SVIMS Recruitment 2026: TTD పరిధిలో జూనియర్ అసిస్టెంట్, క్యాషియర్, బిల్లింగ్ క్లర్క్ ఉద్యోగాలు – ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం!
SVIMS Recruitment 2026: TTD పరిధిలో జూనియర్ అసిస్టెంట్, క్యాషియర్, బిల్లింగ్ క్లర్క్ ఉద్యోగాలు – ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం!
SVIMS Recruitment 2026:
తిరుమల తిరుపతి దేవస్థానములు (TTD) పరిధిలోని శ్రీ వేంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (SVIMS), తిరుపతిలో పలు నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదలైంది.ఈ నియామక ప్రక్రియలో బ్యాక్లాగ్ కింద 10 పోస్టులు, రెగ్యులర్ కేటగిరీలో 20 పోస్టులు కలిపి మొత్తం 30 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హత మరియు ఆసక్తి ఉన్న అభ్యర్థులు 2026 జూలై 15 నుంచి ఆగస్టు 10 వరకు అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు సమర్పించవచ్చు.
పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :
సంస్థ పేరు : శ్రీ వేంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (SVIMS) లో ఉద్యోగాలు
పరిధి: తిరుమల తిరుపతి దేవస్థానములు (TTD)
ఉద్యోగ విధానం: డైరెక్ట్ రిక్రూట్మెంట్
దరఖాస్తు విధానం: ఆన్లైన్
పోస్టుల వివరాలు :
జూనియర్ అసిస్టెంట్ – 15
క్యాషియర్- 01
బిల్లింగ్ క్లర్క్ – 04
రిసెప్షనిస్ట్ – 06
స్టెనో కమ్ జూనియర్ అసిస్టెంట్ – 05
గ్యాస్ రూమ్ ఆపరేటర్ – 02
మొత్తం ఖాళీలు : 30

విద్యార్హతలు :
జూనియర్ అసిస్టెంట్ :
1. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్ డిగ్రీ.
2. కంప్యూటర్ అప్లికేషన్లపై పరిజ్ఞానం.
3. 3 సంవత్సరాల అనుభవం.
4. ఆఫీస్ ఆటోమేషన్ సర్టిఫికేట్ ఉంటే ప్రాధాన్యత.
క్యాషియర్ :
1. బ్యాచిలర్ డిగ్రీ.
2. కంప్యూటర్ పరిజ్ఞానం.
3. 3 సంవత్సరాల సంబంధిత అనుభవం.
బిల్లింగ్ క్లర్క్ :
1. బ్యాచిలర్ డిగ్రీ.
2. కంప్యూటర్ పరిజ్ఞానం.
3. 3 సంవత్సరాల అనుభవం.
రిసెప్షనిస్ట్ :
1. ఏదైనా డిగ్రీ.
2. పబ్లిక్ రిలేషన్స్‌లో పీజీ డిప్లొమా లేదా సమాన అర్హత.
3. కార్పొరేట్ ఆసుపత్రి/యూనివర్సిటీ/మెడికల్ కాలేజీ/ప్రభుత్వ రంగ సంస్థలో 2 సంవత్సరాల అనుభవం.
4. కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి.
స్టెనో కమ్ జూనియర్ అసిస్టెంట్ :
1. బ్యాచిలర్ డిగ్రీ.
2. టైప్‌రైటింగ్ (ఇంగ్లీష్ హయ్యర్ గ్రేడ్).
3. షార్ట్‌హ్యాండ్ (ఇంగ్లీష్ లోయర్ గ్రేడ్).
4. కంప్యూటర్ పరిజ్ఞానం.
5. 3 సంవత్సరాల అనుభవం.
6. ఆఫీస్ ఆటోమేషన్ సర్టిఫికేట్ ఉంటే అదనపు ప్రయోజనం.
గ్యాస్ రూమ్ ఆపరేటర్ :
1. SSC (10వ తరగతి) లేదా సమాన అర్హత.
2. సంబంధిత ట్రేడ్‌లో సర్టిఫికేట్.
3. 2 సంవత్సరాల అనుభవం.
4. గ్యాస్ భద్రత, ఫైర్ సేఫ్టీ, స్ప్రింక్లర్ సిస్టమ్, హైడ్రెంట్, ఎక్స్టింగ్విషర్ వంటి భద్రతా పరికరాల నిర్వహణలో శిక్షణ ఉండాలి.

వయోపరిమితి :
2026 జూలై 1 నాటికి అభ్యర్థుల వయస్సు కనీసం 18 సంవత్సరాలు పూర్తి చేసి ఉండాలి. అలాగే గరిష్ట వయస్సు 42 సంవత్సరాలకు మించరాదు.
వయో సడలింపు :
1. ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ (EWS) వర్గాలకు గరిష్ట వయోపరిమితిలో 5 సంవత్సరాల సడలింపు వర్తిస్తుంది.
2. PwBD అభ్యర్థులకు: 10 సంవత్సరాలు
దరఖాస్తు రుసుము :
1. OC / EWS అభ్యర్థులకు రూ.2,360/-
2. BC / SC / ST అభ్యర్థులకు రూ.1,770/- GST (18%)తో కలిపిన ఫీజు.
ఎంపిక విధానం :
అభ్యర్థుల ఎంపిక క్రింది విధంగా జరుగుతుంది.
రాత పరీక్ష – 75 మార్కులు
అనుభవం – 15 మార్కులు
ఇంటర్వ్యూ – 10 మార్కులు
ఎలా దరఖాస్తు చేయాలి?
అభ్యర్థులు SVIMS అధికారిక వెబ్‌సైట్‌లోని “Jobs” విభాగంలో అందుబాటులో ఉన్న ఆన్లైన్ అప్లికేషన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేయాలి.
1. అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
2. Jobs ట్యాబ్‌ను ఓపెన్ చేయండి.
3. సంబంధిత పోస్టును ఎంపిక చేసి రిజిస్ట్రేషన్ పూర్తి చేయండి.
4. అవసరమైన వివరాలు నమోదు చేసి పత్రాలను అప్లోడ్ చేయండి.
5. దరఖాస్తు ఫీజు చెల్లించండి.
6. చివరగా అప్లికేషన్‌ను సమర్పించి ప్రింట్ తీసుకుని భద్రపరచుకోండి.
ముఖ్యమైన తేదీలు :
ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభం: 15 జూలై 2026
దరఖాస్తు చివరి తేదీ: 10 ఆగస్టు 2026
Notification Pdf Click Here
Apply Link Click Here
Official Website Click Here