NTR Bharosa Pension 2026: ఫీల్డ్ వెరిఫికేషన్ ప్రారంభం.. ఇంటికి వచ్చి ఇవి చెక్ చేస్తారు.
NTR Bharosa Pension 2026: ఫీల్డ్ వెరిఫికేషన్ ప్రారంభం.. ఇంటికి వచ్చి ఇవి చెక్ చేస్తారు.
NTR Bharosa Pension 2026:
ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా NTR Bharosa Pension 2026 కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఫీల్డ్ వెరిఫికేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. దరఖాస్తులో ఇచ్చిన వివరాలు, కుటుంబ పరిస్థితులు, ఆదాయం, భూమి, వాహనం, విద్యుత్ వినియోగం తదితర అంశాలను అధికారులు ఇంటికి వచ్చి పరిశీలిస్తారు.
ఫీల్డ్ వెరిఫికేషన్ సమయంలో దరఖాస్తుదారుల వయస్సు, కుటుంబ భూమి, వాహనం, విద్యుత్ వినియోగం, ఉద్యోగం, ఆదాయం, రేషన్ కార్డు వంటి వివరాలను అధికారులు పరిశీలిస్తారు.
కుటుంబానికి మాగాణి భూమి 3 ఎకరాల్లోపు, మెట్ట భూమి 10 ఎకరాల్లోపు ఉండాలి. టాక్సీ, ఆటో, ట్రాక్టర్‌లను మినహాయించి నాలుగు చక్రాల వాహనం ఉందా లేదా కూడా చెక్ చేస్తారు. గత 12 నెలల ఇంటి విద్యుత్ వినియోగ వివరాలను పరిశీలిస్తారు.
అలాగే కుటుంబంలో ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఉద్యోగులు ఉన్నారా, తెల్ల రేషన్ కార్డు ఉందా, పట్టణ ప్రాంతాల్లో 1,000 చదరపు అడుగుల లోపు నివాస భవనం ఉందా అనే అంశాలను పరిశీలిస్తారు. కుటుంబ నెలవారీ ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో ₹10,000లోపు, పట్టణ ప్రాంతాల్లో ₹12,000లోపు ఉండాలి.
కుటుంబంలో ఇతర పెన్షన్ పొందుతున్నవారు ఉన్నారా, ఆదాయపు పన్ను చెల్లిస్తున్నారా వంటి వివరాలను కూడా ధృవీకరిస్తారు. పెన్షన్ కేటగిరీకి అనుగుణంగా వితంతు, వికలాంగులు, ఒంటరి మహిళలు, వృత్తి, ట్రాన్స్‌జెండర్ పెన్షన్ తదితర సంబంధిత ధ్రువీకరణ పత్రాలను పరిశీలిస్తారు.
ఫీల్డ్ వెరిఫికేషన్‌ను వెల్ఫేర్ & ఎడ్యుకేషన్ అసిస్టెంట్ నిర్వహించి, వివరాలను ” మండల పరిషత్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ (MPDO)” కు పంపిస్తారు. ఇంకా NTR Bharosa Pensionకు దరఖాస్తు చేసుకోని వారు సెప్టెంబర్ 18, 2026లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఫీల్డ్ వెరిఫికేషన్‌లో పరిశీలించే అంశాలు :
1. దరఖాస్తుదారుడి వయస్సు
2. కుటుంబానికి ఉన్న భూమి వివరాలు
3. మినహాయింపు వాహనాలను పరిగణనలోకి తీసుకుని నాలుగు చక్రాల వాహనం ఉందా?
4. గత 12 నెలల ఇంటి విద్యుత్ వినియోగం
5. కుటుంబంలో ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఉద్యోగులు ఉన్నారా?
6. తెల్ల రేషన్ కార్డు వివరాలు
7. పట్టణ ప్రాంతాల్లో 1,000 చదరపు అడుగుల లోపు నివాస భవనం ఉందా?
8. గ్రామీణ ప్రాంతాల్లో నెలవారీ కుటుంబ ఆదాయం ₹10,000 లోపు, పట్టణ ప్రాంతాల్లో ₹12,000 లోపు ఉందా?
9. కుటుంబంలో ఇతర పెన్షన్లు ఉన్నాయా?
10. కుటుంబ సభ్యులు ఆదాయపు పన్ను చెల్లిస్తున్నారా?
11. సంబంధిత పెన్షన్ కేటగిరీకి అవసరమైన సర్టిఫికెట్లు ఉన్నాయా?
ఫీల్డ్ వెరిఫికేషన్ తర్వాత :
వెల్ఫేర్ & ఎడ్యుకేషన్ అసిస్టెంట్ వివరాలను పరిశీలించి, ఫారమ్‌పై సంతకం చేసిన అనంతరం సంబంధిత అధికారులకు పంపిస్తారు. అర్హత ఆధారంగా దరఖాస్తును అర్హులు/అనర్హులుగా నమోదు చేస్తారు.
ముఖ్యంగా: దరఖాస్తు సమయంలో ఇచ్చిన వివరాలకు సంబంధించిన ఆధార్, ఆదాయ ధ్రువీకరణ పత్రం, రేషన్ కార్డు, భూమి వివరాలు, వాహనం, విద్యుత్ వినియోగం, సంబంధిత పెన్షన్ సర్టిఫికెట్లు సిద్ధంగా ఉంచుకోవడం మంచిది.
ఇంకా దరఖాస్తు చేసుకోని వారు 18 సెప్టెంబర్ 2026లోపు దరఖాస్తు చేసుకోవాలి.
NTR Bharosa New Pension Application Verification form