రేపు ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో మెగా జాబ్ మేళా.. 5 కంపెనీల్లో 953 ఉద్యోగాలు.. 10వ తరగతి నుంచి బీటెక్ వరకు అర్హత!
రేపు ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో మెగా జాబ్ మేళా.. 5 కంపెనీల్లో 953 ఉద్యోగాలు.. 10వ తరగతి నుంచి బీటెక్ వరకు అర్హత!
ఐటీఐ కళాశాలలో మెగా జాబ్ మేళా 2026 :
ప్రభుత్వ ఐటీఐ జాబ్ మేళా 2026 ద్వారా నిరుద్యోగ యువతకు మరో అద్భుతమైన ఉద్యోగ అవకాశం లభించింది. విశాఖపట్నంలోని కంచరపాలెంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో జూలై 24న నిర్వహించే ఈ మెగా జాబ్ మేళాలో 5 ప్రముఖ కంపెనీలు పాల్గొని మొత్తం 953 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నాయి. 10వ తరగతి, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.
విశాఖపట్నంలోని నర్వా కంచరపాలెం, పాత ఐటీఐ పక్కన ఉన్న ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఈ మెగా ఉద్యోగ మేళా నిర్వహించబడుతుంది. అభ్యర్థులు తమ అప్డేట్ చేసిన రెజ్యూమ్, విద్యార్హత సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలు, ఆధార్ కార్డు మరియు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు వెంట తీసుకురావాలని నిర్వాహకులు సూచించారు.
జాబ్ మేళా లో పాల్గొనే కంపెనీ లు , అర్హతలు, జీతం వివరాలు :
ఈ జాబ్ మేళాలో ప్రముఖ సంస్థలు పాల్గొని వివిధ విభాగాల్లో ఉద్యోగాలను భర్తీ చేయనున్నాయి.
| కంపెనీ | ఉద్యోగ హోదా | ఖాళీలు | అర్హత | వయస్సు | వేతనం |
|---|---|---|---|---|---|
| IFB Industries Ltd | Service Ambassadors – Technical | 50 | ITI / సంబంధిత అర్హత | 18–35 సంవత్సరాలు | రూ.10,000+ |
| Innov Source (SBI Cards) | Managers, Sales Managers, Store Sales Persons | 108 | Any Degree | 18–30 సంవత్సరాలు | రూ.15,000+ |
| NYFC (Big Basket, Zepto, Swiggy Instamart) | Pickers & Packers, Operations Support | 500 | 10వ తరగతి ఉత్తీర్ణత | 18–30 సంవత్సరాలు | రూ.18,000 |
| Sahuwala Cylinders Pvt Ltd (HP Division) | Machine Operators, Quality Inspectors, NDT Level-2 | 95 | SSC / ITI / Diploma / Degree / B.Tech | 19–30 సంవత్సరాలు | రూ.18,000+ |
| South-Pazzo Services Pvt Ltd | Electronics & Manufacturing | 200 | SSC / ITI / Diploma / Degree / B.Tech | 18–30 సంవత్సరాలు | రూ.19,000 వరకు |
జాబ్ మేళా ముఖ్య వివరాలు :
తేదీ: 24 జూలై 2026
సమయం: నిర్వాహకులు సూచించిన సమయానికి హాజరుకావాలి
వేదిక: ప్రభుత్వ ఐటీఐ కళాశాల, కంచరపాలెం, విశాఖపట్నం
పాల్గొనే కంపెనీలు: 5
మొత్తం ఉద్యోగాలు: 953
జాబ్ మేళాకు తీసుకెళ్లాల్సిన పత్రాలు :
1. అప్డేట్ చేసిన Resume
2. విద్యార్హత సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలు
3. ఆధార్ కార్డు
4. పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు
5. ఒరిజినల్ సర్టిఫికెట్లు (ధృవీకరణ కోసం)