Scholarship Information

ఏపీ విద్యార్థులకు ఏడాదికి ₹12,000 స్కాలర్‌షిప్.. NMMS 2026-27 నోటిఫికేషన్ విడుదల..! NMMS Scholarship 2026- 27 Apply Now : 

calendar_month September 12, 2026 person chitra

ఏపీ విద్యార్థులకు ఏడాదికి ₹12,000 స్కాలర్‌షిప్.. NMMS 2026-27 నోటిఫికేషన్ విడుదల..! NMMS Scholarship 2026- 27 Apply Now :

Andhra Pradesh NMMS Scholarship 2026-27 :

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. National Means-cum-Merit Scholarship (NMMS) 2026-27 పరీక్షకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ స్కాలర్‌షిప్‌కు ఎంపికైన విద్యార్థులకు ప్రతి సంవత్సరం రూ.12,000 చొప్పున ఆర్థిక సహాయం అందుతుంది.

NMMS స్కాలర్‌షిప్‌ ద్వారా 9వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యార్థులకు ప్రతి విద్యా సంవత్సరానికి రూ.12,000 చొప్పున స్కాలర్‌షిప్‌ అందించే అవకాశం ఉంటుంది. అర్హత ఉన్న 8వ తరగతి విద్యార్థులు నిర్ణీత గడువులోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

NMMS పరీక్ష ఎప్పుడు నిర్వహిస్తారు?

2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన NMMS రాష్ట్రస్థాయి పరీక్షను 2026 నవంబర్ 15న (ఆదివారం) నిర్వహించనున్నారు.

పరీక్ష ఉదయం 10:00 గంటల నుంచి మధ్యాహ్నం 1:00 గంటల వరకు జరుగుతుంది. తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ మాధ్యమాల్లో పరీక్ష నిర్వహిస్తారు.

ఆంధ్రప్రదేశ్‌లోని 28 జిల్లాల రెవెన్యూ డివిజనల్ ప్రధాన కార్యాలయాల్లో పరీక్ష నిర్వహించనున్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.

అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ bse.ap.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

NMMS 2026-27 అర్హతలు :

NMMS పరీక్షకు దరఖాస్తు చేసుకునే విద్యార్థులు కింది అర్హతలు కలిగి ఉండాలి.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

1. 2025-26 విద్యా సంవత్సరంలో 7వ తరగతి చదివి ఉండాలి.

2. OC/BC విద్యార్థులు 7వ తరగతిలో కనీసం 55% మార్కులు సాధించి ఉండాలి.

3. SC/ST విద్యార్థులు కనీసం 50% మార్కులు సాధించి ఉండాలి.

4.. లేదా అన్ని కేటగిరీల విద్యార్థులు B+ లేదా సమానమైన గ్రేడ్ సాధించి ఉండాలి.

5. ప్రస్తుతం 2026-27 విద్యా సంవత్సరంలో 8వ తరగతి చదువుతూ ఉండాలి.

6. ప్రభుత్వ పాఠశాలలు, స్థానిక సంస్థల పాఠశాలలు, ప్రభుత్వ సహాయక పాఠశాలలు, ఏపీ మోడల్ స్కూళ్లు (డే స్కాలర్లు మాత్రమే), 8వ

7. తరగతి నిర్వహిస్తున్న ఎంపీయూపీ పాఠశాలల్లో చదివే విద్యార్థులు అర్హులు.

8. తల్లిదండ్రులిద్దరి అన్ని వనరుల నుంచి కలిపిన వార్షిక ఆదాయం రూ.3.50 లక్షల కంటే తక్కువగా ఉండాలి.

అవసరమైన ధ్రువపత్రాలు :

అర్హత కలిగిన విద్యార్థులు దరఖాస్తు ప్రక్రియలో సంబంధిత ధ్రువపత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలి.

ఆదాయ ధ్రువీకరణ పత్రం

కుల ధ్రువీకరణ పత్రం

7వ తరగతి మార్కుల వివరాలు

పాఠశాలకు సంబంధించిన వివరాలు

ఆదాయ ధ్రువీకరణ పత్రాన్ని MRO జారీ చేసిన తాజా ఒరిజినల్ లేదా ధృవీకరించిన కాపీగా సమర్పించాలి.

SC విద్యార్థులు తమ గ్రూప్ వివరాలతో కూడిన కుల ధ్రువీకరణ పత్రాన్ని, అంటే SC Group-1 / SC Group-2 / SC Group-3 వివరాలతో కూడిన సర్టిఫికెట్‌ను సమర్పించాల్సి ఉంటుంది.

NMMS పరీక్ష ఫీజు :

కేటగిరీ ప్రకారం పరీక్ష ఫీజు ఇలా ఉంటుంది:

OC/BC విద్యార్థులు: రూ.100/-
SC/ST విద్యార్థులు: రూ.50/-

పరీక్ష ఫీజును SBI Collect ద్వారా మాత్రమే చెల్లించాలి. ఫీజు చెల్లింపు కోసం bse.ap.gov.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న యూజర్ గైడ్‌ను అనుసరించాలి.

డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా చెల్లింపులను స్వీకరించరు.

NMMS పరీక్ష తేదీ : 

పరీక్ష తేదీ: 15 నవంబర్ 2026

పరీక్షలో 7వ తరగతి (2025-26 విద్యా సంవత్సరం) మరియు 8వ తరగతి (2026-27 విద్యా సంవత్సరం అక్టోబర్ వరకు) సంబంధిత సిలబస్ నుంచి ప్రశ్నలు ఉంటాయి.

NMMS 2026-27 ముఖ్యమైన తేదీలు :

ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు ప్రారంభం : 11-09-2026

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ  : 12-10-2026

పరీక్ష ఫీజు చెల్లింపుకు చివరి తేదీ  : 13-10-2026

నామినల్ రోల్స్/వివరాల సమర్పణ  : 14-10-2026 వరకు

NMMS పరీక్ష 15-11-2026

NMMS స్కాలర్‌షిప్‌కు ఎలా దరఖాస్తు చేయాలి?

1. ముందుగా bse.ap.gov.in అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయాలి.

2. NMMS 2026-27 పరీక్షకు సంబంధించిన లింక్‌ను ఎంచుకోవాలి.

3. పాఠశాల, విద్యార్థి వివరాలను నమోదు చేయాలి.

4. అవసరమైన ధ్రువపత్రాల వివరాలను సమర్పించాలి.

5. కేటగిరీకి అనుగుణంగా పరీక్ష ఫీజు చెల్లించాలి.

6. దరఖాస్తును సబ్మిట్ చేసి, భవిష్యత్ అవసరాల కోసం ప్రింట్/కాపీని భద్రపరచుకోవాలి.

అర్హత కలిగిన 8వ తరగతి విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు కూడా అర్హులైన విద్యార్థులను NMMS పరీక్షకు దరఖాస్తు చేయించేలా చర్యలు తీసుకోవాలి.

అధికారిక వెబ్‌సైట్ క్లిక్ హియర్

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe
Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *