ప్రభుత్వ పాఠశాలలో లైబ్రేరియన్ ఉద్యోగాలు – సైనిక్ స్కూల్ గోపాల్‌గంజ్‌లో TGT & Librarian పోస్టుల భర్తీ …ఇలా అప్లై చేసుకోండి…
ప్రభుత్వ పాఠశాలలో లైబ్రేరియన్ ఉద్యోగాలు – సైనిక్ స్కూల్ గోపాల్‌గంజ్‌లో TGT & Librarian పోస్టుల భర్తీ …ఇలా అప్లై చేసుకోండి…
Sainik School Gopalganj TGT & Librarian Job Notification 2026:
నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త. సైనిక్ స్కూల్ గోపాల్‌గంజ్ (బీహార్)లో TGT (Computer Science) మరియు Librarian రెగ్యులర్ పోస్టుల భర్తీకి అర్హులైన భారతీయ పౌరుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. విద్యార్హత కలిగిన అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ 30 జూన్ 2026.
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 02 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఎంపికైన అభ్యర్థులకు పే లెవల్-7 ప్రకారం రూ.44,900 నుండి రూ.1,42,400 వరకు నెల జీతం చెల్లించబడుతుంది. అదనంగా కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం పలు భత్యాలు మరియు ఇతర సౌకర్యాలు కూడా అందిస్తారు. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :
సంస్థ పేరు : సైనిక్ స్కూల్ గోపాల్‌గంజ్ (బీహార్)లో ఉద్యోగాలు
పోస్టుల వివరాలు :
1. TGT (Computer Science)
2. Librarian పోస్టులు ఉన్నాయి.
మొత్తం పోస్టులు : 02
విద్యార్హతలు :
TGT (Computer Science) :
1. B.Sc / B.Tech (Computer Science) / BCA / Bachelor of Information Technology పూర్తి చేసి ఉండాలి.
2. లేదా గణితం సబ్జెక్ట్‌తో గ్రాడ్యుయేషన్ చేసి, కంప్యూటర్ ఇంజనీరింగ్ లేదా ITలో 3 సంవత్సరాల డిప్లొమా కలిగి ఉండాలి.
3. లేదా కంప్యూటర్ అప్లికేషన్‌లో కనీసం 1 సంవత్సరం డిప్లొమా పూర్తి చేసి ఉండాలి.
4. లేదా DOEACC / NIELIT ‘A’ Level అర్హత కలిగి ఉండాలి.
5. అదనంగా NCTE గుర్తింపు పొందిన సంస్థ నుండి B.Ed అర్హత తప్పనిసరి.
Librarian :
1. లైబ్రరీ సైన్స్‌లో డిగ్రీతో పట్టభద్రులు అయి ఉండాలి.
2. లేదా గుర్తింపు పొందిన సంస్థ నుండి లైబ్రరీ సైన్స్‌లో ఒక సంవత్సరం డిప్లొమా కలిగి ఉండాలి.
3. ఆంగ్లం మరియు హిందీ భాషల్లో మాట్లాడగలిగే నైపుణ్యం ఉండాలి.
వయోపరిమితి :
1. కనీస వయస్సు : 18 సంవత్సరాలు, గరిష్ట వయస్సు : 35 సంవత్సరాలు ఉండాలి.
2. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది.
దరఖాస్తు రుసుము:
1. జనరల్ / OBC అభ్యర్థులకు : రూ.500/-
2. SC / ST అభ్యర్థులకు : రూ.400/- ఫీజు చెల్లించాలి.
3. అభ్యర్థులు దరఖాస్తు రుసుమును “Principal, Sainik School Gopalganj” పేరిట డిమాండ్ డ్రాఫ్ట్ (Demand Draft) రూపంలో చెల్లించి దరఖాస్తుతో పాటు జతచేయాలి.
జీతం వివరాలు :
1. ఎంపికైన అభ్యర్థులకు రూ.44,900 – రూ.1,42,400 వరకు నెల జీతం అందజేస్తారు.
2. అదనంగా ఈ క్రింది ప్రయోజనాలు ఉంటాయి.
డీఏ (DA)
ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్
మెడికల్ అలవెన్స్
అద్దె రహిత వసతి
LTC
బోనస్
నేషనల్ పెన్షన్ స్కీమ్ (NPS)
ఇద్దరు పిల్లలకు రాయితీతో కూడిన విద్యా సౌకర్యం వంటి ప్రయోజనాలు కల్పించబడతాయి.
ఎంపిక విధానం :
అభ్యర్థుల ఎంపిక క్రింది దశల ఆధారంగా జరుగుతుంది.
1. రాత పరీక్ష
2. నైపుణ్య పరీక్ష (Skill Test)
3. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది.
ఎలా అప్లై చేసుకోవాలి?
1. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ నుండి దరఖాస్తు ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకొని, అవసరమైన పత్రాలను జతచేసి ఆఫ్‌లైన్ ద్వారా పంపించాలి.
2. దరఖాస్తులు నిర్ణీత గడువులోపు పాఠశాలకు చేరాలి.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తుల ప్రారంభ తేదీ : 30 మే 2026
దరఖాస్తుల చివరి తేదీ : 30 జూన్ 2026
Notification PDF Click Here
Official Website Click Here
Application Pdf Click Here