Latest jobs

TGPSC Jobs 2026: ఒకేరోజు 3 భారీ నోటిఫికేషన్లు విడుదల.. త్వరలో మరో 3,800 ఉద్యోగాల భర్తీ…

calendar_month June 2, 2026 person chitra

TGPSC Jobs 2026: ఒకేరోజు 3 భారీ నోటిఫికేషన్లు విడుదల.. త్వరలో మరో 3,800 ఉద్యోగాల భర్తీ…

TGPSC 3 Notifications 2026 Full Details in Telugu :

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) అభ్యర్థులకు శుభవార్త అందించింది. ఒకేరోజు మూడు కీలక ఉద్యోగ నోటిఫికేషన్లను విడుదల చేస్తున్నట్లు TGPSC ఛైర్మన్ వెల్లడించారు.

ఈ నోటిఫికేషన్లలో తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో 19 అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్ పోస్టులు, రోడ్లు & భవనాల శాఖలో 222 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (సివిల్) పోస్టులు, అలాగే 49 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) పోస్టులు భర్తీ చేయనున్నారు.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

ప్రతి నెల మూడు నోటిఫికేషన్లు :

ఇకపై ప్రతి నెల కనీసం మూడు ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేసేలా కార్యాచరణ రూపొందించినట్లు TGPSC తెలిపింది. ప్రస్తుతం దాదాపు 3,800 ఖాళీల భర్తీకి ఆర్థిక శాఖ నుంచి అనుమతులు లభించాయని అధికారులు వెల్లడించారు.

 

1,393 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టులు :

త్వరలో విడుదల కానున్న నోటిఫికేషన్లలో 1,393 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ (FBO) పోస్టులు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. ఈ పోస్టులకు ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత అర్హతగా ఉండే అవకాశం ఉంది.

కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానం ;

భవిష్యత్ నియామకాల్లో పరీక్షలను పూర్తిగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) విధానంలో నిర్వహించనున్నట్లు TGPSC స్పష్టం చేసింది. పరీక్షల నిర్వహణలో పారదర్శకత, వేగవంతమైన ఫలితాల ప్రకటన కోసం ఆధునిక సాంకేతికతను వినియోగించనున్నట్లు తెలిపారు.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

త్వరితగతిన నియామక ప్రక్రియ :

ఒకే దశ పరీక్షతో జరిగే నియామకాలను 3 నుంచి 6 నెలల్లోపు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కమిషన్ పేర్కొంది. ప్రిలిమ్స్, మెయిన్స్ వంటి బహుళ దశల పరీక్షలు ఉన్న నియామకాలను కూడా 6 నుంచి 9 నెలల్లో, గరిష్టంగా 12 నెలల్లోపు పూర్తి చేసేలా ప్రత్యేక ప్రణాళిక రూపొందించినట్లు వెల్లడించింది.

తెలంగాణలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు TGPSC నుంచి వరుస నోటిఫికేషన్లు విడుదల కావడం పెద్ద ఊరటనిచ్చే అంశంగా మారింది.

TGPSC Official Website Click Here

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe
Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *