IISC Administrative Assistant Recruitment 2026: విద్యా శాఖలో 34 అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ ఉద్యోగాలు – డిగ్రీ అర్హతతో ఇప్పుడే అప్లై చేయండి!
IISC Administrative Assistant Recruitment 2026: విద్యా శాఖలో 34 అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ ఉద్యోగాలు – డిగ్రీ అర్హతతో ఇప్పుడే అప్లై చేయండి!
IISC Administrative Assistant Recruitment 2026:
భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISC) నుంచి అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి తాజా నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 34 రెగ్యులర్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
అనుభవం అవసరం లేకుండానే ఈ ఉద్యోగాలకు అప్లై చేసే అవకాశం ఉండటం విశేషం. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.29,200 నుండి రూ.92,300 వరకు జీతం అందించనున్నారు. మరిన్ని ఇప్పుడు చూద్దాం.
పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :
సంస్థ పేరు : ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISC) లో ఉద్యోగాలు
పోస్టుల వివరాలు : అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ పోస్టులు
మొత్తం పోస్టులు : 34
విద్య అర్హతలు :
1. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత.
2. డిగ్రీలో కనీసం 50% మార్కులు ఉండాలి.
వయో పరిమితి :
1. 18 జూన్ 2026 నాటికి అభ్యర్థి వయస్సు 26 సంవత్సరాలు మించకూడదు.
2. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోసడలింపు వర్తిస్తుంది.
దరఖాస్తు రుసుము :
1. SC / ST / PwBD / మాజీ సైనికులు / ట్రాన్స్జెండర్ / మహిళా అభ్యర్థులు – రూ.50 (ప్రాసెసింగ్ ఫీజు మాత్రమే)
2. ఇతర అభ్యర్థులు – రూ.450 దరఖాస్తు రుసుము + రూ.50 ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి.
గమనిక: ఒకసారి చెల్లించిన ఫీజు తిరిగి చెల్లించబడదు.
జీతం వివరాలు :
ఎంపికైన అభ్యర్థులకు పే లెవల్-05 ప్రకారం నెలకు రూ.29,200 – రూ.92,300 వరకు వేతనం చెల్లించబడుతుంది.
ఎంపిక విధానం :
1. రాత పరీక్ష నిర్వహిస్తారు.
2. డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఎంపిక చేయడం జరుగుతుంది.
ఎలా అప్లై చేసుకోవాలి?
1. అభ్యర్థులు IISC అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేయాలి.
2. నియామక ప్రక్రియకు సంబంధించిన తాజా సమాచారం, పరీక్ష తేదీలు మరియు ఇతర వివరాలు అధికారిక వెబ్సైట్లో ప్రకటించబడతాయి.
3. కాబట్టి అభ్యర్థులు తరచూ వెబ్సైట్ను సందర్శించడం మంచిది.
ముఖ్యమైన తేదీలు:
ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ: 29 మే 2026
ఆన్లైన్ దరఖాస్తుల చివరి తేదీ: 18 జూన్ 2026
FullNotification Pdf Click Here
Apply Online Link Click Here
Official Website Click Here