Postal Jobs 2026: 10వ తరగతి అర్హతతో భారత తపాలా శాఖలో Dispatch Rider & MTS (Group-C) ఉద్యోగాలు – ఆఫ్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం….అప్లై చేసుకోండి.
Postal Jobs 2026: 10వ తరగతి అర్హతతో భారత తపాలా శాఖలో Dispatch Rider & MTS (Group-C) ఉద్యోగాలు – ఆఫ్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం….అప్లై చేసుకోండి.
Indian Postal Department Dispatch Rider & MTS (Group-C) Recruitment 2026:
ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు భారత తపాలా శాఖ (India Post) శుభవార్త అందించింది. Dispatch Rider (Group-C) మరియు MTS (Group-C) విభాగాల్లో ఖాళీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆఫ్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ మరియు సంబంధిత అనుభవం ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
అభ్యర్థుల ఎంపిక రాత పరీక్ష, డ్రైవింగ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ పరీక్ష ఆధారంగా జరుగుతుంది. ఆసక్తి గల అభ్యర్థులు 30 సెప్టెంబర్ 2026లోపు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు పంపించాలి. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పడు చూద్దాం.
పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :
సంస్థ పేరు : భారత తపాలా శాఖలో లో ఉద్యోగాలు
పోస్ట్ పేరు: Dispatch Rider (Group-C) / MTS (Group-C) పోస్టులు
శాఖ: భారత తపాలా శాఖ (India Post)
ఉద్యోగ స్వరూపం: రెగ్యులర్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం
విద్యార్హతలు :
దరఖాస్తుదారులు క్రింది అర్హతలు కలిగి ఉండాలి.
1. గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి ఉత్తీర్ణత.
2. అభ్యర్థులు తేలికపాటి (LMV) మరియు భారీ (HMV) మోటారు వాహనాలను నడపడానికి చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్‌ను తప్పనిసరిగా కలిగి ఉండాలి.
3. మోటార్ మెకానిజంపై ప్రాథమిక అవగాహన ఉండాలి.
4. తేలికపాటి మరియు భారీ వాహనాలను నడపడంలో కనీసం మూడు సంవత్సరాల అనుభవం ఉండాలి.
వయోపరిమితి :
దరఖాస్తుల చివరి తేదీ నాటికి అభ్యర్థుల గరిష్ట వయస్సు 56 సంవత్సరాలకు మించరాదు.
దరఖాస్తు రుసుము :
ఈ నియామకానికి ఎటువంటి దరఖాస్తు రుసుము లేదు.
నెలవారీ జీతం :
ఎంపికైన అభ్యర్థులకు 7వ వేతన సంఘం (7th CPC) ప్రకారం పే మ్యాట్రిక్స్ లెవల్-1 కింద రూ.18,000 నుంచి రూ.56,900 వరకు నెల జీతం చెల్లించబడుతుంది.
ఎంపిక విధానం :
అభ్యర్థులను క్రింది దశల ఆధారంగా ఎంపిక చేస్తారు.
1. రాత పరీక్ష
2. డ్రైవింగ్ టెస్ట్
3. డాక్యుమెంట్ వెరిఫికేషన్
4. మెడికల్ పరీక్ష
దరఖాస్తు విధానం :
అభ్యర్థులు నోటిఫికేషన్‌లో ఇచ్చిన అనుబంధం-I దరఖాస్తు ఫారమ్ను పూర్తిగా నింపి, అవసరమైన విద్యార్హతలు, డ్రైవింగ్ లైసెన్స్ మరియు అనుభవ ధృవీకరణ పత్రాల ప్రతులను జతచేసి స్పీడ్ పోస్టు ద్వారా మాత్రమే పంపించాలి.
పంపాల్సిన చిరునామా :
The Manager,
Mail Motor Service,
Bengaluru – 560001.
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తుల ప్రారంభ తేదీ: 01 ఆగస్టు 2026
దరఖాస్తుల చివరి తేదీ: 30 సెప్టెంబర్ 2026
Notification & Application Pdf Click Here
Official Website Click Here