ఎటువంటి పరీక్ష , ఫీజు లేకుండా 7వ తరగతి, ఇంటర్ అర్హతతో ఇన్స్ట్రక్టర్ & ఆయా ఉద్యోగాలు… వెంటనే అప్లై చేసుకోండి.!
ఎటువంటి పరీక్ష , ఫీజు లేకుండా 7వ తరగతి, ఇంటర్ అర్హతతో ఇన్స్ట్రక్టర్ & ఆయా ఉద్యోగాలు… వెంటనే అప్లై చేసుకోండి.!
ప్రీ ప్రైమరీ స్కూల్ ఇన్స్ట్రక్టర్, ఆయా పోస్టుల భర్తీ 2026 :
మహిళా అభ్యర్థులకు మరో మంచి ఉద్యోగావకాశం అందుబాటులోకి వచ్చింది. సిద్ధిపేట జిల్లాలో కొత్తగా మంజూరైన 85 ప్రీ-ప్రైమరీ విభాగాల్లో ఇన్స్ట్రక్టర్ మరియు ఆయా పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఈ నియామకాలకు ఎలాంటి రాత పరీక్ష లేదా దరఖాస్తు ఫీజు లేదు. స్థానిక మహిళా అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :
సంస్థ పేరు :TS Pre Primary School లో ఉద్యోగాలు
పోస్టుల వివరాలు :
2026-27 విద్యా సంవత్సరానికి మొత్తం 85 పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ విభాగాల కోసం రెండు రకాల పోస్టులను భర్తీ చేయనున్నారు.
1. ప్రీ-ప్రైమరీ ఇన్స్ట్రక్టర్
2. ఆయా (Aaya) పోస్టులు
విద్య అర్హతలు & జీతం వివరాలు :
ప్రీ-ప్రైమరీ ఇన్స్ట్రక్టర్ :
1. ఇంటర్మీడియట్ (10+2) లేదా సమాన అర్హత తప్పనిసరి.
2. ప్రీ-ప్రైమరీ లేదా ప్రాథమిక విద్యకు సంబంధించిన కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
3. నెలకు గౌరవ వేతనం రూ.8,000/-
ఆయా పోస్టు :
1. కనీసం 7వ తరగతి ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
2. నెలకు గౌరవ వేతనం రూ.6,000/-
వయోపరిమితి :
నోటిఫికేషన్ విడుదలైన తేదీ నాటికి అభ్యర్థుల వయస్సు 18 నుంచి 44 సంవత్సరాల మధ్య ఉండాలి.
వయో సడలింపు:
1. SC/ST/BC/EWS అభ్యర్థులకు – 5 సంవత్సరాలు
2. మాజీ సైనికులకు – 3 సంవత్సరాలు
3. దివ్యాంగులకు – 10 సంవత్సరాలు
ఎంపికలో ప్రాధాన్యత క్రమం :
అభ్యర్థుల ఎంపికలో కింది క్రమంలో ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.
1. అదే గ్రామ నివాసితులు
2. అదే గ్రామపంచాయతీ పరిధి
3.అదే మండలం, అదే జిల్లా వారికీ ప్రాధాన్యత
ముఖ్యమైన సూచనలు :
1. నియామకాలు పూర్తిగా తాత్కాలిక ప్రాతిపదికన ఉంటాయి.
2. ప్రతి విద్యా సంవత్సరంలో 10 నెలల పాటు గౌరవ వేతనం చెల్లిస్తారు.
3. ఎంపికైన ఇన్స్ట్రక్టర్లు పాఠశాల విద్యాశాఖ సూచించిన శిక్షణను తప్పనిసరిగా పూర్తి చేయాలి.
4. స్థానిక మహిళా అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఉంటుంది.
దరఖాస్తు విధానం :
అర్హత కలిగిన మహిళా అభ్యర్థులు సంబంధిత మండల విద్యాశాఖ అధికారి (MEO) కార్యాలయంలో దరఖాస్తులను సమర్పించాలి.
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తు ప్రారంభ తేదీ : 08 జూన్ 2026
దరఖాస్తు చివరి తేదీ : 12 జూన్ 2026
Notification Pdf Click Here
Application Pdf Click Here