Private Jobs

ఆంధ్ర యూనివర్సిటీలో భారీ జాబ్ మేళా 2026.. 770 ఉద్యోగాలకు రేపే ఇంటర్వ్యూలు.. 10వ తరగతి నుంచి డిగ్రీ వరకు అర్హత…

calendar_month July 7, 2026 person chitra

ఆంధ్ర యూనివర్సిటీలో భారీ జాబ్ మేళా 2026.. 770 ఉద్యోగాలకు రేపే ఇంటర్వ్యూలు.. 10వ తరగతి నుంచి డిగ్రీ వరకు అర్హత…

ఆంధ్ర యూనివర్సిటీ జాబ్ మేళా 2026 వివరాలు:

నిరుద్యోగ యువతకు శుభవార్త. విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ సౌత్ క్యాంపస్‌లోని మోడల్ కెరీర్ సెంటర్ (UEI&GB) ఆధ్వర్యంలో 2026 జూలై 8న (రేపు) మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఈ జాబ్ మేళాలో మొత్తం 9 ప్రముఖ కంపెనీలు పాల్గొనగా, 770 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు.

10వ తరగతి, ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లొమా, బీటెక్, బీ.ఫార్మసీ, డీ.ఫార్మసీ, ఎం.ఫార్మసీ, బీఎస్సీ, ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు తమ అర్హతలకు అనుగుణంగా ఈ ఉద్యోగాలకు హాజరుకావచ్చు.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

అభ్యర్థులు తమ విద్యార్హత సర్టిఫికెట్లు, బయోడేటా, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు మరియు అవసరమైన ఇతర పత్రాలతో నిర్ణీత సమయానికి జాబ్ మేళాకు హాజరు కావాలని నిర్వాహకులు సూచించారు.

జాబ్ మేళా పాల్గొనే కంపెనీలు – ఖాళీలు :

కంపెనీ ఉద్యోగాలు ఖాళీలు అర్హత వయస్సు వేతనం
Ageas Federal Life Insurance గ్రోత్ మేనేజర్, ఫైనాన్షియల్ అడ్వైజర్ 70 ఏదైనా డిగ్రీ & పై చదువు 18–45 సంవత్సరాలు రూ.3.0–5.0 LPA
Apollo Pharmacies ఫార్మసిస్ట్, ఫార్మసీ ట్రెయినీ, ఫార్మసీ అసిస్టెంట్ 100 M.Pharm / B.Pharm / D.Pharm / 10వ తరగతి నుంచి Any Degree (అనుభవం ఉన్నవారు) 18–40 సంవత్సరాలు రూ.19,000 వరకు
Hero ప్రొడక్షన్ సూపర్వైజర్, FLT ఆపరేటర్, ప్రొడక్షన్ హెల్పర్ తదితర పోస్టులు 100 10వ తరగతి / ఇంటర్ / డిప్లొమా / డిగ్రీ 18–33 సంవత్సరాలు రూ.15,000–21,000
Navata Road Transport క్యాషియర్, క్లర్క్, వెహికల్ హెల్పర్, హెవీ డ్రైవర్ 30 SSC / ఇంటర్ / డిగ్రీ 19–29 సంవత్సరాలు రూ.12,000–40,000
NIIT Ltd – Axis Bank అసిస్టెంట్ మేనేజర్ 20 ఏదైనా డిగ్రీ / బీటెక్ 18–30 సంవత్సరాలు రూ.4.4 LPA
NS Instruments India Pvt. Ltd. మెషిన్ ఆపరేటర్ 200 డిప్లొమా / ITI / B.Sc 18–26 సంవత్సరాలు రూ.16,400 వరకు
TATA AIG ఛానెల్ సేల్స్ మేనేజర్ 50 ఏదైనా డిగ్రీ / బీటెక్ 20–28 సంవత్సరాలు రూ.3.2 LPA
THK India Pvt. Ltd. మెషిన్ ఆపరేటర్ 100 బీటెక్ / మెకానికల్ డిప్లొమా 18–26 సంవత్సరాలు రూ.20,000 వరకు
Vermeiren మెషిన్ ఆపరేటర్ 100 10వ తరగతి / ITI / డిప్లొమా 18–26 సంవత్సరాలు రూ.17,700 (నెట్)

జాబ్ మేళా ముఖ్య వివరాలు :

జాబ్ మేళా తేదీ: 08 జూలై 2026

వేదిక: Model Career Centre (UEI&GB), Andhra University South Campus, విశాఖపట్నం

పాల్గొనే కంపెనీలు: 9

మొత్తం ఉద్యోగ ఖాళీలు: 770

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

అర్హతలు: 10వ తరగతి, ఇంటర్, ITI, డిప్లొమా, B.Sc, B.Tech, B.Pharm, M.Pharm, ఏదైనా డిగ్రీ

ఎంపిక విధానం: జాబ్ మేళాలో నిర్వహించే ఇంటర్వ్యూ ఆధారంగా

ఈ అవకాశాన్ని మిస్ అవ్వకండి!

ప్రైవేట్ రంగంలో ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతకు ఇది మంచి అవకాశం. వివిధ అర్హతలకు అనుగుణంగా ఉద్యోగాలు అందుబాటులో ఉండటంతో ఆసక్తి ఉన్న అభ్యర్థులు అవసరమైన ఒరిజినల్ సర్టిఫికెట్లు, రిజ్యూమ్‌తో కలిసి నిర్ణీత తేదీన జాబ్ మేళాకు హాజరై తమ అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చు.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe
Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *