12వ తరగతి అర్హతతో పరీక్ష లేకుండా అంగన్వాడీ ఉద్యోగాలు – తెలంగాణలో మరో జిల్లా నోటిఫికేషన్ విడుదల | Telangana Anganwadi Notification 2026 :
12వ తరగతి అర్హతతో పరీక్ష లేకుండా అంగన్వాడీ ఉద్యోగాలు – తెలంగాణలో మరో జిల్లా నోటిఫికేషన్ విడుదల | Telangana Anganwadi Notification 2026 :
Telangana Anganwadi Recruitment 2026:
తెలంగాణలో అంగన్వాడీ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న మహిళలకు మరో శుభవార్త. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో దశలవారీగా అంగన్వాడీ పోస్టుల భర్తీ కొనసాగుతున్న నేపథ్యంలో తాజాగా నల్లగొండ జిల్లాలో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 343 పోస్టులను భర్తీ చేయనున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా సుమారు 15,982 అంగన్వాడీ ఖాళీలు ఉన్నట్లు ప్రభుత్వం ప్రకటించగా, ఇప్పటికే పెద్దపల్లి మరియు మహబూబ్నగర్ జిల్లాల్లో నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. ఇప్పుడు నల్లగొండ జిల్లాలోని ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి మహిళా అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులు కోరుతున్నారు.
పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :
సంస్థ పేరు : తెలంగాణలో అంగన్వాడీ ఉద్యోగాలు
పోస్టుల వివరాలు :
1. అంగన్వాడీ టీచర్ (AWT) – 146 పోస్టులు
2. అంగన్వాడీ హెల్పర్ (AWH) – 197 పోస్టులు
మొత్తం ఖాళీలు : 343
ఖాళీలు ఉన్న ఐసీడీఎస్ ప్రాజెక్టులు :
నల్లగొండ జిల్లాలోని క్రింది ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లో నియామకాలు చేపడుతున్నారు.
అనుముల
దామరచర్ల
దేవరకొండ
చింతపల్లి
కొండమల్లేపల్లి
మునుగోడు
మిర్యాలగూడ (Urban)
నకిరేకల్
నల్లగొండ
విద్యార్హతలు :
అంగన్వాడీ టీచర్ (AWT):
ఇంటర్మీడియట్ (12వ తరగతి) ఉత్తీర్ణత తప్పనిసరి.
అంగన్వాడీ హెల్పర్ (AWH):
1. సాధారణ ప్రాంతాల్లో ఇంటర్మీడియట్ అర్హత ఉండాలి.
2. గిరిజన ప్రాంతాల్లో ఇంటర్మీడియట్ అర్హత కలిగిన అభ్యర్థులు అందుబాటులో లేకపోతే SSC (10వ తరగతి) ఉత్తీర్ణులైన అభ్యర్థులను కూడా పరిగణలోకి తీసుకుంటారు.
వయోపరిమితి :
1. అభ్యర్థి కనీస వయస్సు : 18 సంవత్సరాలు, గరిష్ట వయస్సు : 35 సంవత్సరాలు
2. అభ్యర్థులు సంబంధిత గ్రామం లేదా వార్డు పరిధిలో స్థానిక మహిళ అయి ఉండాలి.
ఎంపిక విధానం :
అభ్యర్థుల ఎంపిక క్రింది మార్కుల ఆధారంగా జరుగుతుంది.
70 మార్కులు – ఇంటర్మీడియట్ మెరిట్
10 మార్కులు – ప్రత్యేక కేటగిరీలు / వితంతువులు
5 మార్కులు – అనాథ అభ్యర్థులు
5 మార్కులు – దివ్యాంగులు
10 మార్కులు – జిల్లా ఎంపిక కమిటీ నిర్వహించే ఇంటర్వ్యూ
దరఖాస్తు విధానం :
అర్హులైన మహిళా అభ్యర్థులు 27 జూన్ 2026 నుంచి 10 జూలై 2026 సాయంత్రం 5:00 గంటల వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ముఖ్యమైన తేదీ:
దరఖాస్తుల చివరి తేదీ: 10-07-2026 (సాయంత్రం 5:00 గంటలు)
ముఖ్యమైన సూచన :
అర్హత, రిజర్వేషన్లు, స్థానికత, అవసరమైన పత్రాలు మరియు ఇతర పూర్తి వివరాల కోసం మహిళా అభ్యర్థులు మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిక వెబ్సైట్ను సందర్శించి, గడువు ముగిసేలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ నియామకాలకు ఎలాంటి రాత పరీక్ష లేకుండా మెరిట్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేపడతారు.
New Notification Pdf : Click Here
Education Qualification & Guidelines : Click Here
Online Apply Link : Click Here