రాత పరీక్ష లేకుండా 7వ తరగతి, ఇంటర్ అర్హతతో ప్రభుత్వ ప్రీ-ప్రైమరీ పాఠశాలల్లో టీచర్ & ఆయా ఉద్యోగాలు.. వెంటనే దరఖాస్తు చేసుకోండి! Pre-Primary Teacher & Ayamma Notification 2026:
రాత పరీక్ష లేకుండా 7వ తరగతి, ఇంటర్ అర్హతతో ప్రభుత్వ ప్రీ-ప్రైమరీ పాఠశాలల్లో టీచర్ & ఆయా ఉద్యోగాలు.. వెంటనే దరఖాస్తు చేసుకోండి! Pre-Primary Teacher & Ayamma Notification 2026:
Latest Pre Primary School Teacher & Ayamma Recruitment 2026 :
తెలంగాణ ప్రభుత్వం 2026-27 విద్యా సంవత్సరానికి జిల్లాలోని 275 ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ తరగతులను ప్రారంభించేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఆయా పాఠశాలల్లో ఇన్స్ట్రక్టర్ (టీచర్) మరియు ఆయా పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి మరియు అర్హత కలిగిన మహిళా అభ్యర్థులు సంబంధిత మండల విద్యాధికారి (MEO) కార్యాలయంలో దరఖాస్తులను సమర్పించవచ్చు.
ప్రభుత్వం విడుదల చేసిన Proc. Rc.No.830284(2102)/TSS/PDG/T6/2025, తేదీ 26-05-2026 ప్రకారం పాఠశాల విద్యాశాఖ మార్గదర్శకాలు ఈ నియామకాలకు వర్తిస్తాయి.
పోస్టుల వివరాలు మరియు నెలవారీ వేతనం వివరాలు :
సంస్థ పేరు : TS Pre Primary School లో ఉద్యోగాలు
పోస్టుల వివరాలు :
1. ఇన్స్ట్రక్టర్ (టీచర్)
2. ఆయా పోస్టులు
విద్యార్హతలు :
ఇన్స్ట్రక్టర్ (టీచర్) :
1. కనీసం ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత తప్పనిసరి.
2. Early Childhood Care లేదా Nursery Training అర్హత కలిగిన వారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.
ఆయా :
1. కనీసం 7వ తరగతి ఉత్తీర్ణత.
2. స్థానిక మహిళా అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
వయో పరిమితి :
ఈ పోస్టులకు 18 నుంచి 44 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
వయో పరిమితిలో సడలింపు :
1. SC / ST / BC అభ్యర్థులకు – 5 సంవత్సరాలు
2. మాజీ సైనికులకు – 3 సంవత్సరాలు
3. దివ్యాంగులకు – 10 సంవత్సరాలు
జీతం వివరాలు :
ఇన్స్ట్రక్టర్ (టీచర్) – నెలకు ₹8,000 గౌరవ వేతనం
ఆయా – నెలకు ₹6,000 గౌరవ వేతనం
గమనిక: ఈ నియామకాలు పూర్తిగా తాత్కాలిక ప్రాతిపదికన, గౌరవ వేతన విధానంలో నిర్వహించబడతాయి.
ఎంపికలో ప్రాధాన్యత :
1. అదే గ్రామం లేదా ప్రాంతానికి చెందిన అభ్యర్థులకు ప్రాధాన్యత.
2. అందుబాటులో లేకపోతే అదే మండలానికి చెందిన వారికి అవకాశం.
3. అవసరమైతే అదే జిల్లాకు చెందిన అభ్యర్థులను పరిగణనలోకి తీసుకుంటారు.
4. మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
దరఖాస్తు విధానం :
అభ్యర్థులు నిర్దేశించిన దరఖాస్తు నమూనాలో విద్యార్హత ధ్రువపత్రాలు, ఆధార్ కార్డు, చిరునామా రుజువు తదితర అవసరమైన పత్రాల ప్రతులను జత చేసి సంబంధిత మండల విద్యాధికారి (MEO) కార్యాలయంలో సమర్పించాలి.
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తుల ప్రారంభ తేదీ: 09 జూన్ 2026
దరఖాస్తుల చివరి తేదీ: 15 జూన్ 2026
సమయం: ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు
Notification Pdf Click Here
Application Pdf Click Here
Official Website Click Here