India Post Staff Car Driver Recruitment 2026 : 10వ తరగతి అర్హతతో పోస్టాఫీస్‌లో 24 గ్రూప్-C ఉద్యోగాలు…వెంటనే అప్లై చేసుకోండి.
India Post Staff Car Driver Recruitment 2026 : 10వ తరగతి అర్హతతో పోస్టాఫీస్‌లో 24 గ్రూప్-C ఉద్యోగాలు…వెంటనే అప్లై చేసుకోండి.
India Post Staff Car Driver Recruitment 2026 :
భారత తపాలా శాఖ (India Post) నిరుద్యోగులకు మరో ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని పోస్టాఫీస్ విభాగంలో Staff Car Driver (Ordinary Grade) Group-C Recruitment 2026 ద్వారా మొత్తం 24 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు 10వ తరగతి విద్యార్హతతో పాటు చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్, డ్రైవింగ్ అనుభవం ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ పోస్టులకు ఎంపికైన వారికి 7వ వేతన సంఘం ప్రకారం నెలకు రూ.19,900 నుంచి రూ.63,200 వరకు జీతం లభిస్తుంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులను స్పీడ్ పోస్ట్ ద్వారా మాత్రమే పంపించాలి. దరఖాస్తులకు చివరి తేదీ 30 నవంబర్ 2026 సాయంత్రం 5 గంటల వరకు నిర్ణయించారు.
India Post Staff Car Driver Recruitment 2026 ముఖ్యమైన వివరాలు:
సంస్థ పేరు : భారత తపాలా శాఖ (India Post) లో ఉద్యోగాలు
మంత్రిత్వ శాఖ: కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ
పోస్టు పేరు : Staff Car Driver (Ordinary Grade)
ఉద్యోగ విభాగం: గ్రూప్-C
మొత్తం ఖాళీలు : 24
దరఖాస్తు విధానం : ఆఫ్‌లైన్
ఉద్యోగ స్థాయి : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం
విద్యార్హతలు :
1. గుర్తింపు పొందిన బోర్డు లేదా విద్యాసంస్థ నుంచి 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
2. లైట్ మోటార్ వెహికల్ (LMV), హెవీ మోటార్ వెహికల్ (HMV) నడిపేందుకు చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి.
3. మోటారు వాహనాల మెకానిజంపై అవగాహన ఉండాలి. వాహనంలో వచ్చే చిన్నపాటి సమస్యలను గుర్తించి సరిచేయగలగాలి.
4. లైట్, హెవీ మోటార్ వెహికల్స్ నడపడంలో కనీసం 3 సంవత్సరాల అనుభవం ఉండాలి.
అదనపు అర్హత: హోమ్ గార్డ్ లేదా సివిల్ వాలంటీర్‌గా కనీసం మూడు సంవత్సరాల సేవ చేసిన అభ్యర్థులకు ప్రాధాన్యత కల్పించే అవకాశం ఉంది.
వయోపరిమితి :
1. జనరల్ (UR), EWS అభ్యర్థులకు: 18 నుంచి 27 సంవత్సరాలు.
2. SC, ST అభ్యర్థులకు: 5 సంవత్సరాల వయోపరిమితి సడలింపు.
3. OBC అభ్యర్థులకు: 3 సంవత్సరాల వయోపరిమితి సడలింపు.
4. ప్రభుత్వ ఉద్యోగులకు: వర్తించే ప్రభుత్వ నిబంధనల ప్రకారం గరిష్ఠంగా 40 సంవత్సరాల వరకు వయోపరిమితి సడలింపు ఉంటుంది.
దరఖాస్తు రుసుము :
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కేటగిరీల వారీగా ఫీజు చెల్లించాలి.
1. జనరల్, EWS, OBC అభ్యర్థులకు: రూ.100/-
2. మహిళా అభ్యర్థులకు: ఫీజు మినహాయింపు.
3. SC/ST అభ్యర్థులకు: ఫీజు మినహాయింపు.
ఫీజు చెల్లింపు విధానం: భారతదేశంలోని ఏదైనా కంప్యూటరైజ్డ్ పోస్టాఫీస్‌లో చలాన్ ఫారం ద్వారా E-Payment పద్ధతిలో ఫీజు చెల్లించాలి.
E-Bill పేరు: Senior Manager, MMS Chennai, CPMG Tamil Nadu Circle
E-Bill ID: 1000099022
ఒకసారి చెల్లించిన దరఖాస్తు ఫీజు తిరిగి చెల్లించబడదు.
జీతం వివరాలు :
India Post Staff Car Driver ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు 7వ వేతన సంఘం పే మ్యాట్రిక్స్ ప్రకారం Level-2 కింద వేతనం చెల్లిస్తారు.
కనీస బేసిక్ పే: రూ.19,900, గరిష్ఠ బేసిక్ పే: రూ.63,200
అదనంగా: ప్రభుత్వ నిబంధనల ప్రకారం అనుమతించబడిన అలవెన్సులు
ఎంపిక విధానం :
ఈ ఉద్యోగాలకు అభ్యర్థుల ఎంపిక అధికారిక నోటిఫికేషన్‌లో పేర్కొన్న పరీక్షా విధానం, సిలబస్ ఆధారంగా జరుగుతుంది. అభ్యర్థుల ప్రతిభ, వారు ఇచ్చిన ప్రాధాన్యతలను పరిగణనలోకి తీసుకొని అందుబాటులో ఉన్న ఖాళీల ప్రకారం సంబంధిత డివిజన్ లేదా యూనిట్‌కు కేటాయిస్తారు.
పరీక్షా విధానం, ఇతర ఎంపిక ప్రక్రియ వివరాలను నోటిఫికేషన్‌లోని Annexure-I ద్వారా తెలుసుకోవచ్చు.
ఎలా అప్లై చేసుకోవాలి?
1. ముందుగా India Post అధికారిక వెబ్‌సైట్( www.indiapost.gov.in ) ను సందర్శించాలి.
2. Staff Car Driver Recruitment 2026 నోటిఫికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.
3. నోటిఫికేషన్‌లో ఇచ్చిన దరఖాస్తు ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.
4. దరఖాస్తు ఫారమ్‌లో అడిగిన వివరాలను తప్పులు లేకుండా నమోదు చేయాలి.
5. అవసరమైన విద్యార్హత, డ్రైవింగ్ లైసెన్స్, అనుభవ ధ్రువపత్రాలు తదితర పత్రాలను జతచేయాలి.
6. వర్తించే అభ్యర్థులు రూ.100 దరఖాస్తు ఫీజును పోస్టాఫీస్ ద్వారా చెల్లించాలి.
7. పూర్తి చేసిన దరఖాస్తును స్పీడ్ పోస్ట్ ద్వారా నిర్ణీత చిరునామాకు పంపించాలి.
దరఖాస్తు పంపాల్సిన చిరునామా:
The Senior Manager,
Mail Motor Service,
No.37, Greams Road,
Chennai – 600 006.
దరఖాస్తులు 30-11-2026 సాయంత్రం 5 గంటలలోపు సంబంధిత కార్యాలయానికి చేరాలి. స్పీడ్ పోస్ట్ ద్వారా మాత్రమే దరఖాస్తులు పంపించాలి. ఇతర మార్గాల్లో పంపిన దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోరు.
ముఖ్యమైన తేదీ:
దరఖాస్తు చివరి తేదీ : 30 నవంబర్ 2026
Notification Pdf & Application Pdf Click Here
Official Website Click Here