ఏపీ హైకోర్టులో లా క్లర్క్ ఉద్యోగాలు 2026 – రాత పరీక్ష లేకుండా అవకాశం | AP High Court Law Clerk Notification 2026 :
ఏపీ హైకోర్టులో లా క్లర్క్ ఉద్యోగాలు 2026 – రాత పరీక్ష లేకుండా అవకాశం | AP High Court Law Clerk Notification 2026 :
AP High Court Jobs Notification 2026:
AP High Court Jobs 2026 నోటిఫికేషన్‌ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విడుదల చేసింది. లా క్లర్క్ పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఎంపికైన వారికి నెలకు రూ.35,000 వరకు వేతనం అందించబడుతుంది.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు (AP High Court) లా క్లర్క్ (Law Clerk) పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. న్యాయ విద్య పూర్తి చేసిన అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. ఎంపికైన వారికి నెలకు రూ.35,000 వరకు వేతనం అందించబడుతుంది. ఉద్యోగ స్థానం అమరావతి, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులు నోటిఫికేషన్‌ను పూర్తిగా పరిశీలించి నిర్ణీత గడువులోగా దరఖాస్తు సమర్పించాలి. ఈ నియామకాలకు ముందస్తు అనుభవం అవసరం లేదు.
పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :
సంస్థ పేరు : ఆంధ్రప్రదేశ్ హైకోర్టు (AP High Court) లో ఉద్యోగాలు
పోస్టు పేరు: లా క్లర్క్ (Law Clerk)
మొత్తం పోస్టులు: 04
ఉద్యోగ స్థలం: అమరావతి, ఆంధ్రప్రదేశ్
విద్యార్హతలు :
1. ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలంటే అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి క్రింది అర్హతల్లో ఏదో ఒకటి పూర్తి చేసి ఉండాలి.
2. 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ లా కోర్స్ (LL.B.)
లేదా
3 సంవత్సరాల లా డిగ్రీ (LL.B.)
3. అనుభవం అవసరం లేదు. కొత్తగా లా పూర్తి చేసిన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
వయోపరిమితి :
1. దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల కనీస వయస్సు 18 సంవత్సరాలు, గరిష్ట వయస్సు 42 సంవత్సరాలు ఉండాలి.
2. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
ఎంపిక విధానం :
ఈ నియామకాల్లో రాత పరీక్ష నిర్వహించరు. అర్హత కలిగిన అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు.
1. రాత పరీక్ష లేదు
2. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక
3. కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియామకం
దరఖాస్తు విధానం :
దరఖాస్తు పంపాల్సిన చిరునామా: అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అధికారిక వెబ్సైట్ నుంచి అప్లికేషన్ ఫారమ్‌ను డౌన్లోడ్ చేసుకుని, పూర్తిగా నింపిన అనంతరం అవసరమైన పత్రాలను జతచేసి Registrar General, High Court of Andhra Pradesh, Nelapadu, Amaravati, Guntur District – 522239 చిరునామాకు స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా నిర్ణీత గడువులోపు పంపించాలి. దరఖాస్తు విధానం మరియు ఇతర పూర్తి వివరాల కోసం అధికారిక AP High Court వెబ్‌సైట్‌ను సందర్శించండి. చిరునామా వివరాలు అప్లికేషన్ ఫారం లో ఇవ్వడం జరిగింది.
గమనిక: పోస్టల్ చిరునామా మరియు ఇతర సూచనలు అధికారిక అప్లికేషన్ ఫారమ్‌లో ఇవ్వబడతాయి. దరఖాస్తు పంపే ముందు నోటిఫికేషన్‌ను పూర్తిగా చదవడం మంచిది.
Notification & Application Pdf : Click Here
Official Website : Click Here