తెలంగాణలో 15,982 అంగన్వాడీ ఉద్యోగాలు.. 12వ తరగతి అర్హతతో అవకాశం.. మీ జిల్లా నోటిఫికేషన్ ఓపెన్లో ఉందో లేదో చూడండి!
తెలంగాణలో 15,982 అంగన్వాడీ ఉద్యోగాలు.. 12వ తరగతి అర్హతతో అవకాశం.. మీ జిల్లా నోటిఫికేషన్ ఓపెన్లో ఉందో లేదో చూడండి!
తెలంగాణ అంగన్వాడీ ఉద్యోగాలు 2026 – జిల్లా వారీ ఖాళీలు :
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న మహిళా అభ్యర్థులకు శుభవార్త. రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మొత్తం 15,982 అంగన్వాడీ టీచర్ మరియు హెల్పర్ పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. ప్రస్తుతం కొన్ని జిల్లాల్లో ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరిస్తుండగా, మిగిలిన జిల్లాలకు సంబంధించిన నోటిఫికేషన్లు కూడా త్వరలో విడుదల కానున్నాయి.
ఇప్పటికే పెద్దపల్లి, మహబూబ్నగర్, గద్వాల్ జిల్లాల్లో దరఖాస్తుల గడువు ముగిసింది. ప్రస్తుతం ఆదిలాబాద్, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, కరీంనగర్, సంగారెడ్డి, నల్లగొండ, ములుగు జిల్లాల అభ్యర్థులకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.
ఖాళీల వివరాలు – ముఖ్యమైన సమాచారం :
సంస్థ పేరు : తెలంగాణ లో అంగన్వాడీ ఉద్యోగాలు
ఆదిలాబాద్ జిల్లాలో ఖాళీల వివరాలు :
తాజా నోటిఫికేషన్ ప్రకారం ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం 242 అంగన్వాడీ పోస్టులు భర్తీ చేయనున్నారు.
అంగన్వాడీ టీచర్ పోస్టులు – 63
అంగన్వాడీ హెల్పర్ పోస్టులు – 179
ఈ నియామకాలు గాదిగూడ, నార్నూర్, ఇంద్రవెల్లి, ఉట్నూర్ మండలాల్లో చేపట్టనున్నారు.
విద్యార్హతలు :
1. అంగన్వాడీ టీచర్ పోస్టులకు ఇంటర్మీడియట్ (12వ తరగతి) ఉత్తీర్ణత తప్పనిసరి.
2. హెల్పర్ పోస్టులకు ప్రాధాన్యంగా ఇంటర్మీడియట్ అర్హత ఉండాలి.
3. ఇంటర్మీడియట్ అర్హత లేని అభ్యర్థులలో 10వ తరగతి ఉత్తీర్ణులైన వారికి నిబంధనల ప్రకారం అవకాశం కల్పించబడుతుంది.
వయోపరిమితి :
1. అభ్యర్థుల వయస్సు 18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.
2. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోసడలింపు వర్తించవచ్చు.
ఇతర అర్హతలు :
1. దివ్యాంగ అభ్యర్థులు సంబంధిత వికలాంగుల ధృవీకరణ పత్రం సమర్పించాలి.
2. దరఖాస్తు చేసే అభ్యర్థులు నోటిఫికేషన్లో పేర్కొన్న అన్ని అర్హతలు కలిగి ఉండాలి.
దరఖాస్తు విధానం :
అర్హత కలిగిన మహిళా అభ్యర్థులు తెలంగాణ మహిళా & శిశు సంక్షేమ శాఖ అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
అధికారిక వెబ్సైట్: https://mis.tgwdcw.in/
దరఖాస్తు చేసేముందు సంబంధిత జిల్లా నోటిఫికేషన్ను పూర్తిగా చదివి, అవసరమైన పత్రాలను సిద్ధం చేసుకుని దరఖాస్తు సమర్పించడం మంచిది.

దరఖాస్తు తేదీలు :
దరఖాస్తుల ప్రారంభ తేదీ: 09 జూలై 2026
దరఖాస్తు చివరి తేదీ: 20 జూలై 2026
అభ్యర్థులు నిర్ణీత గడువులోగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు సమర్పించాలి.
Notification Pdf Click Here
Vacancy & Roster Pdf Click Here
OFFICIAL WEBSITE CLICK HERE
APPLY ONLINE LINK CLICK HERE