RRB Railway Technician Recruitment 2026: రైల్వేలో 6,557 టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీ.. 10వ తరగతి, ITI, డిప్లొమా, డిగ్రీ అభ్యర్థులకు భారీ అవకాశం!
RRB Railway Technician Recruitment 2026: రైల్వేలో 6,557 టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీ.. 10వ తరగతి, ITI, డిప్లొమా, డిగ్రీ అభ్యర్థులకు భారీ అవకాశం!
RRB Railway Technician Notification 2026:
ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు భారతీయ రైల్వే నుంచి శుభవార్త. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) CEN No. 02/2026 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 6,557 టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో టెక్నీషియన్ గ్రేడ్-I సిగ్నల్ – 323 పోస్టులు, టెక్నీషియన్ గ్రేడ్-III – 6,234 పోస్టులు ఉన్నాయి. అర్హత కలిగిన అభ్యర్థులు 2026 జూన్ 30 నుండి జూలై 29, 2026 రాత్రి 11:59 గంటల వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :
సంస్థ పేరు : రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) ఉద్యోగాలు
పోస్టుల వివరాలు :
1. టెక్నీషియన్ గ్రేడ్-I సిగ్నల్ – 323 పోస్టులు
2. టెక్నీషియన్ గ్రేడ్-III – 6,234 పోస్టులు
మొత్తం ఖాళీలు: 6,557
విద్య అర్హతలు :
పోస్టును బట్టి కింది అర్హతలలో ఏదో ఒకటి ఉండాలి.
1. 10వ తరగతి / SSLC ఉత్తీర్ణతతో పాటు సంబంధిత ట్రేడ్‌లో NCVT/SCVT గుర్తింపు పొందిన ITI
2. సంబంధిత ట్రేడ్‌లో యాక్ట్ అప్రెంటిస్‌షిప్
3. B.Sc (Physics / Electronics / Computer Science / Information Technology / Instrumentation)
4. సంబంధిత విభాగంలో 3 సంవత్సరాల డిప్లొమా
5. సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ డిగ్రీ (B.E / B.Tech)

వయోపరిమితి :
29 జూలై 2026 నాటికి
టెక్నీషియన్ గ్రేడ్-I సిగ్నల్ :
కనిష్ట వయస్సు : 18 సంవత్సరాలు
గరిష్ట వయస్సు : 33 సంవత్సరాలు
టెక్నీషియన్ గ్రేడ్-III :
కనిష్ట వయస్సు : 18 సంవత్సరాలు
గరిష్ట వయస్సు : 30 సంవత్సరాలు
ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ వర్గాలకు వయస్సులో సడలింపు ఉంటుంది.

దరఖాస్తు రుసుము :
1. SC / ST / మహిళలు / దివ్యాంగులు / మాజీ సైనికులు / ట్రాన్స్‌జెండర్ / మైనారిటీ / EBC అభ్యర్థులు – రూ.250 /-
2. ఇతర అభ్యర్థులు – రూ.500/-

జీతం వివరాలు :
టెక్నీషియన్ గ్రేడ్-I సిగ్నల్ :
నెలకి జీతం రూ.29,200 నుండి రూ.92,300 వరకు
టెక్నీషియన్ గ్రేడ్-III :
నెలకి జీతం రూ.19,900 నుండి రూ.63,200 వరకు
అదనంగా కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం DA, HRA, TA మరియు ఇతర అలవెన్సులు వర్తిస్తాయి.
ఎంపిక విధానం :
అభ్యర్థులను కింది దశల ఆధారంగా ఎంపిక చేస్తారు.
1. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT)
2. అవసరమైతే స్కిల్ టెస్ట్
3. డాక్యుమెంట్ వెరిఫికేషన్
4. మెడికల్ ఎగ్జామినేషన్
దరఖాస్తు విధానం :
అభ్యర్థులు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఆన్‌లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేయాలి.
అధికారిక వెబ్సైటు : https://indianrailways.gov.in/
ముఖ్యమైన తేదీలు :
ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం: 30 జూన్ 2026
దరఖాస్తులకు చివరి తేదీ: 29 జూలై 2026
ఫీజు చెల్లించడానికి చివరి తేదీ: 31 జూలై 2026
Notification Pdf Click Here
Online Apply Link Click Here
Official Website Click Here