SSC CPO 2026 Notification: 1871 సబ్ ఇన్‌స్పెక్టర్ ఉద్యోగాలకు దరఖాస్తులు ప్రారంభం!
SSC CPO 2026 Notification: 1871 సబ్ ఇన్‌స్పెక్టర్ ఉద్యోగాలకు దరఖాస్తులు ప్రారంభం!
SSC CPO 2026 Notification:
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) నుంచి ఢిల్లీ పోలీస్, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్‌లో సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టుల భర్తీకి SSC CPO 2026 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నియామకానికి సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 10, 2026 నుంచి ప్రారంభమైంది. అర్హత ఉన్న అభ్యర్థులు సెప్టెంబర్ 30, 2026 రాత్రి 11 గంటల వరకు అధికారిక SSC వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 1,871 సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత పోస్టులకు అవసరమైన విద్యార్హత, వయసు, జీతం, ఎంపిక విధానం తదితర వివరాలు తెలుసుకొని అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పడు చూద్దాం.
పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :
సంస్థ పేరు : స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) లో ఉద్యోగాలు
పోస్టుల వివరాలు :
ఢిల్లీ పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్: 315 పోస్టులు
CAPF సబ్ ఇన్‌స్పెక్టర్ (GD): 1,467 పోస్టులు
CISF సబ్ ఇన్‌స్పెక్టర్ (ఫైర్): 234 పోస్టులు
మొత్తం పోస్టులు : 1871
అప్లికేషన్ విధానం : ఆన్లైన్ లో
విద్య అర్హతలు :
ఢిల్లీ పోలీస్‌లో సబ్ ఇన్‌స్పెక్టర్, CAPFలో సబ్ ఇన్‌స్పెక్టర్ (GD) పోస్టులకు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్ డిగ్రీ లేదా సమానమైన విద్యార్హత కలిగి ఉండాలి.
బ్యాచిలర్ డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు కూడా నోటిఫికేషన్‌లో పేర్కొన్న నిబంధనలకు అనుగుణంగా దరఖాస్తు చేసుకోవచ్చు.
CISF సబ్ ఇన్‌స్పెక్టర్ (ఫైర్) పోస్టుకు :
ఈ పోస్టుకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ సబ్జెక్టులతో సైన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ లేదా సమానమైన అర్హత ఉండాలి.
అదనంగా, సంబంధిత ఇంజినీరింగ్ విభాగాల్లో మూడేళ్ల డిప్లొమా అర్హత ఉన్న అభ్యర్థులకు కూడా నోటిఫికేషన్ నిబంధనల ప్రకారం అవకాశం ఉంటుంది.
వయోపరిమితి :
SSC CPO 2026 పోస్టులకు వయోపరిమితి పోస్టును బట్టి ఉంటుంది. CISF సబ్ ఇన్‌స్పెక్టర్ (ఫైర్) పోస్టులకు 01 ఆగస్టు 2026 నాటికి 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి.
ఇతర పోస్టులకు నోటిఫికేషన్‌లో పేర్కొన్న వయోపరిమితి వర్తిస్తుంది. రిజర్వేషన్ కేటగిరీలకు చెందిన అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్ణీత వయో సడలింపు వర్తిస్తుంది.
దరఖాస్తు రుసుము :
SSC CPO 2026 దరఖాస్తుకు సాధారణంగా రూ.100/- ఫీజు చెల్లించాలి.
మహిళా అభ్యర్థులు, SC, ST మరియు నోటిఫికేషన్‌లో పేర్కొన్న అర్హత కలిగిన మాజీ సైనిక అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.
జీతం వివరాలు :
ఎంపికైన అభ్యర్థులకు లెవెల్-6 పే స్కేల్ ప్రకారం నెలకు రూ.35,400/- నుంచి రూ.1,12,400 /-వరకు జీతం లభిస్తుంది.
ఢిల్లీ పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్, CAPF సబ్ ఇన్‌స్పెక్టర్ (GD), CISF సబ్ ఇన్‌స్పెక్టర్ (ఫైర్) పోస్టులకు వర్తించే పే స్కేల్ నోటిఫికేషన్‌లో పేర్కొన్న విధంగా ఉంటుంది. వీటికి అదనంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇతర అలవెన్సులు కూడా లభిస్తాయి.
ఎంపిక విధానం :
SSC CPO ఉద్యోగాలకు అభ్యర్థుల ఎంపిక పలు దశల్లో జరుగుతుంది. అవి:
1. పేపర్-I కంప్యూటర్ ఆధారిత పరీక్ష
2. Physical Standard Test (PST) / Physical Endurance Test (PET)
3. పేపర్-II పరీక్ష
4. Detailed Medical Examination (DME)
5. పేపర్-Iలో అర్హత సాధించిన అభ్యర్థులను తదుపరి దశలకు ఎంపిక చేస్తారు.
ఎలా దరఖాస్తు చేయాలి?
SSC CPO 2026కి దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు ముందుగా SSC అధికారిక వెబ్‌సైట్‌లో One-Time Registration (OTR) పూర్తి చేయాలి.
దరఖాస్తు ప్రక్రియ:
1. SSC అధికారిక వెబ్‌సైట్( https://ssc.gov.in/ )ను ఓపెన్ చేయాలి.
2. కొత్తగా OTR నమోదు చేసుకోవాలి.
3. మీ లాగిన్ వివరాలతో సైన్ ఇన్ అవ్వాలి.
4. SSC CPO 2026 అప్లికేషన్‌ను ఎంచుకోవాలి.
5. వ్యక్తిగత, విద్యార్హత వివరాలను నమోదు చేయాలి.
6. అవసరమైన పత్రాలను సమర్పించాలి.
7. వర్తించే దరఖాస్తు ఫీజు చెల్లించాలి.
8. అప్లికేషన్‌ను చివరిగా సబ్మిట్ చేసి, భవిష్యత్ అవసరాల కోసం కాపీని సేవ్ చేసుకోవాలి.
ముఖ్యమైన తేదీలు :
ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ : 10 సెప్టెంబర్ 2026
దరఖాస్తుకు చివరి తేదీ : 30 సెప్టెంబర్ 2026
Notification Pdf : Click Here
Apply Online Link : Click Here