Central Govt Jobs

10th పాస్‌తో ప్రభుత్వ స్కూల్లో ఉద్యోగాలు.. సైనిక్ స్కూల్‌లో 17 పోస్టులు…Sainik School PGT, TGT, Craft Instructor, Nursing Assistant & MTS Regular basisRecruitment 2026 Apply Now:

calendar_month September 11, 2026 person chitra

10th పాస్‌తో ప్రభుత్వ స్కూల్లో ఉద్యోగాలు.. సైనిక్ స్కూల్‌లో 17 పోస్టులు…Sainik School PGT, TGT, Craft Instructor, Nursing Assistant & MTS Regular basis Recruitment 2026 Apply Now:

Sainik School Recruitment 2026:

10వ తరగతి, ఇంటర్, డిప్లొమా అర్హతతో ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని సైనిక్ స్కూల్ బీజాపూర్ వివిధ పోస్టుల భర్తీకి ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది. ఈ నియామకంలో PGT, TGT, Craft Instructor, Nursing Assistant, General Employee (MTS) పోస్టులు ఉన్నాయి.

ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 17 ఖాళీలను భర్తీ చేయనున్నారు. పోస్టును బట్టి విద్యార్హతలు మారుతాయి. అర్హత కలిగిన అభ్యర్థులు నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. ఎంపిక ప్రక్రియలో రాత పరీక్ష, ప్రాక్టికల్ పరీక్ష, ఇంటర్వ్యూ ఉండవచ్చు. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :

సంస్థ పేరు : సైనిక్ స్కూల్ బీజాపూర్, రక్షణ మంత్రిత్వ శాఖ లో ఉద్యోగాలు

పోస్టుల పేర్లు: PGT, TGT, Craft Instructor, Nursing Assistant, General Employee (MTS) పోస్టులు

మొత్తం ఖాళీలు: 17

నియామక విధానం: రెగ్యులర్/పర్మనెంట్ ప్రాతిపదికన

విద్యార్హతలు :

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

పోస్టును బట్టి విద్యార్హతలు మారుతాయి. సంబంధిత గుర్తింపు పొందిన బోర్డు, యూనివర్సిటీ లేదా సంస్థ నుంచి అర్హత సాధించి ఉండాలి.

General Employee (MTS) :

MTS పోస్టులకు సాధారణంగా 10వ తరగతి ఉత్తీర్ణత అర్హతగా పేర్కొన్నారు. బేకరీ, ప్లంబింగ్, కార్పెంటరీ, గుర్రాల సంరక్షణ, హౌస్ కీపింగ్, కార్యాలయ పరికరాల నిర్వహణ వంటి విభిన్న పనుల్లో పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యత ఉండవచ్చు.

బోర్డింగ్ స్కూల్‌లో పని చేసిన అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వవచ్చు. అలాగే కన్నడ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో పరిజ్ఞానం ఉండాలి. అభ్యర్థులు శారీరకంగా దృఢంగా ఉండాలి.

Nursing Assistant :

Nursing Assistant పోస్టుకు గుర్తింపు పొందిన సంస్థ నుంచి జనరల్ నర్సింగ్‌లో మూడేళ్ల డిప్లొమా లేదా B.Sc Nursing వంటి అర్హతలు అవసరమవుతాయి. సంబంధిత అనుభవం ఉన్న అభ్యర్థులకు నోటిఫికేషన్ నిబంధనల ప్రకారం అర్హత ఉంటుంది.

PGT / TGT :

PGT, TGT పోస్టులకు సంబంధిత సబ్జెక్టులో నిర్దేశిత విద్యార్హతలు కలిగి ఉండాలి. అభ్యర్థులకు బోధనా సామర్థ్యంతో పాటు హిందీ, ఇంగ్లీష్ భాషల్లో బోధించగల సామర్థ్యం ఉండాలి. కంప్యూటర్ అప్లికేషన్లపై ప్రాథమిక పరిజ్ఞానం కూడా అవసరం కావచ్చు.

వయోపరిమితి : 

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 18 నుంచి 50 సంవత్సరాల మధ్య ఉండాలి. వయస్సును 01 అక్టోబర్ 26 నాటికి కట్‌ఆఫ్ తేదీ ఆధారంగా లెక్కిస్తారు.

రిజర్వేషన్ కేటగిరీలకు చెందిన అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తించే అవకాశం ఉంటుంది.

దరఖాస్తు రుసుము :

1. అభ్యర్థులు రూ.500/- దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

2. రిజర్వేషన్‌కు అర్హులైన మహిళా అభ్యర్థులు, SC, ST, PwBD, ESM కేటగిరీలకు చెందిన అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.

జీతం వివరాలు :

పోస్టును బట్టి నెలవారీ జీతం/పే లెవల్ ఉంటుంది.

PGT & TGT: రూ.44,900 – రూ.1,42,400/-

Craft Instructor: రూ.29,200 – రూ.92,300/-

Nursing Assistant: రూ.25,500 – రూ.81,100/-

General Employee (MTS): రూ.18,000 – రూ.56,900/-

ఎంపిక విధానం :

అభ్యర్థుల ఎంపిక పోస్టును బట్టి కింది దశల ద్వారా జరుగుతుంది:

1. రాత పరీక్ష

2. ప్రాక్టికల్/స్కిల్ టెస్ట్

3. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.

ఎలా దరఖాస్తు చేయాలి?

సైనిక్ స్కూల్ బీజాపూర్ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న నోటిఫికేషన్/దరఖాస్తు ఫారాన్ని డౌన్‌లోడ్ చేసుకోవాలి.

1. ముందుగా అధికారిక నోటిఫికేషన్‌ను పూర్తిగా చదవాలి.

2. దరఖాస్తు ఫారాన్ని డౌన్‌లోడ్ చేసుకోవాలి.

3. అవసరమైన వివరాలను తప్పులు లేకుండా నమోదు చేయాలి.

4. విద్యార్హత, వయస్సు, అనుభవం తదితర ధ్రువపత్రాల ప్రతులను జత చేయాలి.

5. నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా ఫీజు చెల్లించాలి.

6. అవసరమైన పోస్టేజ్ స్టాంపుతో స్వీయ చిరునామా ఉన్న కవరును సిద్ధం చేయాలి.

7. పూర్తి చేసిన దరఖాస్తును నిర్ణీత చిరునామాకు పోస్టు ద్వారా పంపాలి.

దరఖాస్తు పంపాల్సిన చిరునామా:

The Principal,
Sainik School Bijapur,
Athani Road, District Vijayapura,
Karnataka – 586108.

ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తు ప్రారంభ తేదీ : 07 సెప్టెంబర్ 2026

దరఖాస్తు చివరి తేదీ : 28 అక్టోబర్ 2026

Full Notification  Pdf Click Here

Application Pdf Click Here

Official Website Click Here

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe
Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *