Latest jobs

TGPSC Assistant Environmental Engineer Recruitment 2026 : తెలంగాణ కాలుష్య నియంత్రణ బోర్డులో 19 అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్ పోస్టులు.. వెంటనే దరఖాస్తు చేసుకోండి!

calendar_month June 3, 2026 person chitra

TGPSC Assistant Environmental Engineer Recruitment 2026 : తెలంగాణ కాలుష్య నియంత్రణ బోర్డులో 19 అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్ పోస్టులు.. వెంటనే దరఖాస్తు చేసుకోండి!

TGPSC Assistant Environmental Engineer Notification 2026 :

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) తాజాగా తెలంగాణ కాలుష్య నియంత్రణ బోర్డు (TSPCB)లో అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామక ప్రక్రియ ద్వారా మొత్తం 19 రెగ్యులర్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హతలు కలిగిన అభ్యర్థులు 10 జూన్ 2026 నుంచి 17 జూలై 2026 సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులను సమర్పించవచ్చు.

01 జూలై 2026 నాటికి అభ్యర్థుల వయస్సు 18 నుంచి 44 సంవత్సరాల మధ్య ఉండాలి. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.54,220 నుంచి రూ.1,33,630 వరకు ఆకర్షణీయమైన వేతనం చెల్లించనున్నారు. దరఖాస్తు చేసుకునే వారు ముందుగా TGPSC అధికారిక వెబ్‌సైట్‌లో వన్ టైమ్ రిజిస్ట్రేషన్ (OTR) పూర్తి చేసి అనంతరం దరఖాస్తును సమర్పించాల్సి ఉంటుంది. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :

సంస్థ పేరు : తెలంగాణ కాలుష్య నియంత్రణ బోర్డు (TSPCB)లో ఉద్యోగాలు

పోస్టుల వివరాలు : అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్ పోస్టులు

మొత్తం ఖాళీలు : 19

విద్య అర్హతలు :

1. అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా యూజీసీ గుర్తింపు పొందిన సంస్థ నుంచి క్రింది అర్హతల్లో ఏదో ఒకటి కలిగి ఉండాలి.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

2. సివిల్ / మెకానికల్ / కెమికల్ / బయో-టెక్నాలజీ / మైనింగ్ / ఎన్విరాన్‌మెంట్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

3. లేదా ఏదైనా విభాగంలో B.Tech/BE పూర్తి చేసి, ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీరింగ్‌లో పీజీ డిగ్రీ కలిగి ఉండాలి.

4. లేదా AMIE (India) సివిల్ పరీక్షలో సెక్షన్-A మరియు సెక్షన్-Bలో అర్హత సాధించి ఉండాలి.

వయోపరిమితి :

వయస్సు లెక్కింపు తేదీ : 01 జూలై 2026 నాటికి కనీస వయస్సు : 18 సంవత్సరాలు, గరిష్ట వయస్సు : 44 సంవత్సరాలు ఉండాలి.

దరఖాస్తు రుసుము :

1. ఎస్సీ, ఎస్టీ, మహిళలు, మాజీ సైనికులు, దివ్యాంగులు మరియు ట్రాన్స్‌జెండర్ అభ్యర్థులు : రూ.50 ప్రాసెసింగ్ ఫీజు మాత్రమే.

2. ఇతర అభ్యర్థులు : రూ.450 దరఖాస్తు రుసుము + రూ.50 ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి.

3. ఒకసారి చెల్లించిన ఫీజు ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి చెల్లించబడదు.

జీతం వివరాలు :

ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.54,220 నుంచి రూ.1,33,630 వరకు వేతనం చెల్లిస్తారు.

ఎంపిక విధానం :

అభ్యర్థుల ఎంపికను క్రింది దశల ద్వారా నిర్వహిస్తారు.

1. కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష (CBT)

2. సర్టిఫికెట్ల పరిశీలన (డాక్యుమెంట్ వెరిఫికేషన్) ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది.

ఎలా అప్లై చేసుకోవాలి?

1. ముందుగా TGPSC అధికారిక వెబ్‌సైట్‌లో వన్ టైమ్ రిజిస్ట్రేషన్ (OTR) పూర్తి చేయాలి.

2. ఇప్పటికే OTR నమోదు చేసుకున్న అభ్యర్థులు తమ TGPSC ID ద్వారా నేరుగా లాగిన్ అయి దరఖాస్తు సమర్పించవచ్చు.

3. దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించే ముందు యూజర్ గైడ్‌ను జాగ్రత్తగా చదవడం మంచిది.

ముఖ్యమైన తేదీలు :

ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ : 10 జూన్ 2026

దరఖాస్తులకు చివరి తేదీ : 17 జూలై 2026

FullNotification Pdf Click Here

Official Website Click Here

Online Apply Link Click Here 

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe
Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *