Results

AP EAPCET 2026 Counselling Dates: ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్ ఎప్పుడు ప్రారంభం? అవసరమైన డాక్యుమెంట్లు ఇవే!

calendar_month July 5, 2026 person chitra

AP EAPCET 2026 Counselling Dates: ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్ ఎప్పుడు ప్రారంభం? అవసరమైన డాక్యుమెంట్లు ఇవే!

AP EAPCET 2026 Counselling Latest Update:

ఏపీ ఈఏపీసెట్ (EAPCET) 2026లో అర్హత సాధించిన విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కౌన్సిలింగ్ షెడ్యూల్ త్వరలో విడుదల కానుంది. ఉన్నత విద్యా మండలి (APSCHE) ఇంజనీరింగ్ ప్రవేశాల కోసం జూలై 20 నుంచి కౌన్సిలింగ్ ప్రక్రియను ప్రారంభించే అవకాశం ఉన్నట్లు సమాచారం. అధికారిక షెడ్యూల్ విడుదలైన వెంటనే అభ్యర్థులు నిర్ణీత తేదీల్లో ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.

ఈసారి కూడా AP EAPCET 2026 Counselling పూర్తిగా ఆన్‌లైన్ విధానంలో నిర్వహించనున్నారు. విద్యార్థులు ఒక్కో దశను నిర్ణీత గడువులో పూర్తి చేయాల్సి ఉంటుంది. కౌన్సిలింగ్ ప్రక్రియలో ఫీజు చెల్లింపు నుంచి కళాశాలలో రిపోర్ట్ చేసే వరకు అన్ని దశలు ఆన్‌లైన్ ద్వారానే కొనసాగుతాయి.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

AP EAPCET 2026 కౌన్సిలింగ్ ప్రక్రియ :

కౌన్సిలింగ్‌లో అభ్యర్థులు ఈ క్రింది దశలను వరుసగా పూర్తి చేయాలి.

1. ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు

2. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్

3. సర్టిఫికెట్ వెరిఫికేషన్

4. అభ్యర్థి నమోదు (Candidate Registration)

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

5. వెబ్ ఆప్షన్లు నమోదు

6. వెబ్ ఆప్షన్ ప్రింట్ తీసుకోవడం.

7. సీట్ అలాట్‌మెంట్

8. సెల్ఫ్ రిపోర్టింగ్

9. కేటాయించిన కళాశాలలో రిపోర్ట్ చేయడం.

వెబ్ ఆప్షన్లు నమోదు చేసే సమయంలో విద్యార్థులు తమకు ఇష్టమైన కాలేజీలు, కోర్సులను ప్రాధాన్యత క్రమంలో జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలి. ఆ ఎంపికల ఆధారంగానే సీట్లు కేటాయిస్తారు.

ప్రాసెసింగ్ ఫీజు :

కౌన్సిలింగ్ ప్రారంభంలో అభ్యర్థులు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి.

1. SC / ST అభ్యర్థులు: ₹600/-

2. OC / BC అభ్యర్థులు: ₹1,200/-

3. ఫీజు చెల్లించిన తర్వాత మాత్రమే తదుపరి దశలకు వెళ్లే అవకాశం ఉంటుంది.

AP EAPCET 2026 కౌన్సిలింగ్‌కు అవసరమైన డాక్యుమెంట్లు :

కౌన్సిలింగ్ సమయంలో ఈ క్రింది పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలి.

1. AP EAPCET 2026 ర్యాంక్ కార్డ్

2. AP EAPCET హాల్ టికెట్

3. SSC (10వ తరగతి) మార్క్స్ మెమో

4. ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో

5. ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్ (TC)

6. 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు స్టడీ సర్టిఫికేట్లు

7. ఆధార్ కార్డు

8. ఆదాయ ధ్రువీకరణ పత్రం

9. కుల ధ్రువీకరణ పత్రం

10. EWS సర్టిఫికెట్ (వర్తించే వారికి)

11. నివాస ధ్రువీకరణ పత్రం

12. NCC / స్పోర్ట్స్ / CAP / PH తదితర ప్రత్యేక రిజర్వేషన్ సర్టిఫికేట్లు (వర్తించే వారికి)

అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్లతో పాటు అవసరమైన జిరాక్స్ కాపీలను కూడా సిద్ధంగా ఉంచుకోవడం మంచిది. అధికారిక షెడ్యూల్ విడుదలైన తర్వాత సూచించిన విధంగా డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయడంతో పాటు వెరిఫికేషన్ సమయంలో సమర్పించాల్సి ఉంటుంది.

ముఖ్య సూచన :

AP EAPCET 2026 Counselling Schedule అధికారికంగా విడుదలైన వెంటనే తేదీలు, వెబ్ ఆప్షన్ గడువులు, సీట్ అలాట్‌మెంట్ వివరాలను పరిశీలించి నిర్ణీత సమయంలో ప్రతి దశను పూర్తి చేయాలి. ఆలస్యం చేస్తే కౌన్సిలింగ్ అవకాశాన్ని కోల్పోయే ప్రమాదం ఉంటుంది. అధికారిక ప్రకటన విడుదలైన తర్వాత మాత్రమే తుది తేదీలను పరిగణనలోకి తీసుకోవాలని అభ్యర్థులకు సూచిస్తున్నారు.

AP EAPCET 2026 Official Website

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe
Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *