Admit Cards

TS Inter 1st Year Hall Tickets OUT 2026: డౌన్లోడ్ లింక్, పూర్తి వివరాలు… ఇలా చెక్ చేసుకోండి?

calendar_month February 19, 2026 person chitra

TS Inter 1st Year Hall Tickets OUT 2026: డౌన్లోడ్ లింక్, పూర్తి వివరాలు… ఇలా చెక్ చేసుకోండి?

Telangana Inter 1st Year admit card:

తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యార్థులకు కీలక అప్‌డేట్ వచ్చింది. Telangana Board of Intermediate Education (TGBIE) ఆధ్వర్యంలో నిర్వహించే ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు అధికారికంగా విడుదలయ్యాయి. ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు ఫిబ్రవరి 25వ తేదీ నుండి మార్చి 17వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు తమ హాల్ టికెట్లను ఆన్‌లైన్‌లో సులభంగా డౌన్లోడ్ చేసుకునేలా విద్యాశాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

Hall Tickets Release Date:

తెలంగాణ ఇంటర్ 1st ఇయర్ హాల్ టికెట్లు ఫిబ్రవరి 18, 2026 (బుధవారం) న విడుదల చేశారు. విద్యార్థులు కాలేజ్ లాగిన్, అధికారిక వెబ్‌సైట్ మరియు వాట్సాప్ ద్వారా హాల్ టికెట్లు పొందవచ్చు.

విద్యాశాఖ ప్రకటన ప్రకారం:

1. కాలేజీ లాగిన్ ద్వారా హాల్ టికెట్ డౌన్లోడ్ చేసే అవకాశం ఉంది.

2. కాలేజీ యాజమాన్యం, విద్యార్థుల తల్లిదండ్రుల రిజిస్టర్ చేసిన వాట్సాప్ నంబర్లకు హాల్ టికెట్ పంపిస్తుంది.

3. అధికారిక వెబ్‌సైట్ ద్వారా విద్యార్థులు నేరుగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

4. మొత్తం మూడు విధాలుగా హాల్ టికెట్ అందుబాటులో ఉంటుంది:

TS Inter 1st Year Hall Tickets 2026 – డౌన్లోడ్ విధానం:

1. ముందుగా అధికారిక వెబ్‌సైట్: https://tgbie.cgg.gov.in ను సందర్శించండి.

2. హోమ్‌పేజీలో “Telangana Intermediate 1st Year 2026 Hall Tickets Download” అనే లింక్‌పై క్లిక్ చేయండి.

3. మీ Roll Number / Hall Ticket Number మరియు Date of Birth నమోదు చేయండి.

4. Submit బటన్‌పై క్లిక్ చేయండి.

5. మీ హాల్ టికెట్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.

6. వెంటనే డౌన్లోడ్ చేసి ప్రింట్ అవుట్ తీసుకోండి.

హాల్ టికెట్‌లో చెక్ చేయాల్సిన వివరాలు:

1. విద్యార్థి పేరు

2. ఫోటో & సంతకం

3. సబ్జెక్టుల వారీగా పరీక్ష తేదీలు

4. పరీక్ష సమయం

5. పరీక్ష కేంద్రం వివరాలు

6. ఏదైనా తప్పులు ఉంటే వెంటనే మీ కాలేజీ అధికారులను సంప్రదించండి.

TS Inter 1st Year Hall Tickets Download Link : Click Here

For More Jobs Information: 

Follow Our What’s App Channel : Join Now

Follow Our Telegram Channel : Join Now

Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *