రేపల్లె ఐటీఐ కళాశాలలో మెగా జాబ్ మేళా – 1700కు పైగా ఉద్యోగాలు!
రేపల్లె ఐటీఐ కళాశాలలో మెగా జాబ్ మేళా – 1700కు పైగా ఉద్యోగాలు!
రేపల్లె ఐటీఐ కళాశాలలో మెగా జాబ్ మేళా 2026 :
నిరుద్యోగ యువతకు మరో భారీ ఉద్యోగావకాశం అందుబాటులోకి వచ్చింది. బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గంలోని ఇసుకపల్లి శారద ఐటీఐ కళాశాల ప్రాంగణంలో 29 మే 2026న మెగా రిక్రూట్మెంట్ డ్రైవ్ నిర్వహించనున్నారు. ఈ జాబ్ మేళాలో ప్రముఖ మల్టీనేషనల్ మరియు దేశీయ సంస్థలు పాల్గొని వేలాది ఉద్యోగాలను భర్తీ చేయనున్నాయి.
ఈ భారీ ఉద్యోగ మేళాలో రిలయన్స్ జియో, వోల్టాస్, ఫ్లిప్‌కార్ట్, జెప్టో, హెటిరో డ్రగ్స్, అపోలో టైర్స్, కోల్గేట్ పామోలివ్, టీవీఎస్ సుందరం ఫాస్టనర్స్, ఎంఆర్ఎఫ్ లిమిటెడ్ వంటి ప్రముఖ సంస్థలు పాల్గొంటున్నాయి. మొత్తం 21 కంపెనీలు ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్‌లో భాగమవుతూ 1,700కు పైగా ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు.
పదో తరగతి, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ వంటి అర్హతలు కలిగిన అభ్యర్థులు ఈ జాబ్‌మేళాలో పాల్గొనే అవకాశం ఉంది. ఫ్రెషర్స్‌తో పాటు అనుభవం ఉన్న అభ్యర్థులు కూడా తమ అర్హతలకు అనుగుణంగా ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు ఆకర్షణీయమైన జీతభత్యాలు అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
అభ్యర్థులు తమ అర్హతలకు అనుగుణంగా వివిధ పోస్టులకు నేరుగా హాజరై ఇంటర్వ్యూల్లో పాల్గొనవచ్చు. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న యువతీ యువకులకు ఇది మంచి అవకాశం కానుంది.
జాబ్ మేళా లో పాల్గొనే సంస్థలు – ఖాళీల సంఖ్య :
ఈ భారీ ఉద్యోగ మేళాలో రిలయన్స్ జియో, వోల్టాస్, ఫ్లిప్‌కార్ట్, జెప్టో, హెటిరో డ్రగ్స్, అపోలో టైర్స్, కోల్గేట్ పామోలివ్, టీవీఎస్ సుందరం ఫాస్టనర్స్, ఎంఆర్ఎఫ్ లిమిటెడ్ వంటి ప్రముఖ సంస్థలు పాల్గొంటున్నాయి. మొత్తం 21 కంపెనీలు ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్‌లో భాగమవుతూ 1,700కు పైగా ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు.
1. రిలయన్స్ జియో – 50 పోస్టులు
2. శ్రీ జయలక్ష్మి ఆటోమోటివ్స్ – 31 పోస్టులు
3. వోల్టాస్ లిమిటెడ్ – 100 పోస్టులు
4. కోల్గేట్ పామోలివ్ – 100 పోస్టులు
5. అపోలో టైర్స్ – 100 పోస్టులు
6. ESL – 40 పోస్టులు
7. నవత ప్రైవేట్ లిమిటెడ్ – 50 పోస్టులు
8. బిగ్ బాస్కెట్ – 60 పోస్టులు
9. జెప్టో – 100 పోస్టులు
10. కృష్ణపట్నం సెక్యూరిటీ సర్వీసెస్ – 60 పోస్టులు
11. మదర్సన్ సుమీ వైరింగ్ ఇండియా – 50 పోస్టులు
12. టీవీఎస్ సుందరం ఫాస్టనర్స్ – 100 పోస్టులు
13. ఎంఆర్ఎఫ్ లిమిటెడ్ – 80 పోస్టులు
14. ఫ్లిప్‌కార్ట్ – 100 పోస్టులు
15. క్యాప్స్టన్ సర్వీసెస్ – 100 పోస్టులు
16. హెటిరో డ్రగ్స్ లిమిటెడ్ – 300 పోస్టులు
17. మాస్టర్ మైండ్స్ – 45 పోస్టులు
18. ఇన్నోవ్సోర్స్ సర్వీసెస్ – 60 పోస్టులు
19. ఎస్వీఎన్ అడ్వైజర్స్ – 60 పోస్టులు
20. డాక్టస్ బిజినెస్ సొల్యూషన్స్ – 30 పోస్టులు
21. ఫ్లక్స్టెక్ సొల్యూషన్స్ – 30 పోస్టులు
జాబ్ మేళా వివరాలు :
తేదీ: 29 మే 2026
స్థలం: శారద ఐటీఐ కళాశాల, రేపల్లె, బాపట్ల జిల్లా
సంప్రదించాల్సిన నంబర్: 9032384374
ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని నిర్వాహకులు సూచిస్తున్నారు.