Results

AP TET Hall Tickets 2026 విడుదల.. డైరెక్ట్ డౌన్‌లోడ్ లింక్ ఇదే..!

calendar_month July 25, 2026 person chitra

AP TET Hall Tickets 2026 విడుదల.. డైరెక్ట్ డౌన్‌లోడ్ లింక్ ఇదే..!

AP TET Hall Tickets 2026:

ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (AP TET 2026)కు హాజరయ్యే అభ్యర్థులకు కీలక అప్డేట్ వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం AP TET Hall Tickets 2026ను జూలై 27 నుంచి అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు తమ యూజర్ నేమ్, పాస్‌వర్డ్ సహాయంతో హాల్ టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఈసారి నిర్వహిస్తున్న AP TET పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 2,37,165 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. పరీక్షా కేంద్రానికి కనీసం ఒక గంట ముందుగానే చేరుకోవాలని పరీక్ష నిర్వహణ కమిటీ సూచించింది.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

AP TET 2026 పరీక్షల షెడ్యూల్ :

AP TET 2026 పరీక్షలు ఆగస్టు 5 నుంచి ఆగస్టు 21 వరకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) విధానంలో నిర్వహించబడనున్నాయి. ప్రతిరోజూ రెండు సెషన్లలో పరీక్షలు జరుగుతాయి.

మొదటి సెషన్ :

ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:00 గంటల వరకు

రెండో సెషన్ :

మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

పరీక్ష సమయానికి ముందుగానే కేంద్రానికి చేరుకుని హాల్ టికెట్‌తో పాటు చెల్లుబాటు అయ్యే ఫోటో ఐడీని తీసుకెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు.

హాల్ టికెట్‌ను ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి:

హాల్ టికెట్‌ను ఈ క్రింది విధంగా సులభంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

1. ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://tet2dsc.apcfss.in/ ను ఓపెన్ చేయండి.

2. హోమ్‌పేజీలో కనిపించే Candidate Login పై క్లిక్ చేయండి.

3. మీ User Name, Password, Captcha వివరాలను నమోదు చేసి Sign In చేయండి.

4. లాగిన్ అయిన తర్వాత ఎడమవైపు కనిపించే AP TET Hall Tickets 2026 ఆప్షన్‌పై క్లిక్ చేయండి.

5. మీ హాల్ టికెట్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.

6. హాల్ టికెట్‌ను డౌన్‌లోడ్ చేసి ప్రింట్ తీసుకుని పరీక్ష రోజున తప్పనిసరిగా వెంట తీసుకెళ్లండి.

పరీక్షకు వెళ్లే ముందు గుర్తుంచుకోవాల్సిన విషయాలు :

1. హాల్ టికెట్ లేకుండా పరీక్ష కేంద్రంలోకి అనుమతి ఉండదు.

2. హాల్ టికెట్‌పై ఉన్న వివరాలను ముందుగానే ఒకసారి పరిశీలించండి.

3. పరీక్ష ప్రారంభానికి కనీసం 60 నిమిషాల ముందే కేంద్రానికి చేరుకోవాలి.

4. హాల్ టికెట్‌తో పాటు చెల్లుబాటు అయ్యే ఏదైనా ఫోటో గుర్తింపు కార్డును పరీక్ష కేంద్రానికి తప్పనిసరిగా తీసుకెళ్లాలి.

5. పరీక్షా కేంద్రంలో అధికారులు సూచించే నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి.

AP TET పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు చివరి నిమిషంలో ఇబ్బందులు తలెత్తకుండా హాల్ టికెట్‌ను ముందుగానే డౌన్‌లోడ్ చేసి ప్రింట్ తీసుకోవడం మంచిది.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe
Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *