Govt. Schemes

తెలంగాణ ప్రజలకు భారీ శుభవార్త.. ఆగస్టులో ప్రారంభించబోయే కొత్త పథకాలు ఇవే…. పూర్తి వివరాలు :

calendar_month August 10, 2026 person chitra

తెలంగాణ ప్రజలకు భారీ శుభవార్త.. ఆగస్టులో ప్రారంభించబోయే కొత్త పథకాలు ఇవే…. పూర్తి వివరాలు :

తెలంగాణ ఆగస్టు శుభవార్తలు – కొత్త పథకాలు :

తెలంగాణ ప్రజలకు ఆగస్టు నెలలో పలు శుభవార్తలు అందనున్నాయి. ప్రభుత్వం సంక్షేమ పథకాలు, రేషన్ కార్డులు, పెన్షన్లు, సబ్సిడీ సిలిండర్లు, ఉచిత విద్యుత్ వంటి పలు కార్యక్రమాలను అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. ముఖ్యంగా ఆగస్టు 15న కొత్త పథకాలకు సంబంధించిన కీలక కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి.

కొత్త PVC రేషన్ కార్డులు :

తెలంగాణలో సుమారు 1.5 కోట్ల స్మార్ట్ PVC రేషన్ కార్డుల పంపిణీకి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. నకిలీ రేషన్ కార్డులకు అడ్డుకట్ట వేయడంతో పాటు కార్డుల్లో మార్పులు చేయకుండా ట్యాంపర్ ప్రూఫ్ విధానంలో వీటిని రూపొందిస్తున్నారు. ఈ-KYC పూర్తైన తర్వాత ఆధార్ వివరాల ఆధారంగా కుటుంబ పెద్ద మహిళ ఫొటో, QR కోడ్‌తో కొత్త రేషన్ కార్డు అందించే అవకాశం ఉంది. అర్హులైన వారు సమీపంలోని రేషన్ డీలర్ లేదా మీ సేవ కేంద్రాన్ని సంప్రదించి ఈ-KYC ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

మరో 5 లక్షల కుటుంబాలకు రూ.500కే గ్యాస్ సిలిండర్ :

మహాలక్ష్మి పథకం కింద ప్రస్తుతం లక్షలాది కుటుంబాలు రూ.500కే వంట గ్యాస్ సిలిండర్ ప్రయోజనం పొందుతున్నాయి. తాజాగా మరో 5 లక్షల మందికి పైగా అర్హులను గుర్తించినట్లు సమాచారం. ప్రభుత్వం నుంచి తుది ఆమోదం లభించిన అనంతరం ఈ పథకాన్ని వారికి కూడా అమలు చేసే అవకాశం ఉంది.

కొత్త ఆసరా పెన్షన్లకు దరఖాస్తులు :

తెలంగాణలో కొత్త ఆసరా పెన్షన్ల దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అర్హులైన వారు గ్రామ పంచాయతీ కార్యదర్శి లేదా సంబంధిత MPDO కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ప్రక్రియకు నిర్దిష్ట చివరి తేదీ లేదని, నిరంతరం దరఖాస్తులు స్వీకరించే అవకాశం ఉందని ప్రభుత్వం తెలిపింది. ఇప్పటికే దరఖాస్తు చేసిన వారు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు.

వితంతువులు, ఒంటరి మహిళలు, గీత కార్మికులు, చేనేత కార్మికులు, బీడీ కార్మికులు, దివ్యాంగులు తదితర అర్హులకు కొత్త పెన్షన్లు మంజూరు చేయనున్నట్లు సమాచారం. ఆగస్టు 15న సుమారు 2.25 లక్షల మందికి కొత్త పెన్షన్లు అందించే కార్యక్రమం ఉండనుంది.

ఉచిత విద్యుత్, TIMS ప్రారంభం :

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

గృహజ్యోతి పథకం కింద మరో 3 నుంచి 4 లక్షల కుటుంబాలకు ఉచిత విద్యుత్ ప్రయోజనం అందించే అవకాశం ఉంది. అలాగే ఆగస్టు 15న సనత్‌నగర్‌లో నిర్మించిన TIMS (తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) సేవలను ప్రారంభించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.

ఇక గిగ్ వర్కర్లకు సామాజిక భద్రత కల్పించడం, మూసీ పునరుజ్జీవనం, గాంధీ సరోవర్, ఫ్యూచర్ సిటీ వంటి అభివృద్ధి కార్యక్రమాలపై కూడా ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. సెప్టెంబర్ మొదటి వారంలో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన మరో కీలక కార్యక్రమానికి శంకుస్థాపన చేసే అవకాశం ఉంది.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe
Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *