Education News

మహిళా ఇంజినీరింగ్ విద్యార్థినులకు శుభవార్త.. షెఫ్లర్ ఇండియా హోప్ ఇంజినీరింగ్ స్కాలర్‌షిప్ 2026కు దరఖాస్తులు ప్రారంభం!

calendar_month July 10, 2026 person chitra

మహిళా ఇంజినీరింగ్ విద్యార్థినులకు శుభవార్త.. షెఫ్లర్ ఇండియా హోప్ ఇంజినీరింగ్ స్కాలర్‌షిప్ 2026కు దరఖాస్తులు ప్రారంభం!

ఫ్లర్ ఇండియా హోప్ ఇంజినీరింగ్ స్కాలర్‌షిప్ 2026 :

ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన ప్రతిభావంతులైన మహిళా ఇంజినీరింగ్ విద్యార్థినులకు ఉన్నత విద్యను కొనసాగించేందుకు షెఫ్లర్ ఇండియా (Schaeffler India) సంస్థ “షెఫ్లర్ ఇండియా హోప్ ఇంజినీరింగ్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ 2026” కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

ఈ స్కాలర్‌షిప్ ద్వారా మొదటి సంవత్సరం B.Tech / BE చదువుతున్న అర్హత గల విద్యార్థినులకు నాలుగు సంవత్సరాల పాటు ప్రతి ఏడాది రూ.50,000 ఆర్థిక సహాయం అందించబడుతుంది. అంతేకాకుండా పరిశ్రమ నిపుణుల నుంచి మెంటార్‌షిప్, కెరీర్ గైడెన్స్ కూడా లభిస్తుంది. ఆసక్తి ఉన్న విద్యార్థినులు 2026 ఆగస్టు 15లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

షెఫ్లర్ ఇండియా హోప్ ఇంజినీరింగ్ స్కాలర్‌షిప్ 2026 – అర్హతలు, దరఖాస్తు విధానం :

దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఈ క్రింది అర్హతలను కలిగి ఉండాలి.

1. భారతదేశంలోని UGC / AICTE / రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు పొందిన కళాశాలలో మొదటి సంవత్సరం B.Tech లేదా BE చదువుతున్న

2. మహిళా విద్యార్థి అయి ఉండాలి.

3. 2025-26 విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్ (సైన్స్ స్ట్రీమ్) లో కనీసం 60% మార్కులు సాధించి ఉండాలి.

4. దివ్యాంగ (PwD) విద్యార్థినులకు కనీసం 40% మార్కులు ఉంటే అర్హత ఉంటుంది.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

5. కుటుంబ వార్షిక ఆదాయం రూ.5 లక్షలకు మించకూడదు.

6. Schaeffler India లేదా Buddy4Study ఉద్యోగుల పిల్లలు ఈ స్కాలర్‌షిప్‌కు అర్హులు కారు.

ప్రాధాన్యత ఎవరికి?

ఈ కింది అభ్యర్థులకు ఎంపికలో ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.

1. దివ్యాంగ (PwD) విద్యార్థినులు

2. ఈ క్రింది ఇంజినీరింగ్ విభాగాల్లో చదువుతున్న విద్యార్థినులు:

ఆటోమొబైల్ ఇంజినీరింగ్

మెకానికల్ ఇంజినీరింగ్

మెకాట్రానిక్స్

ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ (EEE)

ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ (ECE)

ప్రొడక్షన్ ఇంజినీరింగ్

ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్

కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ (CSE)

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT)

స్కాలర్‌షిప్ ద్వారా లభించే ప్రయోజనాలు:

ఎంపికైన విద్యార్థినులు ఈ ప్రయోజనాలను పొందుతారు.

1. నాలుగు సంవత్సరాల పాటు ప్రతి ఏడాది రూ.50,000 స్కాలర్‌షిప్.

2. షెఫ్లర్ ఇండియా నిపుణుల నుంచి మెంటార్‌షిప్ మరియు కెరీర్ మార్గదర్శకత్వం.

3. ఇంజినీరింగ్ విద్యను ఆర్థిక ఇబ్బందులు లేకుండా పూర్తి చేసుకునేందుకు సహాయం.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్

దరఖాస్తు చివరి తేదీ: 15 ఆగస్టు 2026

Apply Link : Click Here

QR Code : Click Here

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe
Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *