Central Govt Jobs

RRC Railway Jobs 2026 : రాత పరీక్ష లేకుండా రైల్వేలో 1644 ఉద్యోగాలు.. వెంటనే అప్లై చేసుకోండి!

calendar_month May 8, 2026 person chitra

RRC Railway Jobs 2026 : రాత పరీక్ష లేకుండా రైల్వేలో 1644 ఉద్యోగాలు.. వెంటనే అప్లై చేసుకోండి!

RRC Railway Jobs 2026:

భారతీయ రైల్వేలో ఉద్యోగం చేయాలని ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతకు భారీ శుభవార్త. కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ పరిధిలోని సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే (SECR) 2026-27 సంవత్సరానికి సంబంధించి భారీ అప్రెంటిస్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1644 అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్‌లో అభ్యర్థులను ఎటువంటి రాత పరీక్ష లేకుండానే మెరిట్ ఆధారంగా ఎంపిక చేయనుండటం విశేషంగా చెప్పుకోవచ్చు.

రాయపూర్ డివిజన్‌లో నిర్వహించే ఈ అప్రెంటిస్ శిక్షణకు పదో తరగతి మరియు ఐటీఐ అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. కార్పెంటర్, వెల్డర్, ఎలక్ట్రిషియన్, స్టెనోగ్రాఫర్, పెయింటర్, మెకానిక్ తదితర విభాగాల్లో పోస్టులను భర్తీ చేయనున్నారు. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :

సంస్థ పేరు : RRC Railway లో ఉద్యోగాలు

పోస్టుల వివరాలు :

కార్పెంటర్, వెల్డర్, ఎలక్ట్రిషియన్, స్టెనోగ్రాఫర్, పెయింటర్, మెకానిక్ తదితర విభాగాల్లో పోస్టులు ఉన్నాయి.

మొత్తం పోస్టులు : 1644

విద్య అర్హతలు :

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

1. కనీసం 50% మార్కులతో 10వ తరగతి ఉత్తీర్ణత.

2. సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ సర్టిఫికెట్ తప్పనిసరి.

వయోపరిమితి:

1. అభ్యర్థుల వయస్సు 15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి.

2. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు ఉంటుంది.

శిక్షణ కాలం & స్టైపెండ్:

1. ఎంపికైన అభ్యర్థులకు ఒక సంవత్సరం పాటు అప్రెంటిస్ శిక్షణ ఇవ్వబడుతుంది.

2. శిక్షణ సమయంలో నెలకు రూ.9,000 నుంచి రూ.15,000 వరకు స్టైపెండ్ చెల్లిస్తారు.

3. శిక్షణ పూర్తి చేసిన వారికి అధికారిక సర్టిఫికెట్ కూడా అందజేస్తారు.

ఎంపిక విధానం:

1. ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూ నిర్వహించరు.

2. అభ్యర్థులు 10వ తరగతి మార్కులు మరియు ఐటీఐలో వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్ ప్రకారం ఎంపిక చేయబడతారు.

ఎలా అప్లై చేసుకోవాలి?

1. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా జూన్ 4వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలి.

2. రైల్వేలో ఉద్యోగం సాధించాలని భావిస్తున్న వారికి ఇది మంచి అవకాశం అని చెప్పవచ్చు.

Notification Pdf Click Here

Apply Online Link Click Here

Official Website Click Here

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe
Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *