TG Anganwadi Jobs 2026: 12వ తరగతి అర్హతతో 409 ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక..!..Apply Now :
TG Anganwadi Jobs 2026: 12వ తరగతి అర్హతతో 409 ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక..!..Apply Now :
TG Anganwadi Jobs 2026:
తెలంగాణలో అంగన్వాడీ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న మహిళా అభ్యర్థులకు గుడ్‌న్యూస్. మహిళా, శిశు, వికలాంగుల మరియు వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్ (AWT) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. నిర్మల్, నాగర్‌కర్నూల్, నారాయణపేట జిల్లాల్లో మొత్తం 409 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అంగన్వాడీ టీచర్, హెల్పర్ పోస్టులకు అవకాశం.. పూర్తి వివరాలు, అర్హతలు, దరఖాస్తు విధానం ఇవే!
ఈ పోస్టులకు ఇంటర్మీడియట్ లేదా 12వ తరగతి ఉత్తీర్ణత ఉన్న మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష లేకుండా మెరిట్, ప్రత్యేక కేటగిరీలకు కేటాయించిన మార్కులు, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు సెప్టెంబర్ 15, 2026 నుంచి సెప్టెంబర్ 30, 2026 సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
TG Anganwadi Jobs 2026 – ఖాళీల వివరాలు :
సంస్థ పేరు : తెలంగాణ లో అంగన్వాడీ ఉద్యోగాలు
పోస్టుల వివరాలు :
నిర్మల్ జిల్లా – 89 పోస్టులు
నాగర్‌కర్నూల్ జిల్లా – 255 పోస్టులు
నారాయణపేట జిల్లా – 65 పోస్టులు
మొత్తం పోస్టులు : 409
విద్య అర్హతలు :
అంగన్వాడీ టీచర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా ఇంటర్మీడియట్ లేదా 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి :
01-07-2026 నాటికి 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
స్థానికత నిబంధనలు :
అంగన్వాడీ పోస్టులకు స్థానిక మహిళా అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
1. పట్టణ ప్రాంతాల్లో సంబంధిత అంగన్వాడీ కేంద్రం ఉన్న వార్డుకు చెందిన స్థానిక మహిళ అయి ఉండాలి.
2. గ్రామీణ ప్రాంతాల్లో సంబంధిత అంగన్వాడీ కేంద్రం ఉన్న గ్రామపంచాయతీకి చెందిన స్థానిక మహిళ అయి ఉండాలి.
3. ST సబ్‌ప్లాన్ కింద కేటాయించిన పోస్టులకు సంబంధిత గ్రామం/ఆవాసం/హాబిటేషన్‌కు చెందిన ST అభ్యర్థులు మాత్రమే అర్హులు.
4. SC సబ్‌ప్లాన్ కింద కేటాయించిన పోస్టులకు సంబంధిత గ్రామపంచాయతీలోని ఆవాస గ్రామాలకు చెందిన SC అభ్యర్థులు మాత్రమే అర్హులు.
ఎంపిక విధానం :
ఈ పోస్టులకు సాధారణ రాత పరీక్ష నిర్వహించరు. అభ్యర్థుల ఎంపిక మెరిట్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా జరుగుతుంది.
ఎంపికలో కింది విధంగా మార్కులు పరిగణనలోకి తీసుకుంటారు:
ఇంటర్మీడియట్ మార్కుల మెరిట్ – 70 మార్కులు
వితంతువులకు – 5 మార్కులు
అనాథ అభ్యర్థులకు – 10 మార్కులు
దివ్యాంగులకు – 5 మార్కులు
జిల్లా ఎంపిక కమిటీ నిర్వహించే ఇంటర్వ్యూ – 10 మార్కులు
అర్హతలు, స్థానికత, కేటగిరీ నిబంధనలు మరియు మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ప్రక్రియ పూర్తి చేస్తారు.
ఎలా దరఖాస్తు చేయాలి?
అర్హత ఉన్న మహిళా అభ్యర్థులు తెలంగాణ మహిళా, శిశు, వికలాంగుల మరియు వయోవృద్ధుల శాఖ అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. CDPO, DWO కార్యాలయాలు లేదా ప్రజావాణిలో నేరుగా సమర్పించే దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోరు. ఈ నోటిఫికేషన్‌ను పూర్తిగా రద్దు చేయడం లేదా అవసరమైన మార్పులు, సవరణలు చేయడం వంటి పూర్తి అధికారాలు సంబంధిత జిల్లా కలెక్టర్/చైర్మన్‌కు ఉంటాయి.
అధికారిక వెబ్‌సైట్: https://wdcw.tg.nic.in/
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తుల ప్రారంభ తేదీ : 15 సెప్టెంబర్ 2026
దరఖాస్తులకు చివరి తేదీ : 30 సెప్టెంబర్ 2026
1st Notification Pdf Click Here
1st Vacancy Roster List Click Here
2ndNotification Pdf Click Here
2ndVacancy Roster List Click Here
3rdNotification Pdf Click Here
3rdVacancy Roster List Click Here
Official Website Click Here
Apply Online Click Here