NCL అప్రెంటిస్ రిక్రూట్మెంట్ 2026 – 1607 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల…వెంటనే అప్లై చేసుకోండి!
NCL అప్రెంటిస్ రిక్రూట్మెంట్ 2026 – 1607 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల…వెంటనే అప్లై చేసుకోండి!
NCL అప్రెంటిస్ రిక్రూట్మెంట్ 2026 :
ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (NCL) భారీ అవకాశాన్ని అందించింది. సంస్థ 2026 సంవత్సరానికి సంబంధించి మొత్తం 1607 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రాడ్యుయేట్, డిప్లొమా, ఐటీఐ మరియు పారామెడికల్ విభాగాల్లో ఈ ఖాళీలను భర్తీ చేయనుంది. ఎంపికైన అభ్యర్థులకు ఒక సంవత్సరం పాటు శిక్షణతో పాటు నెలవారీ స్టైపెండ్ కూడా చెల్లించబడుతుంది. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :
సంస్థ పేరు: Northern Coalfields Limited (NCL) లో ఉద్యోగాలు
పోస్టు పేరు: Apprentice Trainee పోస్టులు
పోస్టుల వివరాలు :
1. Graduate Apprentices – 241
2. Diploma Apprentices – 305
3. Trade Apprentices – 906
4. Paramedical Apprentices – 155
మొత్తం ఖాళీలు: 1607
శిక్షణ కాలం: 1 సంవత్సరం
ఉద్యోగ ప్రాంతం: మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్
దరఖాస్తు విధానం: ఆన్లైన్
విద్యార్హతలు :
Graduate Apprentice: సంబంధిత విభాగంలో డిగ్రీ
Diploma Apprentice: సంబంధిత విభాగంలో డిప్లొమా
Trade Apprentice: 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు ITI
Paramedical Apprentice: సంబంధిత పారామెడికల్ కోర్సులో డిగ్రీ లేదా డిప్లొమా పూర్తి చేసి, నిర్దేశిత రిజిస్ట్రేషన్ లేదా అర్హతలను కలిగి ఉండాలి.
వయోపరిమితి :
01 జూన్ 2026 నాటికీ కనిష్ట వయస్సు : 18 సంవత్సరాలు, గరిష్ట వయస్సు : 26 సంవత్సరాలు
వయస్సు సడలింపు :
1. SC/ST అభ్యర్థులకు : 5 సంవత్సరాలు
2. OBC (NCL) అభ్యర్థులకు : 3 సంవత్సరాలు
3. PwBD అభ్యర్థులకు : గరిష్టంగా 10 సంవత్సరాలు
స్టైపెండ్ వివరాలు :
Graduate Apprentice – రూ.12,300
Diploma Apprentice -రూ.10,900
Trade Apprentice – రూ10,560 వరకు
Paramedical Degree – రూ.13,700
Paramedical Diploma – రూ.12,700/-
ఎంపిక విధానం :
1. ఈ నియామకాలకు ఎటువంటి రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూ నిర్వహించరు.
2. అభ్యర్థుల విద్యార్హతల్లో సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్ జాబితా తయారు చేస్తారు.
3. షార్ట్‌లిస్ట్ అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వహించి, అనంతరం మెడికల్ ఫిట్నెస్ పరీక్షలో అర్హత సాధించిన వారికి అప్రెంటిస్ శిక్షణ అవకాశం కల్పిస్తారు.
ఎలా అప్లై చేసుకోవాలి?
1. Graduate మరియు Diploma అభ్యర్థులు NATS పోర్టల్‌లో నమోదు చేసుకోవాలి.
2. Trade Apprentice అభ్యర్థులు NAPS పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
3. సంబంధిత పోస్టుకు ఆన్లైన్లో దరఖాస్తు చేయాలి.
4. అవసరమైన పత్రాలను అప్లోడ్ చేసి దరఖాస్తును సమర్పించాలి.
5. భవిష్యత్ అవసరాల కోసం అప్లికేషన్ కాపీని భద్రపరచుకోవాలి.
అవసరమైన పత్రాలు :
1. 10వ తరగతి మార్కుల మెమో
2. డిగ్రీ/డిప్లొమా/ITI సర్టిఫికెట్లు
3. ఆధార్ కార్డు
4. కుల ధృవీకరణ పత్రం (అవసరమైతే)
5. PwBD సర్టిఫికేట్ (అవసరమైతే)
6. పాస్‌పోర్ట్ సైజు ఫోటో
7. సంతకం స్కాన్ కాపీ
8. NATS/NAPS రిజిస్ట్రేషన్ ఐడి
ముఖ్యమైన తేదీలు :
ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభం : 01 జూన్ 2026
దరఖాస్తుల చివరి తేదీ : 15 జూన్ 2026
మెరిట్ లిస్ట్ విడుదల : 20 జూన్ 2026