ఆంధ్రా యూనివర్సిటీ జాబ్ మేళా 2026: రేపే 12 కంపెనీలతో మెగా ఉద్యోగావకాశాలు.. 1060 ఖాళీలు
ఆంధ్రా యూనివర్సిటీ జాబ్ మేళా 2026: రేపే 12 కంపెనీలతో మెగా ఉద్యోగావకాశాలు.. 1060 ఖాళీలు..
ఆంధ్రా యూనివర్సిటీ జాబ్ మేళా 2026:
నిరుద్యోగ యువతకు ఆంధ్రా యూనివర్సిటీ నుంచి మరో మంచి అవకాశం అందుబాటులోకి వచ్చింది. విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ ఎంప్లాయ్మెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ గైడెన్స్ బ్యూరో (UEIGB) ఆధ్వర్యంలోని మోడల్ కెరీర్ సెంటర్లో జూలై 15, 2026న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఈ ఉద్యోగ మేళాలో మొత్తం 12 ప్రముఖ ప్రైవేట్ కంపెనీలు పాల్గొనగా, 1060 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
10వ తరగతి, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, బీటెక్, ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ వాక్-ఇన్ ఇంటర్వ్యూలకు హాజరయ్యే అవకాశం ఉంది.
జాబ్ మేళాలో పాల్గొనే ప్రముఖ సంస్థలు : సంస్థల వారీగా ఖాళీలు – అర్హతలు – జీతం :
| సంస్థ | పోస్టులు | ఖాళీలు | అర్హత | జీతం |
|---|---|---|---|---|
| Apollo Pharmacies | Pharmacist, Pharmacy Trainee, Pharmacy Assistant | 100 | 10వ తరగతి నుండి M/B.Pharm వరకు | రూ.19,000 |
| Deccan Fine Chemicals | Chemist, Sr. Chemist, Maintenance | 120 | B.Sc (Chemistry), Mechanical Diploma | రూ.20,455 |
| Hero | Production Supervisor, FLT Operator, Helpers | 100 | 10వ, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ | రూ.21,000 వరకు |
| Navata Road Transport | Cashier, Clerk, Logistics Executive, Driver | 30 | SSC, ఇంటర్, డిగ్రీ | రూ.12,000 నుండి |
| NIIT – Axis Bank – Tata AIG – RBL Bank | Assistant Manager, Sales Manager, Relationship Manager | 90 | Any Degree / B.Tech | రూ.9 లక్షల వార్షిక వేతనం వరకు |
| NS Instruments | Machine Operator | 200 | Diploma, ITI, B.Sc | రూ.16,400 వరకు |
| Quess Corp – Kia India | NAPS Trainees | 100 | Diploma / B.Tech | రూ.18,250 వరకు |
| THK India | Machine Operator | 100 | Mechanical Diploma / B.Tech | రూ.20,000 వరకు |
| Tristar Motors | Sales, Team Leader, Accountant | 40 | Degree, B.Com, M.Com | రూ.12,000 – రూ.25,000 |
| Vermeiren | Machine Operator | 100 | 10వ, ITI, Diploma | రూ.17,700 (నెట్) |
| Vistaar Financial Services | Customer Relationship Officer | 30 | ఇంటర్ నుండి డిగ్రీ | రూ.16,575 |
| Youth4Jobs | Customer Service Associate, Pickers & Packers | 50 | Hearing Impaired అభ్యర్థులు | రూ.12,000 వరకు |
వయోపరిమితి :
సంస్థను బట్టి కనీసం 18 సంవత్సరాలు నుంచి గరిష్టంగా 45 సంవత్సరాల వరకు వయస్సు కలిగిన అభ్యర్థులు అర్హులు.
జీతభత్యాలు :
ఎంపికైన అభ్యర్థులకు పోస్టును బట్టి నెలకు సుమారు రూ.12,000 నుంచి రూ.25,000 వరకు వేతనం లభించనుంది. కొన్ని సంస్థల్లో వార్షికంగా రూ.9 లక్షల వరకు (LPA) ప్యాకేజీ కూడా అందించే అవకాశం ఉంది.
ఉద్యోగ మేళా వివరాలు :
తేదీ: 15 జూలై 2026
సమయం: ఉదయం నిర్వహణ షెడ్యూల్ ప్రకారం
వేదిక: మోడల్ కెరీర్ సెంటర్, UEIGB, ఆంధ్రా యూనివర్సిటీ, విశాఖపట్నం
మొత్తం కంపెనీలు: 12
మొత్తం ఖాళీలు: 1060
తీసుకురావాల్సిన పత్రాలు :
ఉద్యోగ మేళాకు హాజరయ్యే అభ్యర్థులు కింది పత్రాలను తప్పనిసరిగా వెంట తీసుకురావాలి.
అప్డేట్ చేసిన Resume
విద్యార్హతల సర్టిఫికెట్లు
ఆధార్ కార్డు
పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు
అవసరమైన ఇతర ధృవపత్రాలు
గమనిక: ఉద్యోగ మేళాకు హాజరయ్యే అభ్యర్థులు తమ అర్హతలకు అనుగుణంగా సంబంధించిన అన్ని ఒరిజినల్ మరియు జిరాక్స్ పత్రాలను వెంట తీసుకురావడం మంచిది. వాక్-ఇన్ ఇంటర్వ్యూల ద్వారా నేరుగా ఎంపిక ప్రక్రియ నిర్వహించబడుతుంది.