AP Jobs

Ward Boy Jobs 2026 : రాత పరీక్ష లేకుండా 8వ తరగతి అర్హతతో ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగాలు:

calendar_month March 31, 2026 person chitra

Ward Boy Jobs 2026 : రాత పరీక్ష లేకుండా 8వ తరగతి అర్హతతో ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగాలు:

Government General Hospital Nellore Recruitment 2026:

ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో (Government General Hospital) ఒప్పంద ప్రాతిపదికన వ్యసన విముక్తి కేంద్రం కోసం వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 8వ తరగతి నుండి Any Degree వరకు అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి ఎటువంటి రాత పరీక్ష లేకుండా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.

అభ్యర్థులు తమ దరఖాస్తులను 31 మార్చి 2026 నుండి 09 ఏప్రిల్ 2026 వరకు ఉదయం 10:30 నుండి సాయంత్రం 5:00 గంటలలోపు ఆఫ్‌లైన్ ద్వారా సమర్పించాలి.

ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా డాక్టర్, ప్రాజెక్ట్ కోఆర్డినేటర్, కౌన్సిలర్, నర్స్, వార్డ్ బాయ్, అకౌంటెంట్-కమ్-క్లర్క్ వంటి మొత్తం 14 పోస్టులు భర్తీ చేయబడతాయి. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

పోస్టుల వివరాలు – నోటిఫికేషన్ ముఖ్యమైన సమాచారం :

సంస్థ పేరు : ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఉద్యోగాలు

పోస్టుల వివరాలు :

1. డాక్టర్

2. ప్రాజెక్ట్ కోఆర్డినేటర్-కమ్-వొకేషనల్ కౌన్సిలర్

3. కౌన్సిలర్ / సోషల్ వర్కర్ / సైకాలజిస్ట్

4. నర్స్

5. వార్డ్ బాయ్

6. అకౌంటెంట్-కమ్-క్లర్క్

7. పీర్ ఎడ్యుకేటర్

8. చౌకీదార్ పోస్టులు ఉన్నాయి.

మొత్తం పోస్టులు : 14

విద్య అర్హతలు :

డాక్టర్:

MBBS డిగ్రీతో పాటు మెడికల్ కౌన్సిల్/కమిషన్ రిజిస్ట్రేషన్ ఉండాలి. MOSJE/NISD శిక్షణ పొందాలి.

నర్స్:

GNM లేదా B.Sc Nursing అర్హత ఉండాలి.

వార్డ్ బాయ్:

8వ తరగతి ఉత్తీర్ణతతో పాటు ఆసుపత్రి లేదా హెల్త్ సెంటర్‌లో అనుభవం ఉండాలి.

అకౌంటెంట్-కమ్-క్లర్క్:

గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి అకౌంట్స్ మరియు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.

వయోపరిమితి:

01-07-2025 నాటికి కనీస వయస్సు : 18 సంవత్సరాలు, గరిష్ట వయస్సు : 42 సంవత్సరాలు ఉండాలి.

దరఖాస్తు రుసుము:

ఈ ఉద్యోగాలకి ఎటువంటి ఫీజు లేదు.

జీతం వివరాలు :

జీతం పోస్టును అనుసరించి ₹9,000 నుండి ₹60,000 వరకు నెల జీతం అందిస్తారు.

ఎంపిక విధానం:

1. విద్యా అర్హత మెరిట్

2. అనుభవం

3. డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ఎలా అప్లై చేసుకోవాలి?

1. అధికారిక వెబ్‌సైట్ నుండి దరఖాస్తు ఫారమ్ డౌన్‌లోడ్ చేసుకోవాలి.

2. పూర్తిగా నింపిన దరఖాస్తును అవసరమైన పత్రాలతో పాటు పంపాలి.

3. రిజిస్టర్డ్ పోస్టు ద్వారా లేదా స్వయంగా సమర్పించవచ్చు.

అడ్రస్:

సూపరింటెండెంట్,
ప్రభుత్వ జనరల్ హాస్పిటల్,
నెల్లూరు – 524004.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తు ప్రారంభ తేదీ : 31 మార్చ్ 2026

దరఖాస్తు చివరి తేదీ: 09 ఏప్రిల్ 2026

Notification & Application Pdf Click Here

Official Website Click Here 

For More Jobs Information: 

Follow Our What’s App Channel : Join Now

Follow Our Telegram Channel : Join Now

Follow Our Instagram Channel : Join Now

Follow Our Youtube Channel : Join Now

Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *