TS WDCW Anganwadi Recruitment 2026: పరీక్ష లేదు.. ఫీజు లేదు.. అంగన్వాడీ టీచర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల – జూలై 18 వరకు దరఖాస్తులు!
TS WDCW Anganwadi Recruitment 2026: పరీక్ష లేదు.. ఫీజు లేదు.. అంగన్వాడీ టీచర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల – జూలై 18 వరకు దరఖాస్తులు!
TS అంగన్వాడీ ఉద్యోగాల నోటిఫికేషన్ 2026 పూర్తి వివరాలు :
తెలంగాణ రాష్ట్ర మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ (WDCW) ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్, సహాయక పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. జిల్లాల వారీగా నోటిఫికేషన్లు విడుదల చేస్తూ అర్హత కలిగిన స్థానిక మహిళా అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఈ అంగన్వాడీ నియామకాలకు రాత పరీక్ష, దరఖాస్తు ఫీజు లేకుండానే అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :
సంస్థ పేరు : తెలంగాణ రాష్ట్ర మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ (WDCW) లో ఉద్యోగాలు
పోస్టుల వివరాలు :
తెలంగాణలోని 33 జిల్లాల్లో అంగన్వాడీ పోస్టులు దశలవారీగా భర్తీ చేయనున్నారు. వీటిలో:
1. అంగన్వాడీ టీచర్ పోస్టులు: 3,100
2. అంగన్వాడీ సహాయక పోస్టులు: 12,882
జిల్లాల వారీగా ఐసీడీఎస్ (ICDS) ప్రాజెక్టులలో ఖాళీల ఆధారంగా జిల్లా కలెక్టర్ల అనుమతితో నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నారు. ఇప్పటికే పెద్దపల్లి, మహబూబ్నగర్, జోగులాంబ గద్వాల్, నల్గొండ, ములుగు జిల్లాల్లో నోటిఫికేషన్లు వెలువడగా, తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా నియామక ప్రక్రియ ప్రారంభమైంది.
మొత్తం పోస్టులు : 15,982
విద్య అర్హతలు :
అభ్యర్థులు క్రింది అర్హతలు కలిగి ఉండాలి.
1. తప్పనిసరిగా స్థానిక మహిళా అభ్యర్థి అయి ఉండాలి.
2. ఇంటర్మీడియట్ (10+2) ఉత్తీర్ణులై ఉండాలి.
3. సహాయక పోస్టులకు ఇంటర్ అభ్యర్థులు అందుబాటులో లేకపోతే 10వ తరగతి ఉత్తీర్ణులను కూడా పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది.
4. దివ్యాంగ మహిళలు విధులు నిర్వహించగల సామర్థ్యం కలిగి ఉండాలి.
5. సంబంధిత ప్రాంతానికి చెందిన స్థానిక అభ్యర్థి కావాలి.
వయోపరిమితి :
01 జూలై 2026 నాటికి కనీస వయస్సు : 18 సంవత్సరాలు, గరిష్ట వయస్సు : 35 సంవత్సరాలు
కొత్తగూడెం జిల్లా ప్రాజెక్టుల వారీగా ఖాళీలు:
అశ్వరావుపేట – 11
చంద్రుగొండ – 8
బూర్గంపాడు – 10
దమ్మపేట – 16
చర్ల – 12
దుమ్ముగూడెం – 12
మణుగూరు – 24
కొత్తగూడెం – 16
పాల్వంచ – 29
టేకులపల్లి – 19
ఇల్లెందు – 21
రిజర్వేషన్, రోస్టర్ వివరాలు సంబంధిత ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయాలు మరియు అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి.
కొత్తగూడెం జిల్లాలో 178 టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ :
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 11 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 178 అంగన్వాడీ టీచర్ పోస్టుల భర్తీకి జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ అంగన్వాడీ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ 03 జూలై 2026న ప్రారంభమై, 18 జూలై 2026 సాయంత్రం 5 గంటలకు ముగియనుంది.
ఎంపిక విధానం :
1. ఈ నియామకాల్లో రాత పరీక్ష ఉండదు.
2. ఎంపిక పూర్తిగా మెరిట్ మరియు వెయిటేజ్ ఆధారంగా జరుగుతుంది.
వెయిటేజ్ వివరాలు:
ఇంటర్మీడియట్ మార్కులు – 70%
ఇంటర్వ్యూ – 10%
వితంతువులకు – 5%
అనాధలకు – 10%
దివ్యాంగులకు – 5%
3. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలోని జిల్లా ఎంపిక కమిటీ ఇంటర్వ్యూ నిర్వహించి తుది ఎంపిక చేస్తుంది.
అవసరమైన పత్రాలు :
ఆన్లైన్ దరఖాస్తు సమయంలో ఈ క్రింది స్కాన్ కాపీలు సిద్ధంగా ఉంచుకోవాలి.
1. 10వ తరగతి సర్టిఫికేట్ (వయస్సు ధ్రువీకరణ కోసం)
2. కుల ధ్రువీకరణ పత్రం
3. నివాస ధ్రువీకరణ పత్రం
4. ఇంటర్మీడియట్ మార్కుల మెమో మరియు విద్యార్హత సర్టిఫికేట్
5. దివ్యాంగుల సర్టిఫికేట్ (అవసరమైతే)
6. వితంతువు అయితే భర్త మరణ ధ్రువీకరణ పత్రం
7. అనాధ సర్టిఫికేట్ (వర్తిస్తే)
ఎలా దరఖాస్తు చేయాలి?
అర్హత కలిగిన మహిళా అభ్యర్థులు అధికారిక WDCW పోర్టల్లో మాత్రమే ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి. దరఖాస్తు చేసే ముందు సంబంధిత జిల్లా నోటిఫికేషన్, రోస్టర్, రిజర్వేషన్ వివరాలను తప్పనిసరిగా పరిశీలించాలి.
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తుల ప్రారంభ తేదీ: 03 జూలై 2026
దరఖాస్తుల చివరి తేదీ: 18 జూలై 2026
ధ్రువపత్రాల పరిశీలన: 20 జూలై 2026 నుంచి 07 ఆగస్టు 2026 వరకు
Notification Pdf Click Here
Vacancy And Roster Details Click Here
Official Website Click Here