AP Jobs

త్వరలో 10,060 పోస్టులతో ఏపీ జాబ్ క్యాలెండర్ 2026 – పూర్తి వివరాలు:

calendar_month March 14, 2026 person chitra

త్వరలో 10,060 పోస్టులతో ఏపీ జాబ్ క్యాలెండర్ 2026 – పూర్తి వివరాలు

AP Job Calendar 2026:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిరుద్యోగులకు ప్రభుత్వం నుంచి పెద్ద గుడ్ న్యూస్ రానుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం ఉగాది సందర్భంగా జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అదే ప్రకారం AP Job Calendar 2026 విడుదలకు సంబంధించిన ప్రాథమిక పనులు ఇప్పటికే పూర్తయ్యాయని అధికారిక వర్గాలు తెలియజేశాయి.

ప్రస్తుతం రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీలను గుర్తించి సుమారు 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ విడుదల చేసే దిశగా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

ఇటీవల ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో శుక్రవారం అన్ని శాఖల ఉన్నతాధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వివిధ శాఖలలో ఉన్న ఖాళీల వివరాలను పరిశీలించారు.

విభాగాల వారీగా ఖాళీలు :

1.విద్యాశాఖ & ఇంటర్మీడియట్ విద్యాశాఖలో – 3000 పోస్టులు

2.విశ్వవిద్యాలయాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు – 1500 పోస్టులు

3. పోలీస్ శాఖలో ఎస్సై & కానిస్టేబుల్ – 3000 పోస్టులు

4. ఏఈ (Assistant Engineer) పోస్టులు – 500 పోస్టులు

5. సంక్షేమ వసతి గృహ వార్డెన్లు – 200 పోస్టులు

6. అటవీ శాఖలో – 100 పోస్టులు

7. గ్రూప్-1 పోస్టులు – 100 పోస్టులు

8. గ్రూప్-2 పోస్టులు – 500 పోస్టులు

9. స్టాటిస్టిక్స్ ఆఫీసర్ పోస్టులు – 200 పోస్టులు

10.ఈ ఖాళీల ఆధారంగా మొత్తం 10,060 ఉద్యోగాలను భర్తీ చేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

అయితే, AP Job Calendar 2026లో తుది ఖాళీల సంఖ్య మరియు విభాగాల వారీ వివరాలను త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో చర్చించి అధికారికంగా ప్రకటించనున్నట్లు సమాచారం.

AP JOB CALENDAR ALL DETAILS: CLICK HERE

For More Jobs Information: 

Follow Our What’s App Channel : Join Now

Follow Our Telegram Channel : Join Now

Follow Our Instagram Channel : Join Now

Follow Our Youtube Channel : Join Now

 

 

Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *