AP Jobs

SVIMS Recruitment 2026: TTD ఆధ్వర్యంలోని SVIMSలో 236 స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు.. ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం!

calendar_month July 17, 2026 person chitra

SVIMS Recruitment 2026: TTD ఆధ్వర్యంలోని SVIMSలో 236 స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు.. ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం!

SVIMS స్టాఫ్ నర్స్ రిక్రూట్మెంట్ 2026 వివరాలు :

SVIMS Staff Nurse Recruitment 2026: తిరుమల తిరుపతి దేవస్థానాలు (TTD) ఆధ్వర్యంలో పనిచేస్తున్న శ్రీ వెంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (SVIMS), తిరుపతిలో స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నియామకాలను ప్రత్యక్ష నియామక విధానంలో చేపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అర్హులైన అభ్యర్థులు 2026 ఆగస్టు 10 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :

సంస్థ పేరు : శ్రీ వెంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (SVIMS), తిరుపతి లో ఉద్యోగాలు

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

ఆధ్వర్యం: తిరుమల తిరుపతి దేవస్థానాలు (TTD)

పోస్ట్ పేరు: స్టాఫ్ నర్స్

పోస్టుల వివరాలు :

రెగ్యులర్ పోస్టులు – 212

బ్యాక్‌లాగ్ పోస్టులు – 24

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

మొత్తం ఖాళీలు: 236

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్

విద్యార్హతలు :

అభ్యర్థులు క్రింది అర్హతల్లో ఏదైనా ఒకటి కలిగి ఉండాలి.

ఎంపిక – 1 :

1. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి B.Sc Nursing ఉత్తీర్ణత.

2. ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ కౌన్సిల్లో తప్పనిసరిగా నమోదు అయి ఉండాలి.

లేదా

1. ఇంటర్మీడియట్ లేదా సమాన అర్హత ఉత్తీర్ణత.

2. నర్సింగ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన సంస్థలో 3 సంవత్సరాల General Nursing & Midwifery (GNM) కోర్సు మరియు 6 నెలల మిడ్‌వైఫరీ శిక్షణ పూర్తి చేసి ఉండాలి.

3. మెడికల్ కాలేజీ లేదా తృతీయ స్థాయి ఆసుపత్రిలో 3 సంవత్సరాల పని అనుభవం ఉండాలి.

4. ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ కౌన్సిల్‌లో నమోదు తప్పనిసరి.

అదనపు అర్హతలు :

1. BLS (Basic Life Support) మరియు ACLS (Advanced Cardiac Life Support) శిక్షణ సర్టిఫికెట్లు.

2. కంప్యూటర్ అప్లికేషన్లపై ప్రాథమిక పరిజ్ఞానం.

వయోపరిమితి : 

01-07-2026 నాటికి అభ్యర్థి కనీస వయస్సు: 18 సంవత్సరాలు , గరిష్ట వయస్సు: 42 సంవత్సరాలు ఉండాలి.

వయో సడలింపు :

1. SC / ST / BC / EWS వర్గాలకు చెందిన అభ్యర్థులకు: గరిష్ట వయోపరిమితిలో 5 సంవత్సరాల సడలింపు వర్తిస్తుంది.

2. PwBD అభ్యర్థులకు: 10 సంవత్సరాలు

దరఖాస్తు రుసుము :

1. OC / EWS: రూ.2,360/-

2. BC / SC / ST: రూ.1,770/-

3. PwBD: ఫీజు మినహాయింపు

గమనిక: పై ఫీజుల్లో 18% GST చేర్చబడింది. బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఛార్జీలు అదనంగా వర్తించవచ్చు.

జీతం వివరాలు :

ఎంపికైన అభ్యర్థులకు RPS-2022 ప్రకారం రూ.38,720 నుండి రూ.1,18,390 వరకు నెలవారీ వేతనం అందించబడుతుంది.

ఎంపిక విధానం :

అభ్యర్థుల ఎంపిక క్రింది ప్రమాణాల ఆధారంగా జరుగుతుంది.

రాత పరీక్ష – 75 మార్కులు

పని అనుభవం – 15 మార్కులు

ఇంటర్వ్యూ – 10 మార్కులు

ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

అర్హత కలిగిన అభ్యర్థులు 2026 జూలై 15 నుంచి ఆగస్టు 10 వరకు SVIMS అధికారిక వెబ్‌సైట్‌లోని ( https://svimstpt.ap.nic.in) “Jobs” విభాగం ద్వారా మాత్రమే ఆన్‌లైన్‌లో దరఖాస్తు సమర్పించాలి. దరఖాస్తులను 2026 ఆగస్టు 10 రాత్రి 11:59 గంటల వరకు మాత్రమే స్వీకరిస్తారు. నిర్దేశించిన చివరి తేదీ తర్వాత సమర్పించిన దరఖాస్తులు లేదా ఆఫ్‌లైన్‌తో పాటు ఇతర విధానాల ద్వారా పంపిన దరఖాస్తులను SVIMS అధికారులు పరిగణనలోకి తీసుకోరు. కాబట్టి అభ్యర్థులు చివరి తేదీ కోసం వేచి ఉండకుండా ముందుగానే దరఖాస్తు పూర్తి చేయడం మంచిది.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తుల ప్రారంభ తేదీ : 15 జులై 2026

దరఖాస్తుల చివరి తేదీ: 10 ఆగష్టు 2026

Notification Pdf Click Here

Apply Link Click Here

Official Website Click Here

 

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe
Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *