కైకలూరులో రేపు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాబ్‌మేళా.. 11 ప్రముఖ కంపెనీల్లో 554 ఉద్యోగాలు..!
కైకలూరులో రేపు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాబ్‌మేళా.. 11 ప్రముఖ కంపెనీల్లో 554 ఉద్యోగాలు..!
కైకలూరు జాబ్‌మేళా 2026 :
ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు మరో మంచి అవకాశం అందుబాటులోకి వచ్చింది. ఏలూరు జిల్లా కైకలూరులోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జూలై 22, 2026 (బుధవారం) మెగా జాబ్‌మేళా నిర్వహించనున్నారు. ఈ జాబ్‌మేళాలో 11 ప్రముఖ ప్రైవేట్ సంస్థలు పాల్గొని మొత్తం 554 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నాయి.
10వ తరగతి, ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీఈ/బీటెక్, ఫార్మసీ వంటి అర్హతలు కలిగిన అభ్యర్థులు తమ విద్యార్హతలకు అనుగుణంగా ఇంటర్వ్యూలకు హాజరుకావచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.10,000 నుంచి రూ.25,000 వరకు వేతనం అందించనున్నారు.
కంపెనీల వారీగా ఉద్యోగ వివరాలు :
| సంస్థ | పోస్టు | ఖాళీలు | అర్హత | వేతనం |
|---|---|---|---|---|
| అర్కాజెన్ రెన్యూవబుల్ ఎనర్జీ | ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ | 50 | ఇంటర్ & అంతకంటే ఎక్కువ | రూ.20,000 |
| డాన్‌ఫాస్ ఇండస్ట్రీస్ | ప్రొడక్షన్, క్వాలిటీ, అసెంబ్లీ, CNC/VMC ఆపరేటర్ | 50 | ITI, డిప్లొమా, BE, డిగ్రీ | రూ.19,000 |
| ఫ్లిప్‌కార్ట్ | డెలివరీ ఎగ్జిక్యూటివ్ | 10 | 10వ తరగతి & అంతకంటే ఎక్కువ | రూ.17,000 |
| ఫాక్స్‌కాన్ | అసెంబ్లింగ్ ఆపరేటర్, క్వాలిటీ | 100 | 10వ తరగతి, ఇంటర్, ITI, డిప్లొమా, డిగ్రీ | రూ.20,000 |
| గ్రోవెల్ ఫీడ్స్ | ఎలక్ట్రికల్ మేనేజర్, మెషిన్ మేనేజర్, రిసెప్షనిస్ట్ | 4 | సంబంధిత అర్హత | రూ.25,000 |
| మెడ్‌ప్లస్ ఫార్మసీ | ఫార్మాసిస్ట్, ఫార్మసీ ఎయిడ్, వేర్‌హౌస్ అసిస్టెంట్ | 100 | SSC నుంచి డిగ్రీ వరకు, D/B Pharmacy | రూ.20,000 |
| ఎమ్కే టెక్నాలజీస్ | మ్యానుఫాక్చరింగ్ | 10 | SSC, ITI, డిప్లొమా | రూ.15,000 |
| మోహన్ స్పిన్టెక్స్ | ట్రైనీ ఆపరేటర్ | 100 | 10వ తరగతి & అంతకంటే ఎక్కువ | రూ.10,000 |
| TVS ట్రైనింగ్ & సర్వీసెస్ | మ్యానుఫాక్చరింగ్ | 50 | ITI, డిప్లొమా | రూ.15,000 |
| వరుణ్ మోటార్స్ | సేల్స్ ఎగ్జిక్యూటివ్, టెక్నీషియన్స్ | 30 | ITI, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా | రూ.15,500 |
| విప్రో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంజనీరింగ్ | ప్రొడక్షన్, క్వాలిటీ, అసెంబ్లీ, CNC/VMC ఆపరేటర్ | 50 | ITI, డిప్లొమా, BE, డిగ్రీ | రూ.20,321 |
జాబ్‌మేళా ముఖ్యాంశాలు :
జాబ్‌మేళా తేదీ: 22 జూలై 2026
స్థలం: ప్రభుత్వ జూనియర్ కళాశాల, కైకలూరు, ఏలూరు జిల్లా
పాల్గొనే కంపెనీలు: 11
మొత్తం ఖాళీలు: 554
సంప్రదింపు నంబర్: 8919608183
వేతనం: రూ.10,000 నుంచి రూ.25,000 వరకు
వయోపరిమితి : అభ్యర్థుల వయస్సు 18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉండాలి.
అవసరమైన పత్రాలు :
జాబ్‌మేళాకు హాజరయ్యే అభ్యర్థులు కింది పత్రాలను వెంట తీసుకురావాలి.
1. విద్యార్హతల సర్టిఫికెట్లు
2. తాజా బయోడేటా (Resume)
3. ఆధార్ కార్డు
4. పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు