Govt. Schemes

AP Government : నేతన్న భరోసా పథకం 2026: చేనేత కార్మికులకు రూ.25 వేల సాయం.. క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్

calendar_month July 24, 2026 person chitra

AP Government: నేతన్న భరోసా పథకం 2026: చేనేత కార్మికులకు రూ.25 వేల సాయం.. క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్

AP Netanna Bharosa Scheme 2026 Release:

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేనేత రంగాన్ని బలోపేతం చేయడానికి నేతన్న భరోసా పథకం 2026 కింద అర్హులైన చేనేత కార్మికులకు రూ.25,000 చొప్పున ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని వేలాది చేనేత కుటుంబాలకు ఆర్థిక భరోసా లభించనుంది. ముడిసరుకు కొనుగోలు, నూలు, రంగులు మరియు ఇతర ఉత్పత్తి అవసరాలకు ఈ సాయం ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో 3,168 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి క్యాబినెట్ ఆమోదం తెలిపింది.

అలాగే, నేతన్న భరోసా పథకం కింద అర్హులైన చేనేత కార్మికులకు రూ.25,000 చొప్పున ఆర్థిక సహాయం అందించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గోదావరి పుష్కరాల భద్రత కోసం రూ.50 కోట్లు మంజూరు చేయగా, మార్క్‌ఫెడ్‌కు రూ.300 కోట్ల రుణానికి సెంట్రల్ బ్యాంక్ గ్యారంటీ ఇవ్వాలని నిర్ణయించింది. బాపట్లలో వినికిడి లోపం ఉన్న విద్యార్థుల కోసం ప్రత్యేక డిగ్రీ కళాశాల ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే, పొగాకు రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపడుతున్న చర్యలను ప్రజలకు విస్తృతంగా వివరించేలా మంత్రులు ప్రో-యాక్టివ్‌గా వ్యవహరించాలని సీఎం చంద్రబాబు సూచించారు.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

నేతన్న భరోసా పథకం ముఖ్యాంశాలు :

1. అర్హులైన చేనేత కార్మికులకు రూ.25,000 ఆర్థిక సాయం

2. రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం

3. 3,168 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్

4. గోదావరి పుష్కరాలకు రూ.50 కోట్ల మంజూరు

5. బాపట్లలో ప్రత్యేక డిగ్రీ కళాశాల ఏర్పాటు

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

6. రైతులు, చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యం

నేతన్న భరోసా పథకం 2026 అమలుతో చేనేత కుటుంబాలకు ఆర్థికంగా పెద్ద ఊరట లభించనుంది. ఈ పథకానికి సంబంధించిన పూర్తి మార్గదర్శకాలు, అర్హతలు, దరఖాస్తు విధానం వంటి వివరాలను ప్రభుత్వం త్వరలో విడుదల చేసే అవకాశం ఉంది.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe
Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *