రాత పరీక్ష లేకుండా అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ ఉద్యోగాలు 2026 | 10వ అర్హతతో ఉద్యోగాలు వెంటనే అప్లై చేసుకోండి !
రాత పరీక్ష లేకుండా అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ ఉద్యోగాలు 2026 | 10వ అర్హతతో ఉద్యోగాలు వెంటనే అప్లై చేసుకోండి !
Urban Residential School Jobs 2026 :
అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ ఉద్యోగాలు 2026 నోటిఫికేషన్ తెలంగాణలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు మంచి అవకాశంగా చెప్పవచ్చు. రాత పరీక్ష లేకుండానే ఎంపిక ప్రక్రియ నిర్వహించడం విశేషం. 10వ తరగతి అర్హతతో పాటు డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు నెలకు రూ.9,750 నుంచి రూ.14,300 వరకు వేతనం అందించనున్నారు. ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులు చివరి తేదీ ముగిసేలోపు అవసరమైన ధ్రువపత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.
అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ ఉద్యోగాలు 2026 అర్హతలు :
ఈ నోటిఫికేషన్ తెలంగాణలోని జనగామ జిల్లాలో ఉన్న అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్‌లో ఖాళీగా ఉన్న నాన్-టీచింగ్ పోస్టుల భర్తీ కోసం విడుదలైంది. అకౌంటెంట్ పోస్టుకు కామర్స్‌లో డిగ్రీ అర్హత ఉండగా, అసిస్టెంట్ కుక్ మరియు అటెండర్ పోస్టులకు 10వ తరగతి ఉత్తీర్ణత సరిపోతుంది. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.9,750 నుంచి రూ.14,300 వరకు వేతనం అందించనున్నారు.
సంస్థ పేరు : అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్‌లో ఉద్యోగాలు
పోస్టుల వివరాలు :
1. అకౌంటెంట్ – 1
2. అసిస్టెంట్ కుక్ – 1
3. అటెండర్ – 1
మొత్తం పోస్టులు : 03
విద్య అర్హతలు & జీతం వివరాలు :
అకౌంటెంట్ :
1. కామర్స్‌లో డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
2. ట్యాలీ మరియు ఇతర అకౌంటింగ్ సాఫ్ట్‌వేర్‌లలో అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యం ఉంటుంది.
3. నెలవారీ వేతనం రూ.14,300/-
అసిస్టెంట్ కుక్ :
1. కనీసం 10వ తరగతి ఉత్తీర్ణత ఉండాలి.
2. వంట నైపుణ్యాలను పరిశీలించేందుకు డెమో నిర్వహిస్తారు.
3. నెల జీతం రూ.9,750/-
అటెండర్ :
1. 10వ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులు.
2. నెలవారీ వేతనం రూ.9,750/-
దరఖాస్తు విధానం :
ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులు అవసరమైన ధ్రువపత్రాల జిరాక్స్ ప్రతులతో కలిసి ఈ నెల 9వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు జనగామ అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్‌లో నేరుగా దరఖాస్తు చేసుకోవాలి.
మరిన్ని వివరాలకు
సంప్రదించవలసిన ఫోన్ నంబర్: 9849628441
