Anganwadi Jobs 2026 : రాత పరీక్ష లేకుండా 10వ తరగతి అర్హతతో అంగన్వాడి హెల్పర్ ఉద్యోగాలు.. 230 ఖాళీలకు దరఖాస్తులు ప్రారంభం….వెంటనే అప్లై చేసుకోండి.
Anganwadi Jobs 2026 : రాత పరీక్ష లేకుండా 10వ తరగతి అర్హతతో అంగన్వాడి హెల్పర్ ఉద్యోగాలు.. 230 ఖాళీలకు దరఖాస్తులు ప్రారంభం….వెంటనే అప్లై చేసుకోండి.
AP Anganwadi Helper Recruitment 2026 :
మహిళా అభ్యర్థులకు శుభవార్త. ఆంధ్రప్రదేశ్లోని జిల్లా మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి కార్యాలయం ఆధ్వర్యంలో అంగన్వాడి హెల్పర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. కేవలం 10వ తరగతి అర్హతతో, ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఈ ఉద్యోగాలకు ఎంపిక చేపట్టనున్నారు. ఆసక్తి మరియు అర్హత కలిగిన మహిళా అభ్యర్థులు 09 జూన్ 2026 నుంచి 18 జూన్ 2026 సాయంత్రం 5 గంటల వరకు ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :
సంస్థ పేరు : జిల్లా మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి కార్యాలయం లో ఉద్యోగాలు
పోస్టు పేరు : అంగన్వాడి హెల్పర్ పోస్టులు
జిల్లా వారీగా ఖాళీలు :
కదిరి – 70 పోస్టులు
నల్లచెరువు – 51 పోస్టులు
ధర్మవరం – 21 పోస్టులు
బత్తలపల్లి – 63 పోస్టులు
సి.కె.పల్లి – 25 పోస్టులు
మొత్తం ఖాళీలు : 230
ఉద్యోగ స్వభావం : శాశ్వత ఉద్యోగాలు
విద్య అర్హతలు :
1. అంగన్వాడి హెల్పర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే మహిళా అభ్యర్థులు తప్పనిసరిగా 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
2. అభ్యర్థులు వివాహితులై ఉండటంతో పాటు సంబంధిత అంగన్వాడి కేంద్రం ఉన్న గ్రామం లేదా మజరాకు చెందిన స్థానిక నివాసితులై ఉండాలి.
వయో పరిమితి:
1. 01 జూలై 2026 నాటికి అభ్యర్థుల వయస్సు 21 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.
2. ఎస్సీ, ఎస్టీ హాబిటేషన్లలో ఉన్న ఖాళీలకు సంబంధిత వర్గాలకు చెందిన మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులు.
దరఖాస్తు రుసుము :
ఈ నియామకాలకు ఎలాంటి దరఖాస్తు రుసుము లేదు.
జీతం వివరాలు :
1. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.7,000 గౌరవ వేతనం చెల్లిస్తారు.
2. అంగన్వాడి కార్యకర్తలకు రూ.11,500 వరకు గౌరవ వేతనం అందజేయబడుతుంది.
ఎంపిక విధానం :
1. అభ్యర్థుల ఎంపికను ఎలాంటి రాత పరీక్ష నిర్వహించకుండా, ప్రభుత్వ నిబంధనల ప్రకారం చేపడతారు.
2. మెరిట్ మరియు రిజర్వేషన్ నిబంధనలను అనుసరించి తుది ఎంపిక ఉంటుంది.
ఎలా అప్లై చేసుకోవాలి?
1. అర్హత కలిగిన మహిళా అభ్యర్థులు సంబంధిత ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయం నుంచి దరఖాస్తు ఫారాన్ని పొందాలి.
2. పూర్తి చేసిన దరఖాస్తుతో పాటు అవసరమైన ధ్రువపత్రాలను జతచేసి 18 జూన్ 2026 సాయంత్రం 5 గంటలలోపు సంబంధిత కార్యాలయంలో సమర్పించాలి.
3. గడువు ముగిసిన తర్వాత వచ్చిన దరఖాస్తులు పరిగణనలోకి తీసుకోరు.
జత చేయాల్సిన పత్రాలు :
1. 10వ తరగతి మార్కుల మెమో
2. ఆధార్ కార్డు / నివాస ధ్రువీకరణ పత్రం
3. జనన తేదీ నిర్ధారణకు సంబంధించిన పత్రం
4. కుల ధ్రువీకరణ పత్రం (అవసరమైతే)
5. వికలాంగుల ధ్రువీకరణ పత్రం (అవసరమైతే)
6. తాజా పాస్పోర్ట్ సైజ్ ఫోటో

ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తుల ప్రారంభ తేదీ : 09 జూన్ 2026
దరఖాస్తుల చివరి తేదీ : 18 జూన్ 2026
Notification & Application Pdf Click Here
Office Website Click Here