తెలంగాణలో 125 అంగన్వాడీ టీచర్ ఉద్యోగాలు.. ఇంటర్ అర్హతతో మహిళలకు అవకాశం! TG WDCW Registration Begins For Filling Anganwadi Teacher Posts :
తెలంగాణలో 125 అంగన్వాడీ టీచర్ ఉద్యోగాలు.. ఇంటర్ అర్హతతో మహిళలకు అవకాశం! TG WDCW Registration Begins For Filling Anganwadi Teacher Posts :
అంగన్వాడీ టీచర్ పోస్టుల వివరాలు 2026 :
తెలంగాణలో అంగన్వాడీ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న మహిళా అభ్యర్థులకు శుభవార్త. రంగారెడ్డి జిల్లాలోని వివిధ ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో ఖాళీగా ఉన్న 125 అంగన్వాడీ టీచర్ పోస్టుల భర్తీకి అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత కలిగిన మహిళా అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులను స్వీకరిస్తున్నారు.
ఈ పోస్టులకు ఇంటర్మీడియట్ లేదా 12వ తరగతి ఉత్తీర్ణత విద్యార్హతగా నిర్ణయించారు. అర్హత, వయస్సు కలిగిన మహిళా అభ్యర్థులు ఆగస్టు 31, 2026 నుంచి సెప్టెంబర్ 10, 2026 సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :
సంస్థ పేరు : తెలంగాణ లో అంగన్వాడీ ఉద్యోగాలు
పోస్టుల వివరాలు :
రంగారెడ్డి జిల్లాలోని మొత్తం 7 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో ఈ ఖాళీలు ఉన్నాయి.
| ఐసీడీఎస్ ప్రాజెక్ట్ | ఖాళీలు |
|---|---|
| ఆమనగల్ | 31 |
| చేవెళ్ల | 29 |
| హయత్‌నగర్ | 3 |
| ఇబ్రహీంపట్నం | 21 |
| మహేశ్వరం | 10 |
| శేరిలింగంపల్లి | 5 |
| షాద్‌నగర్ | 26 |
| మొత్తం | 125 |
మొత్తం పోస్టులు : 125
విద్య అర్హతలు :
అంగన్వాడీ టీచర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే మహిళా అభ్యర్థులు తప్పనిసరిగా ఇంటర్మీడియట్ లేదా 12వ తరగతి పాసై ఉండాలి.
అభ్యర్థులు సంబంధిత విద్యార్హతకు సంబంధించిన మార్కుల జాబితా లేదా ధ్రువీకరణ పత్రాలను ఆన్‌లైన్ దరఖాస్తు సమయంలో స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.
వయోపరిమితి :
అభ్యర్థినుల వయస్సు 18 నుంచి 35 సంవత్సరాల లోపు ఉండాలి. 01-07-2026 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసి ఉండటం తప్పనిసరి.
స్థానిక అభ్యర్థులకు ప్రాధాన్యత :
మున్సిపాలిటీ పరిధిలోని పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థినులు సంబంధిత వార్డులో నివాసం కలిగి ఉండాలి. స్థానికతకు సంబంధించిన నిబంధనలను అభ్యర్థులు నోటిఫికేషన్‌లో పూర్తిగా పరిశీలించి దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం.. వెయిటేజీ మార్కులు :
అంగన్వాడీ టీచర్ పోస్టులకు అభ్యర్థుల ఎంపికలో విద్యార్హతతో పాటు ప్రత్యేక కేటగిరీలకు వెయిటేజీ మార్కులు కేటాయించారు. మొత్తం 100 మార్కుల ప్రాతిపదికన ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
ఇంటర్మీడియట్/12వ తరగతిలో సాధించిన మార్కులకు – 70 మార్కులు
వితంతువు అభ్యర్థులకు – 5 మార్కులు
జెజె చట్టం, 2015 ప్రకారం అనాథ అభ్యర్థులకు – 10 మార్కులు
RPWD చట్టం, 2016 ప్రకారం వికలాంగులకు – 5 మార్కులు
సెలక్షన్ కమిటీ నిర్వహించే ఇంటర్వ్యూకు – 10 మార్కులు
అభ్యర్థుల అర్హత, వెయిటేజీ, ఇతర నిబంధనలను పరిగణనలోకి తీసుకుని తుది ఎంపిక చేపడతారు.
దరఖాస్తు సమయంలో అవసరమైన ధ్రువపత్రాలు :
ఆన్‌లైన్ దరఖాస్తు సమయంలో అవసరమైన ధ్రువీకరణ పత్రాల స్కాన్ చేసిన కాపీలను అప్‌లోడ్ చేయాలి.
1.పుట్టిన తేదీ/వయస్సు ధ్రువీకరణ పత్రం
2. కుల ధ్రువీకరణ పత్రం
3. ఇంటర్మీడియట్/12వ తరగతి మార్కుల జాబితా
4. నివాస ధ్రువీకరణ పత్రం
5. వికలాంగ అభ్యర్థులకు వైద్యాధికారి ధ్రువీకరణ పత్రం
6. వితంతువు అభ్యర్థులకు భర్త మరణ ధ్రువీకరణ పత్రం
7. అనాథ అభ్యర్థులకు సంబంధిత సర్టిఫికేట్
8. స్పోర్ట్స్ సర్టిఫికేట్ (వర్తిస్తే)
9. మాజీ సైనికుల ధ్రువీకరణ పత్రం (వర్తిస్తే)
10. EWS సర్టిఫికేట్ (వర్తిస్తే)
అవసరమైన ధ్రువీకరణ పత్రాలను సంబంధిత నిబంధనల ప్రకారం సిద్ధం చేసుకుని ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలి.
ఎలా దరఖాస్తు చేయాలి?
అర్హత మరియు ఆసక్తి ఉన్న మహిళా అభ్యర్థులు సంబంధిత అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియలో వ్యక్తిగత వివరాలు, విద్యార్హత వివరాలు తదితర సమాచారాన్ని సరిగ్గా నమోదు చేయాలి.
అవసరమైన ధ్రువీకరణ పత్రాలను స్కాన్ చేసి అప్‌లోడ్ చేసిన తర్వాత దరఖాస్తును నిర్ణీత గడువులోపు సమర్పించాలి. దరఖాస్తుతో పాటు అవసరమైన ధ్రువీకరణ పత్రాలు నిబంధనల ప్రకారం గెజిటెడ్ అధికారి చేత అటెస్టేషన్ చేయించాల్సి ఉంటుంది.
ఆన్‌లైన్ దరఖాస్తుకు అధికారిక వెబ్‌సైట్: wdcw.tg.nic.in
ముఖ్యమైన తేదీలు :
ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ: 31 ఆగష్టు 2026
ఆన్‌లైన్ దరఖాస్తుల చివరి తేదీ: 10 సెప్టెంబర్ 2026
Notification Click Here
Vacancy Detail Click Here
Application Form Click Here