Govt. Schemes

ఏపీలో కొత్త నేతన్న సేవలో పథకం.. చేనేత కుటుంబాలకు ఏడాదికి ₹25,000 ఆర్థిక సాయం.. పూర్తి వివరాలు..AP Netannala Sevalo scheme 2026 :

calendar_month July 28, 2026 person chitra

ఏపీలో కొత్త నేతన్న సేవలో పథకం.. చేనేత కుటుంబాలకు ఏడాదికి ₹25,000 ఆర్థిక సాయం.. పూర్తి వివరాలు.. AP Netannala Sevalo scheme 2026 :

ఏపీలో కొత్త నేతన్న సేవలో పథకం 2026 :

చేనేత కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేనేత కార్మికుల సంక్షేమం కోసం “నేతన్న సేవలో” పేరుతో కొత్త పథకాన్ని అమలు చేయనున్నట్లు ప్రకటించింది.ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని అర్హత కలిగిన చేనేత కుటుంబాలకు ప్రతి సంవత్సరం ₹25,000 చొప్పున నేరుగా ఆర్థిక సహాయం అందించనున్నారు.

రాష్ట్రంలోని చేనేత కార్మికుల జీవనోపాధిని బలోపేతం చేయడం, సంప్రదాయ చేనేత రంగాన్ని ప్రోత్సహించడం, చేనేత కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడం ఈ పథకం ప్రధాన ఉద్దేశం. పెరుగుతున్న ఉత్పత్తి వ్యయాలు, మార్కెట్ పోటీ వంటి సవాళ్లను ఎదుర్కొంటున్న చేనేత కుటుంబాలకు ఈ వార్షిక ఆర్థిక సాయం ఎంతో ఉపయోగపడనుంది. ప్రభుత్వం అందించే ఈ సహాయం ద్వారా మగ్గాల నిర్వహణ, ముడి సరుకుల కొనుగోలు, ఇతర అవసరాలను సులభంగా తీర్చుకునే అవకాశం ఉంటుంది.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

నేతన్న సేవలో పథకం అంటే ఏమిటి?

జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించనుంది. రాష్ట్ర మంత్రివర్గం (క్యాబినెట్) ఇప్పటికే ఈ పథకానికి ఆమోదం తెలిపినట్లు ప్రభుత్వం వెల్లడించింది. చేనేత వృత్తిపై ఆధారపడే కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడం ఈ పథకం ప్రధాన లక్ష్యం.

ఎంతమందికి లబ్ధి?

ప్రభుత్వ అంచనాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా సుమారు 51,952 మంది చేనేత కార్మికులు మరియు కుటుంబాలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందే అవకాశం ఉంది.

ఎంత ఆర్థిక సహాయం అందుతుంది?

1. ప్రతి అర్హత కలిగిన చేనేత కుటుంబానికి ఏడాదికి ₹25,000

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

2. మొత్తం నగదును ప్రత్యక్ష లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో (DBT) ద్వారా జమ చేయనున్నారు.

ఎవరు అర్హులు?

ఈ పథకం కింద కింది వర్గాల వారు అర్హులుగా పరిగణించబడతారు.

1. సొంత మగ్గం కలిగి చేనేత వృత్తి చేస్తున్న కుటుంబాలు

2. రంగులు అద్దే (డైయింగ్) కార్మికులు

3. రాట్నం వడికే కార్మికులు

4. చేనేత అనుబంధ వృత్తుల్లో పనిచేసే ఇతర కార్మికులు

5. దారిద్య రేఖ (BPL) కింద ఉన్న అర్హులైన కుటుంబాలు

వయస్సుతో సంబంధం లేదు :

ఈ పథకంలో ముఖ్యమైన అంశం ఏమిటంటే వయస్సుతో ఎలాంటి సంబంధం ఉండదు. అర్హత ప్రమాణాలు పూర్తి చేసిన ప్రతి చేనేత కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించనుంది.

ముఖ్యాంశాలు :

పథకం పేరు: నేతన్న సేవలో (Netannala Sevalo Scheme 2026)

రాష్ట్రం: ఆంధ్రప్రదేశ్

ఆర్థిక సహాయం: ఏడాదికి ₹25,000

లబ్ధిదారులు: సుమారు 51,952 చేనేత కుటుంబాలు

చెల్లింపు విధానం: DBT ద్వారా బ్యాంకు ఖాతాలో జమ

అర్హులు: చేనేత వృత్తిలో ఉన్న BPL కుటుంబాలు మరియు అనుబంధ కార్మికులు

వయస్సు: పరిమితి లేదు

 

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe
Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *