Bank Jobs

SBI Regular Backlog Clerk Vacancies 2026 : 9,124 క్లర్క్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల….వెంటనే అప్లై చేసుకోండి.

calendar_month August 12, 2026 person chitra

SBI Regular Backlog Clerk Vacancies 2026 : 9,124 క్లర్క్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల….వెంటనే అప్లై చేసుకోండి.

SBI Jobs 2026:

ప్రభుత్వ రంగ బ్యాంకులో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) గుడ్‌న్యూస్ అందించింది. జూనియర్ అసోసియేట్ (Customer Support & Sales) పోస్టుల భర్తీకి భారీ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 9,124 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఇందులో 7,680 రెగ్యులర్ పోస్టులు, 1,444 బ్యాక్‌లాగ్ పోస్టులు ఉన్నాయి.

ఈ ఉద్యోగాలకు అర్హత కలిగిన అభ్యర్థులు 2026 ఆగస్టు 11 నుంచి ఆగస్టు 31 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఏదైనా విభాగంలో డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులతో పాటు నోటిఫికేషన్‌లో పేర్కొన్న గడువులోపు డిగ్రీ పూర్తి చేయబోయే ఫైనల్ ఇయర్ విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

SBI Clerk Jobs 2026 – పోస్టుల వివరాలు :

సంస్థ పేరు : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

పోస్టుల వివరాలు :

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జూనియర్ అసోసియేట్ (Customer Support & Sales) పోస్టులను రెగ్యులర్, బ్యాక్‌లాగ్ కేటగిరీలలో భర్తీ చేస్తున్నారు.

రెగ్యులర్ పోస్టులు: 7,680

బ్యాక్‌లాగ్ పోస్టులు: 1,444

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

హైదరాబాద్ సర్కిల్‌లో ఖాళీలు: 260

మొత్తం ఖాళీలు: 9,124

విద్య అర్హతలు :

SBI Clerk పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా విద్యాసంస్థ నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ లేదా దానికి సమానమైన విద్యార్హత కలిగి ఉండాలి.

నోటిఫికేషన్‌లో పేర్కొన్న నిబంధనల ప్రకారం డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే, నిర్ణీత తేదీలోపు తమ డిగ్రీ అర్హతను పూర్తి చేయాల్సి ఉంటుంది.

వయోపరిమితి :

1. 01 ఏప్రిల్ 2026 నాటికి అభ్యర్థుల వయస్సు 20 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి.

2. ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC, ST, OBC, PwBD తదితర రిజర్వేషన్ కేటగిరీలకు చెందిన అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

దరఖాస్తు రుసుము :

1. SC/ST/PwBD/ESM/DESM అభ్యర్థులకు: అప్లికేషన్ ఫీజు లేదు.

2. ఇతర అభ్యర్థులకు: రూ.750/- దరఖాస్తు రుసుము.

3. అప్లికేషన్ ఫీజును ఆన్‌లైన్‌లోనే చెల్లించాల్సి ఉంటుంది.

జీతం వివరాలు :

1. SBI Junior Associate పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఆకర్షణీయమైన వేతనం లభిస్తుంది.

2. ప్రారంభ వేతనం రూ.24,050 నుంచి ఉండగా, పే స్కేల్ ప్రకారం రూ.64,480 వరకు వేతనం లభించే అవకాశం ఉంటుంది.

ఎంపిక విధానం :

SBI Clerk Jobs 2026కు అభ్యర్థుల ఎంపిక పలు దశల్లో జరుగుతుంది. ప్రధానంగా:

1. ప్రిలిమినరీ పరీక్ష

2. మెయిన్స్ పరీక్ష

3. తెలుగు లాంగ్వేజ్ టెస్ట్ (వర్తించే అభ్యర్థులకు)

మెరిట్, నోటిఫికేషన్‌లో పేర్కొన్న ఇతర అర్హతల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

ఎలా దరఖాస్తు చేయాలి?

1. SBI Careers అధికారిక వెబ్‌సైట్‌ ( https://sbi.bank.in/web/careers/current-openings ) ను సందర్శించాలి.

2. Current Openings విభాగంలోకి వెళ్లాలి.

3. Junior Associate (Customer Support & Sales) రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ను ఎంచుకోవాలి.

4. ముందుగా నోటిఫికేషన్‌లోని అర్హతలు, నిబంధనలు పూర్తిగా చదవాలి.

5. ఆన్‌లైన్ అప్లికేషన్ ఫారమ్‌లో వ్యక్తిగత, విద్యార్హత వివరాలను నమోదు చేయాలి.

6. అవసరమైన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయాలి.

7. వర్తించే దరఖాస్తు రుసుమును చెల్లించాలి.

8. ఫారమ్‌ను సబ్మిట్ చేసి అప్లికేషన్ కాపీని భవిష్యత్ అవసరాల కోసం భద్రపరచుకోవాలి.

ముఖ్యమైన తేదీలు :

అప్లికేషన్ ప్రారంభ తేదీ : 11 ఆగష్టు 2026

అప్లికేషన్ చివరి తేదీ : 31 ఆగష్టు 2026

Notification Pdf Click Here

Apply Online Link Click Here

Official Website Click Here

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe
Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *