AP Jobs

AP One Stop Centre Notification 2026: 10వ తరగతి అర్హతతో మల్టీ పర్పస్ స్టాఫ్ ఉద్యోగాలు.. మహిళలకు మంచి అవకాశం!

calendar_month July 14, 2026 person chitra

AP One Stop Centre Notification 2026: 10వ తరగతి అర్హతతో మల్టీ పర్పస్ స్టాఫ్ ఉద్యోగాలు.. మహిళలకు మంచి అవకాశం!

AP One Stop Centre Notification 2026:

ఆంధ్రప్రదేశ్ మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని వన్ స్టాప్ సెంటర్ (One Stop Centre – OSC) లో ఖాళీగా ఉన్న కేస్ వర్కర్ మరియు మల్టీ పర్పస్ స్టాఫ్/కుక్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నియామకాల కోసం మహిళా అభ్యర్థుల నుండి మాత్రమే దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. అర్హత కలిగిన మహిళలు జూలై 18, 2026 లోపు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు సమర్పించాలి.

పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :

సంస్థ పేరు : AP వన్ స్టాప్ సెంటర్ (One Stop Centre ) లో ఉద్యోగాలు

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

పోస్టుల వివరాలు :

కేస్ వర్కర్ – 01

మల్టీ పర్పస్ స్టాఫ్ / కుక్ – 02 పోస్టులు

మొత్తం పోస్టులు : 03

విద్య అర్హతలు :

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

కేస్ వర్కర్ :

1. మహిళా అభ్యర్థి అయి ఉండాలి.

2. గుంటూరు జిల్లా స్థానిక నివాసి కావాలి.

3. లా / సోషల్ వర్క్ / సోషియాలజీ / సోషల్ సైన్స్ / సైకాలజీలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి.

4. మహిళల సంక్షేమానికి సంబంధించిన ప్రభుత్వ లేదా ప్రభుత్వేతర సంస్థల్లో కనీసం 3 సంవత్సరాల పని అనుభవం ఉండాలి.

మల్టీ పర్పస్ స్టాఫ్ / కుక్ :

1. మహిళలకు ప్రాధాన్యత.

2. అక్షరాస్యత కలిగి ఉండాలి.

3. సంబంధిత రంగంలో పని చేసిన అనుభవం ఉంటే మంచిది.

4. 10వ తరగతి (హైస్కూల్) ఉత్తీర్ణులైన వారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.

నివాస అర్హత :

దరఖాస్తుదారులు గుంటూరు జిల్లా నివాసితులు అయి ఉండాలి. చెల్లుబాటు అయ్యే నివాస ధృవీకరణ పత్రాన్ని సమర్పించాలి.

వయోపరిమితి :

1. కనిష్ట వయస్సు: 18 సంవత్సరాలు, గరిష్ట వయస్సు: 42 సంవత్సరాలు ఉండాలి.

2. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ వర్గాలకు వయో సడలింపు వర్తిస్తుంది.

ఎంపిక విధానం :

అభ్యర్థుల ఎంపిక క్రింది అంశాల ఆధారంగా జరుగుతుంది.

1. విద్యార్హతలు

2. సంబంధిత పని అనుభవం

3. జిల్లా స్థాయి ఎంపిక కమిటీ నిర్వహించే ఇంటర్వ్యూ

దరఖాస్తు విధానం :

అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ( (దరఖాస్తు ఫారం https://guntur.ap.gov.in/ లో లభిస్తుంది) నుండి దరఖాస్తు ఫారాన్ని డౌన్‌లోడ్ చేసుకుని, పూర్తి వివరాలతో నింపి అవసరమైన పత్రాలను జత చేసి స్వయంగా లేదా రిజిస్టర్డ్ పోస్టు ద్వారా సమర్పించాలి.

సమర్పించవలసిన చిరునామా :

జిల్లా మహిళా మరియు శిశు అభివృద్ధి అధికారి కార్యాలయం,
స్వశక్తి భవనాలు, ఆర్ & బి గెస్ట్ హౌస్ ఎదురుగా,
కలెక్టర్ బంగ్లా రోడ్, గుంటూరు.

దరఖాస్తుతో జతచేయాల్సిన పత్రాలు :

1. 10వ తరగతి/జనన ధృవీకరణ పత్రం (వయస్సు రుజువు)

2. కుల ధృవీకరణ పత్రం

3. విద్యార్హత సర్టిఫికెట్లు మరియు మార్కుల మెమోలు

4. అనుభవ ధృవీకరణ పత్రాలు (ఉంటే)

5. ఆధార్ కార్డు లేదా ఓటర్ ఐడి

6. నివాస ధృవీకరణ పత్రం

7. రెండు తాజా పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు

ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తు ప్రారంభ తేదీ : 10 జూలై 2026

దరఖాస్తు చివరి తేదీ : 18 జూలై 2026

Notification Pdf  : Click Here

 

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe
Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *