ఎన్టీఆర్ భరోసా పెన్షన్ దరఖాస్తు స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి.. పరిశీలనకు మార్గదర్శకాలు విడుదల..!
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ దరఖాస్తు స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి.. పరిశీలనకు మార్గదర్శకాలు విడుదల..!
NTR Bharosa Pension your application status :
ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు తదితర అర్హుల నుంచి స్వీకరించిన దరఖాస్తులను పరిశీలించేందుకు మార్గదర్శకాలు విడుదలయ్యాయి. దరఖాస్తుదారులు తమ అప్లికేషన్ స్టేటస్‌ను ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు.
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ దరఖాస్తుల స్వీకరణ :
కొత్తగా పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకునే అర్హుల వివరాలను గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా నమోదు చేస్తున్నారు. కార్యాలయాలకు రాలేని వృద్ధులు, దివ్యాంగుల వద్దకు వెళ్లి వివరాలు సేకరించి ఆన్లైన్లో నమోదు చేయాలని సంబంధిత సిబ్బందికి అధికారులు సూచనలు ఇచ్చారు.
కొత్త పెన్షన్ కోసం దరఖాస్తుల స్వీకరణకు సెప్టెంబర్ 16 వరకు అవకాశం ఉంది. దరఖాస్తుల పరిశీలన పూర్తయిన తర్వాత అర్హత ఉన్న వారికి పెన్షన్ మంజూరు చేస్తారు.
పెన్షన్ అర్హతలను ఎలా పరిశీలిస్తారు?
దరఖాస్తు ఆన్లైన్లో నమోదు చేసిన తర్వాత గ్రామ/వార్డు సచివాలయ స్థాయిలో సంబంధిత అధికారులు దరఖాస్తులను పరిశీలిస్తారు. అనంతరం అవసరమైన స్థాయిలో వెరిఫికేషన్ పూర్తి చేసి అర్హత ఉన్న వారికి పెన్షన్ మంజూరు చేస్తారు.
పరిశీలనలో ముఖ్యంగా ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు:
1. కుటుంబానికి సంబంధించిన ఆదాయ వివరాలు
2.కుటుంబ సభ్యుల భూమి వివరాలు
3. కుటుంబంలో ఉన్న వాహనాల వివరాలు
4. గత 12 నెలల విద్యుత్ వినియోగ వివరాలు
5. కుటుంబ సభ్యులు ఇతర సామాజిక భద్రత పెన్షన్లు పొందుతున్నారా?
6. ఆదాయపు పన్ను చెల్లిస్తున్నారా?
7. EPFO లేదా ఇతర ప్రభుత్వ ప్రయోజనాలు పొందుతున్నారా?
8. ఇతర అర్హత ప్రమాణాలు పాటిస్తున్నారా?
గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబ నెలవారీ ఆదాయం రూ.10,000లోపు, పట్టణ ప్రాంతాల్లో రూ.12,000లోపు ఉండే అర్హత నిబంధనలు వర్తిస్తాయని అధికారులు పేర్కొన్నారు.
వివిధ పెన్షన్లకు అవసరమైన ధ్రువపత్రాలు :
దరఖాస్తు చేసిన పెన్షన్ రకాన్ని బట్టి సంబంధిత ధ్రువపత్రాలను కూడా అధికారులు పరిశీలిస్తారు.
వితంతు పెన్షన్: భర్త మరణ ధ్రువీకరణ పత్రం పరిశీలిస్తారు.
దివ్యాంగుల పెన్షన్: సదరం సర్టిఫికెట్‌ను పరిశీలిస్తారు.
ఒంటరి మహిళ పెన్షన్: భర్త నుంచి విడిపోయినట్లు సంబంధిత ఆధారాలను పరిశీలిస్తారు. వివాహం కాని మహిళలకు తహసీల్దార్ జారీ చేసిన ధ్రువీకరణ పత్రాన్ని పరిశీలించే అవకాశం ఉంటుంది.
ట్రాన్స్‌జెండర్ పెన్షన్: సంబంధిత వైద్య/అధికారిక ధ్రువీకరణ పత్రాలను పరిశీలిస్తారు.
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అప్లికేషన్ స్టేటస్ ఎలా చెక్ చేయాలి?
పెన్షన్ కోసం ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ అప్లికేషన్ ప్రస్తుత స్థితిని ఆన్లైన్లో తెలుసుకోవచ్చు.
1. అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేయండి
ముందుగా AP Seva అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయాలి.
Website: https://apseva.ap.gov.in/
2. అప్లికేషన్ నంబర్ తీసుకోండి
పెన్షన్ కోసం దరఖాస్తు చేసిన సమయంలో మీ మొబైల్ నంబర్‌కు వచ్చిన SMSను చెక్ చేయండి. అందులో మీ దరఖాస్తుకు సంబంధించిన Application Number ఉంటుంది.
3. Service Request Status ఎంపికపై క్లిక్ చేయండి
AP Seva వెబ్సైట్ హోమ్‌పేజీలో కనిపించే “Service Request Status” ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
4. Application Number నమోదు చేయండి
అక్కడ మీకు వచ్చిన Application Numberను నమోదు చేసి Search చేయాలి.
5. అప్లికేషన్ స్టేటస్ చూడండి
Search చేసిన వెంటనే మీ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ దరఖాస్తు ప్రస్తుత Application Status స్క్రీన్‌పై కనిపిస్తుంది.
NTR Bharosa Pension your application status at this link Click Here