నవోదయ విద్యాలయంలో ఉద్యోగాలు.. పరీక్ష లేకుండానే ఎంపిక | NVS Recruitment 2026…Apply Now :
నవోదయ విద్యాలయంలో ఉద్యోగాలు.. పరీక్ష లేకుండానే ఎంపిక | NVS Recruitment 2026…Apply Now :
Navodaya Vidyalaya Samiti Recruitment 2026:
ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు నవోదయ విద్యాలయ సమితి (NVS) శుభవార్త అందించింది. విజ్ఞాన్ జ్యోతి ప్రాజెక్టులో ప్రాజెక్ట్ సైంటిస్ట్-I, అకౌంటెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలను కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఒక సంవత్సరం కాలానికి భర్తీ చేయనున్నారు.
ఈ పోస్టులకు అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్ పరీక్ష రాయాల్సిన అవసరం లేకుండా ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత, వయోపరిమితి, అనుభవం వంటి వివరాలను పరిశీలించిన తర్వాత ఎంపిక ప్రక్రియ నిర్వహించనున్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు చివరి తేదీ లోపు తమ దరఖాస్తులను పంపించాలి.
NVS Recruitment 2026 పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :
సంస్థ పేరు : నవోదయ విద్యాలయంలో ఉద్యోగాలు
పోస్టుల వివరాలు :
1. ప్రాజెక్ట్ సైంటిస్ట్-I,
2. అకౌంటెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
విద్య అర్హతలు:
ప్రాజెక్ట్ సైంటిస్ట్-I :
ప్రాజెక్ట్ సైంటిస్ట్-I పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా విద్యాసంస్థ నుంచి సైన్స్‌లో డాక్టరేట్ డిగ్రీ (Ph.D.) లేదా ఇంజినీరింగ్/టెక్నాలజీలో మాస్టర్స్ డిగ్రీ లేదా దానికి సమానమైన విద్యార్హత కలిగి ఉండాలి.
అకౌంటెంట్ :
అకౌంటెంట్ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి బి.కామ్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అలాగే ప్రభుత్వ, అర్ధ ప్రభుత్వ లేదా స్వయంప్రతిపత్తి సంస్థలో అకౌంట్స్ విభాగంలో కనీసం మూడు సంవత్సరాల పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి :
10 ఆగస్టు 2026 నాటికి అభ్యర్థుల వయస్సు 18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉండాలి. వయోపరిమితికి సంబంధించిన ఇతర సడలింపులు నోటిఫికేషన్‌లో పేర్కొన్న నిబంధనల ప్రకారం వర్తిస్తాయి.
జీతం వివరాలు :
ఎంపికైన అభ్యర్థులకు పోస్టును బట్టి నెలకు రూ.40,000 నుంచి రూ.56,000 వరకు వేతనం లభిస్తుంది. ఉద్యోగ కాలం, వేతనం మరియు ఇతర నిబంధనలు సంబంధిత నియామక నిబంధనల ప్రకారం ఉంటాయి.
ఎంపిక విధానం :
ఈ రిక్రూట్‌మెంట్‌లో సాధారణ రాత పరీక్ష లేకుండా అభ్యర్థుల నుంచి ఈమెయిల్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అభ్యర్థుల విద్యార్హత, అనుభవం మరియు ఇతర అర్హతలను పరిశీలించిన అనంతరం తదుపరి ఎంపిక ప్రక్రియను నిర్వహిస్తారు.
అందువల్ల దరఖాస్తు చేసుకునే ముందు అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్‌లో ఉన్న అర్హతలు, అనుభవం, దరఖాస్తు ఫార్మాట్ మరియు ఇతర నిబంధనలను తప్పనిసరిగా పరిశీలించాలి.
ఎలా దరఖాస్తు చేయాలి?
అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు అనుబంధం-Iలో ఇచ్చిన దరఖాస్తు ఫార్మాట్ ప్రకారం తమ వివరాలను పూర్తి చేయాలి. అనంతరం దరఖాస్తును ప్రాజెక్ట్ కోఆర్డినేటర్, విజ్ఞాన్ జ్యోతి, NVS, నోయిడా వారికి ఈమెయిల్ ద్వారా పంపాలి.
దరఖాస్తులను vigyanjyotinvs@gmail.com ఈమెయిల్ ఐడీకి పంపించాలి. అభ్యర్థులు తమ దరఖాస్తులను 10 ఆగస్టు 2026లోపు పంపేలా చూసుకోవాలి.
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తుల ప్రారంభ తేదీ: 07 ఆగస్టు 2026
దరఖాస్తుకు చివరి తేదీ: 10 ఆగస్టు 2026
Notification & Application Pdf Click Here