ISRO Jobs 2026: డిగ్రీ అర్హతతో ఇస్రోలో టీచర్ ఉద్యోగాలు.. 10 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల…వెంటనే అప్లై చేసుకోండి.
ISRO Jobs 2026: డిగ్రీ అర్హతతో ఇస్రోలో టీచర్ ఉద్యోగాలు.. 10 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల…వెంటనే అప్లై చేసుకోండి.
ISRO Jobs 2026:
ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO)కు చెందిన సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ (SDSC-SHAR) ఆధ్వర్యంలోని విద్యాసంస్థల్లో టీచింగ్ పోస్టుల భర్తీ కోసం కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 10 పోస్టులను భర్తీ చేయనున్న ఈ నియామక ప్రక్రియకు అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఆసక్తి ఉన్న వారు 2026 జులై 7 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :
సంస్థ పేరు : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) లో ఉద్యోగాలు
పోస్టుల వివరాలు :
ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (TGT) పోస్టులు :
మ్యాథమెటిక్స్
సైన్స్
తెలుగు
ఖాళీలు : 04
ప్రైమరీ టీచర్ (PRT) పోస్టులు :
ఖాళీలు : 06
మొత్తం ఖాళీలు : 10
విద్య అర్హతలు :
1. పోస్టును బట్టి సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ లేదా పీజీ పూర్తి చేసి ఉండాలి.
2. అదనంగా B.Ed, D.Ed, M.Ed, B.El.Ed లేదా డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ అర్హత తప్పనిసరి.
3. అలాగే అభ్యర్థులు రాష్ట్ర టెట్ (TET) లేదా సెంట్రల్ టెట్ (CTET)లో అర్హత సాధించి ఉండాలి.
వయో పరిమితి :
1. కనీస వయస్సు : 18 సంవత్సరాలు, గరిష్ట వయస్సు : 30 సంవత్సరాలు
2. రిజర్వేషన్ వర్గాలకు కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది.
జీతం వివరాలు :
TGT పోస్టులు: నెలకు రూ.44,900 నుంచి రూ.1,44,400 వరకు
PRT పోస్టులు: నెలకు రూ.35,400 నుంచి రూ.1,12,400 వరకు జీతం ఇస్తారు.
ఎంపిక విధానం :
అభ్యర్థులను కింది దశల ఆధారంగా ఎంపిక చేస్తారు.
1. రాత పరీక్ష
2. స్కిల్ టెస్ట్
3. ఇంటర్వ్యూ
4. డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఎంపిక చేయడం జరుగుతుంది.
ఎలా అప్లై చేసుకోవాలి?
అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తుల ప్రారంభం: ఇప్పటికే ప్రారంభమయ్యాయి
దరఖాస్తుల చివరి తేదీ: 07 జులై 2026
Official Website : Click Here