్టం-2019లోని సెక్షన్ 199A ప్రకారం మైనర్ వాహనం నడిపితే, ఆ నేరానికి వాహన యజమాని లేదా సంరక్షకుడే బాధ్యుడిగా పరిగణిస్తారు. తెలంగాణ రవాణా శాఖ, హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సహా రాష్ట్రవ్యాప్తంగా ఈ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని నిర్ణయించారు.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

తల్లిదండ్రులకు అధికారుల సూచనలు :

రోడ్డు భద్రతను మెరుగుపరచడం, మైనర్ పిల్లల ప్రాణాలను కాపాడడంతో పాటు ఇతర ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని, 18 ఏళ్లలోపు ఉన్న పిల్లలకు ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనాలు ఇవ్వొద్దని రవాణా శాఖ, ట్రాఫిక్ పోలీసులు తల్లిదండ్రులు మరియు వాహన యజమానులకు స్పష్టమైన సూచనలు జారీ చేశారు. 18 సంవత్సరాలు పూర్తి కాకముందు పిల్లలు వాహనాలు నడపకుండా తల్లిదండ్రులు ప్రత్యేకంగా పర్యవేక్షించాలని, ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని విజ్ఞప్తి చేశారు.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe
Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *